MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • సిద్దార్ద్ 'టక్కర్' రివ్యూ

సిద్దార్ద్ 'టక్కర్' రివ్యూ

 ‘టక్కర్’ తనకు తెలుగులో మంచి రీ ఎంట్రీ మూవీ అవుతుందని హీరో సిద్ధార్థ్ కాన్ఫిడెన్స్ వ్య‌క్తం చేశారు. మ‌రి ఆయ‌న న‌మ్మ‌కం నిజ‌మైందా.. ట‌క్క‌ర్ ప్రేక్ష‌కుల‌ను మెప్పించిందా? 

3 Min read
Surya Prakash
Published : Jun 09 2023, 01:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
17
takkar movie review

takkar movie review

సిద్దార్ద్ కు ఎప్పుడో  చాలా కాలంతెలుగులో  'బొమ్మరిల్లు' తో  హిట్ వచ్చింది. అది ఎంత పెద్ద హిట్ అంటే ఇప్పటికి ఆ సినిమాలో క్లైమాక్స్ డైలాగుకు పేరడీలు వస్తున్నాయి. అప్పటి నుంచి సిద్దార్ద్ ఆ ఇమేజ్ నుంచి బయిటకు రాలేక, ముందుకు వెళ్లలేక సతమతమవుతూ రకరకాల జానర్స్ ట్రై చేస్తున్నాడు. రీసెంట్ గా మాస్ హీరోగా సెటిల్ అయ్యిపోదామని మహాసముద్రంలో దూకాడు. మునిగిపోయినా మాస్ జపమే కంటిన్యూ చేస్తూ  ..ఇదిగో  'టక్కర్' అంటూ మన ముందుకు వచ్చాడు. తెలుగు,తమిళ భాషల్లో రిలీజైన ఈ చిత్రం సిద్దార్ద్ కు హిట్ ఇచ్చిందా...?
 

27
Asianet Image

స్టోరీ లైన్:
చేతినిండా పని, జేబు నిండా డబ్బు లేకపోవటంతో ఫ్రస్టేషన్‌ కు ప్రతినిథి లా ఉంటాడు  గుణశేఖర్ (సిద్దార్థ్) . ఆ రెండు సాధించటానికి వైజాగ్ వచ్చి కారు డ్రైవర్ గా లైఫ్ స్టార్ట్ చేస్తాడు. అదే వైజాగ్ లో  రాజ్ (అభిమన్యు సింగ్) ది కిడ్నాప్ వ్యాపారం. అమ్మాయిలను కిడ్నాప్ చేయటం ...డబ్బు ఇచ్చి వాళ్ల వాళ్లు తీసుకెళ్లకపోతే విదేశాలకు అమ్మేయటం చేస్తూంటాడు. ఓ సారి అనుకోకండా ఆ కిడ్నాప్ గ్యాంగ్ ...  ఓసారి గుణ శేఖ‌ర్ కారు ఎక్కుతారు. వారిని పోలీసుల‌ను నుంచి త‌ప్పించ‌టానికి గుణ శేఖ‌ర్ స‌గం డ‌బ్బులు ఇవ్వాల‌ని డీల్ మాట్లాడుకుంటాడు. కానీ వాళ్లు ఇవ్వ‌కుండా జంప్. 
 
ఆ తర్వాత  కిడ్నాప్ గ్యాంగ్ తో తలపడ్డ గుణశేఖర్... వాళ్ల అడ్డాకి వెళ్లి వాళ్ల కారు ఎత్తుకొస్తాడు. ఆ కారు డిక్కీలో ... లక్కీ (దివ్యాంశ కౌశిక్) ఉంటుంది. ఆమెతో అంతకు ముందై పరిచయం..ఇప్పుడు మరో సారి  ప్రయాణం మొదలవుతుంది. ఈ క్రమంలో  అతను ఆమెను కాపాడాడా లేక తనకు ఇన్నాళ్లకు లక్షలు సంపాదించే అవకాసం వచ్చిందని ఆమెను కిడ్నాపర్స్ కు పట్టించాడా...కోటీశ్వరరాలు అయిన లక్కీకు ఇంట్లో ఉన్న సమస్యలు ఏమిటి..వాటిని ఆమె అధిగమించిందా ...ఫైనల్ గా ఏమైందనేది మిగతా కథ.

37
Asianet Image


విశ్లేషణ:

దర్శకుడు కార్తీక్ ... వేర్వేరే నేపధ్యం నుంచి ఇద్దరు వ్యక్తులు ..డబ్బు, జీవితం పట్ల వేర్వేరు ధృక్పదాలు, ఆలోచనలు కలిగి ఉంటారు. అలాంటి ..వాళ్లు కలిస్తే అదీ..వాళ్ళిద్దరూ అమ్మాయి,అబ్బాయి అయితే వాళ్ల జర్నీ ఎలా ఉంటుంది. మధ్యలో ఓ కిడ్నాప్ గ్యాంప్... వింటానికి  కొంచెం ఇంట్రస్టింగ్ గా  చాలా ప్రెడిక్టబుల్ గా ఉంది కదా. కానీ సమర్దడైన స్క్రీన్ ప్లే రైటర్, డైరక్టర్ ఇలాంటి లైన్ ని కూడా ఓ ఫెరఫెక్ట్ రొమాంటిక్ కామెడీగా మార్చగలగుతాడు. కానీ ఈ టీమ్ లో అంత సమర్దత లేదు అని మనకు సినిమా ప్రారంభమైన అరగంటకు తెలిసిపోతుంది. అయినా ఓ డబ్బున్న పిల్ల, డబ్బు కోసంవెంపర్లాడే మిడిల్ క్లాస్  అబ్బాయి  కలిస్తే అనే పాయింట్ దగ్గరే తర్వాత ఏం జరుగుతుందో తెలిసిపోతుంది. దానికి తగినట్లు హీరోయిన్ డిక్కీలో ఉండటం, కిడ్నాప్ లు ఎప్పుడో మనం ఇలాంటివి చూసేసాం. దాంతో ఎక్కడా కొత్త అనిపించదు. దానికి తగినట్లు ఈ దర్శకుడు  సీన్ కో జానర్ చేంజ్ చేసేస్తూంటాడు. తాను అన్ని జానర్స్  డీల్ చేయగలను అని చెప్పటానికో ఏమో కానీ అలా  సీన్స్ ని డిజైన్ చేసేసుకున్నాడు. దాంతో మనకు చాలా సీన్స్ ఫోర్సెడ్, బోర్ గా కనిపిస్తూంటాయి. కొన్ని చోట్ల సినిమా నవ్వు రాలేదని అనలేం. అలాగే కొన్ని చోట్ల థ్రిల్ చేద్దామని కష్టపడటం కనపడుతుంది. అయితే ఏదీ సంపూర్తిగా ఇవ్వడు. యోగిబాబు వన్ లైనర్స్ కొన్ని సార్లు బాగుంటాయి. మరికొన్ని సార్లు సిద్దార్ద్ ఫైట్స్ బాగుంటాయి. అయితే ఉపయోగం ఏముంది...ఏదీ మనని ఎమోషనల్ గా కట్టిపారేయలేనప్పుడు. సిద్దార్ద పాత్ర మీద సానుభూతి వచ్చినా దాన్ని ఫాలో అవుతాం. అదీ ఉండదు. సినిమా చూస్తున్న మన మీద మనకు సానుభూతి వస్తుంది కాసేపటికి.  ఏదైమైనా ప్లాట్ నేరేషన్ తో కథలు చూసే కాలం చెల్లిపోయింది. ఓటిటి యుగంలో ఓ టీ తాగి వచ్చి మళ్లీ కంటిన్యూ చేద్దామనుకునేటంత తీరికా,ఓపికా లేదు. ఒక్కసారి డిస్ కనెక్ట్ అయ్యారా.ఇంక అంతే.
 

47
Asianet Image

 
ఫెరఫార్మెన్స్ వైజ్

ఈ సినిమాలో సిద్దార్ద్ కే ఎక్కువ మార్కులు. ఎందుకంటే చాలా చోట్ల సీన్స్ సపోర్ట్ చేయకపోయినా తనకు అలవాటైన నటనతో మేనేజ్ చేసుకుంటూ పోయాడు. హీరోయిన్ దివ్యాంశలో ఆ దివ్య..అంశ కనపడలేదు. యోగిబాబు కాసేపు నవ్వించాడు. అభిమన్యుసింగ్ ... విలన్ కాబట్టి మనం  భయపడినట్లు నటించాలి..మిగతా పాత్రలు అదే చేసాయి.

టెక్నికల్ గా..
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ బాగా డిజైన్ చేసారు. యాక్షన్ కొరియోగ్రాఫర్స్ బాగా కష్టపడ్డారు. స్క్రిప్టు సహకరించలేదు కాబట్టి డైరక్టర్ చేతులు ఎత్తేసాడు. ప్రసన్న మ్యూజిక్ సోసోగా ఉంది. పాటలు ఏమీ గొప్పాగా లేదు..ప్లేస్మెంట్ కుదరలేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే. కెమెరా వర్క్, ఎడిటింగ్ ఛల్తా అంతే. 
 

57
Asianet Image

 బాగున్నవి? 
ఇంట్రస్టింగ్ గా మొదలైన సినిమా
ఇంటర్వెల్ 

బాగోలేనివి 
ఎక్కడా ఎమోషన్ ని ఇవ్వని పాత్రలు
పాతకాలం కామెడీ
విలన్ ట్రాక్ రొటీన్ గా ఉండటం
 

67
Asianet Image

Final Thoughts:

ఓవరాల్ గా...ఏ ఎక్సైట్మెంట్ లేకుండా చివరి దాకా ఓ క్రైమ్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ ని...... ప్లాట్ గా  నడపటం అంటే మామూలు విషయం కాదు..అందులో టీమ్ సక్సెస్ అయ్యింది. నిద్రపోకుండా చూస్తే మనమూ సక్సెస్ అయ్యినట్లే.

 --సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2

77
Asianet Image

నటీనటులు: సిద్దార్థ్, దివ్యాంశ, అభిమన్యు సింగ్, యోగిబాబు, మునిష్ కాంత్, ఆర్జే విగ్నేశ్వర్ తదితరులు
సంగీతం: నివాస్ కే ప్రసన్న 
సినిమాటోగ్రాఫర్: వంచినాథన్ మురుగేషన్ 
ఎడిటర్: జీఏ గౌతమ్ 
ఆర్ట్ డైరెక్షన్: ఉదయ కుమార్ కే 
స్టంట్స్: దినేష్ కాశీ 
 రచన, దర్శకత్వం: కార్తీక్ జీ క్రిష్ 
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ 
సహ నిర్మాత: వివేక్ కుచిబొట్ల 
రిలీజ్ డేట్: 2023-05-26
 

Surya Prakash
About the Author
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా. Read More...
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved