MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • #Dunki: షారూఖ్ ‘డంకీ’ మూవీ రివ్యూ

#Dunki: షారూఖ్ ‘డంకీ’ మూవీ రివ్యూ

పఠాన్‌, జవాన్‌లో యాక్షన్‌తో సందడి చేసిన  షారూఖ్ ఖాన్  ఈ సారి ‘డంకీ’తో నవ్వులు పంచుతూ.. భావోద్వేగానికి గురిచేయాలని మన ముందుకు వచ్చారు. అయితే ఆయన అనుకున్నట్లు చేయగలిగారా

5 Min read
Surya Prakash
Published : Dec 21 2023, 02:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
Dunki

Dunki


ఈ సంవత్సరం  'ప​​​​ఠాన్', 'జవాన్'తో రెండు వరస సూపర్ హిట్స్  అందుకున్న షారుక్​ మూడో సినిమా‘డంకీ’తో థియేటర్లలోకి వచ్చారు. ఆ రెండు పక్కా యాక్షన్ సినిమాలు ..ఇది సొసైటి పై ప్రస్తుతం జరుగుతున్న విషయాలపై రియాక్షన్స్ గా అందరూ భావించారు. ఫ్యాన్స్  కోసమో, మరొకరి కోసమో కాకుండా తన కోసం తాను నటించిన సినిమా ‘డంకీ’ అని షారుక్‌ తెలిపారు. ఆయన  ఎంతో నమ్మి చేసిన ఈ సినిమా కేవలం షారూఖ్ కోసం కాకుండా దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరాణీ (Rajkumar Hirani) కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది..కథేంటి...షారూఖ్ కు హ్యాట్రిక్ ఇవ్వగలిగిందా వంటి విషయాలు చూద్దాం. 

210


స్టోరీ లైన్

ఇది ఐదుగురు ప్రెండ్స్  కథ. విదేశాలకు వెళ్లాలనే జీవితాశయం పెట్టుకున్న వారి కథ. అయితే విదేశాలకు వెళ్లటానికి తగ్గ వనరులు అంటే డబ్బు, ఇంగ్లీష్ మాట్లాడటం కూడా రాని వారి కథ.   వాళ్లు ఎవరు అంటే మను(తాప్సి), బుగ్గు(విక్రమ్ కొచ్చర్), బల్లి(అనిల్ గ్రోవర్) . వీళ్లంతా పంజాబ్ లోని ఓ మాములు ఊర్లో ఆర్ధిక సమస్యలతో బ్రతుకు లాగుతూంటారు.  మనం ఇక్కడ అంతా అమెరికా వెళ్లాలని ఎలా అనుకుంటామో అక్కడ వారికి లండన్ వెళ్లి బాగా డబ్బులు సంపాదించాలనుకునే కోరిక.  కానీ వీరికి అందుకు తగ్గ నాలెడ్జ్ , చదువు లేదు. దాంతో  చాలా మంది లాగే  ఫేక్ వీసా కన్సల్టెన్సీలను నమ్మి మోసపోతారు. అప్పుడు వాళ్ల ఊరికి ప‌ఠాన్ కోట్ నుంచి జ‌వాన్  హార్డీ సింగ్ (షారుక్‌ ఖాన్‌) వ‌స్తాడు. అతను వచ్చింది ...తనను కాపాడిన మను వాళ్ళ అన్నయ్యకు థాంక్స్ చెప్పుకోవాలని. కానీ అతను అప్పటికే చనిపోవటం, వీళ్ల సిట్యువేషన్ ,బాధలు, ఆశలు చూస్తాడు. వీళ్లని లండన్ తీసుకెళ్లి ఒడ్డున పడేయాలి అనుకుంటాడు.  

310


అ క్రమంలో  సక్రమ మార్గంలో ప్రయత్నించి విసిగిపోతాడు. అప్పుడు వాళ్లు డాంకీ ట్రావెల్‌ కు ఫిక్స్ అవుతారు.  దేశ సరిహద్దులగుండా అక్రమంగా ప్రయాణించడమే డాంకీ ట్రావెల్‌ . పంజాబీ వాళ్లు దానిని ‘డంకీ’ (Dunki) అని పిలుస్తుంటారు. మన దేశం నుంచి అడ్డ దారుల్లో  ఎన్నో దేశాలు దాటి యూకేలోకి అక్రమంగా ప్రవేశించాలని డిసైడ్ అవుతారు. అయితే అది అనుకున్నంత ఈజీకాదు.  హార్డీ సింగ్ ఆధ్వర్యంలో  డాంకీ ట్రావెల్‌ మొదలెట్టిన వాళ్లు ఎదుర్కొన్న ఛాలెంజ్ లు ఏమిటి?చివరకు వాళ్లు తమ లక్ష్యం చేరుకున్నారా?మను,హార్డీ మధ్య ఏం జరుగుతుంది... గులాటి (బొమ‌న్ ఇరానీ) పాత్ర ఏమిటి, దొంగదారిలో వారు పడిన కష్టాలు,కన్నీళ్లు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

410

ఎలా ఉంది..

డైరక్టర్ గా రాజ్‌ కుమార్‌ హిరాణీ  ది ఓ ప్రత్యేకమైన బాణి. సీరియస్ సమస్యలను ఫన్ తో కలగలిపి ఎంగేజింగ్ గా చెప్పటం ఆయన స్పెషాలిటీ. 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' , 'లగే రహో మున్నాభాయ్',  '3 ఇడియట్స్', 'సంజు', 'పీకే' ఇలా ఏది చూసుకున్నా తమదైన ప్రత్యేకత,ఫీల్  కలిగి ఉంటాయి. కమర్షియల్ గానూ అవన్నీ బ్లాక్ బస్టర్ సినిమాలు.  అయితే ఆయన తీసిన కొత్త సినిమా 'డంకీ' మాత్రం ఆ స్దాయిలో లేదు. స్టోరీ టెల్లింగ్ తో స్టార్స్ ని క్యారక్టర్స్ గా మార్చి మనకు దగ్గర చేసే ఆయన ఈ సారి తడబడ్డాడనే చెప్పాలి. పెద్ద పెద్ద డైలాగులు, VFX సీన్స్ లేకపోవటం దాకా రిలీఫ్ అనిపించినా అంతకు మించి ఏమీ లేదు అని పిస్తుంది. అంతకు మించి మన సౌతిండయన్స్ అంతగా కనెక్ట్ అయ్యే కథ కూడా కాదు. ఇక్కడ మనకు అక్రమ ప్రయాణాలు,illegal immigrants కథలు మనకు అంతగా లేవు. అక్కడక్కడా దుబాయి వంటి దేశాలకు వెళ్లిన కూలీల  కథలు మనం పట్టించుకోము. ప్రయారిటీ ఇవ్వము. దాంతో ఆ సమస్యకు కనెక్ట్ కాక, అలాగే కాస్త ఛాదస్తంగా చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్తున్నట్లు అనిపించే సీన్స్ తో ఇబ్బందిగా అనిపిస్తుంది.

510


 ఐదేళ్ల గ్యాప్ తర్వాత రాజ్‌ కుమార్‌ హిరాణీ ఇలాంటి కథ ఎత్తుకున్నాడేంటి అనిపిస్తుంది. పంజాబ్ లో మొదలైన ఈ కథ లండన్, మిడిల్ ఈస్ట్ తో ముగుస్తుంది. షారూఖ్ వంటి స్టార్ ఎట్రాక్షన్ ని మరిపిస్తూ హిరానీ తన సపోర్టింగ్ నటులుతో ప్లే చేసారు. ఫీల్ గుడ్ హ్యూమర్, సింపుల్ ఎప్రోచ్ కొంత వరకూ నచ్చుతుంది. అయితే షారూఖ్ తెరపై కథను ముందుకు లాగుతూంటాడు. మనకేమీ అనిపించదు. ఆ పాత్ర  ఫీల్ అయ్యినట్లు మనం ఫీల్ కాలేము. ఫస్టాఫ్ పగలబడి నవ్వేటంత లేకపోయినా ఫన్ తో నడిపోతుంది. వీసా ట్రైల్స్, ఇంగ్లిష్‌ నేర్చుకోవ‌డం, డంకీ రూట్లో ఇంగ్లండ్‌కు డిసైడ్ అవ్వటంతో  ఫస్టాఫ్ ముగుస్తుంది. ఆ తర్వాత సెకండాఫ్ లోనే అసలు సమస్య వచ్చింది. అక్కడకు వచ్చేసరికి ఒకటే విషయం. అదే దొంగదారిలో పడే ఇబ్బందులు. ఒకటే విషయంతో నడుస్తూండటంతో  ప్లాట్  పలచన అయ్యి..కథ అక్కడక్కడే తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. కామెడీ కూడా చాలా ప్లాట్ గా అనిపిస్తూ చాలా లెంగ్తీ ఫిల్మ్ చూస్తున్నట్లు అనిపిస్తుంది.సెకండ్ హాఫ్ అంతా అక్రమంగా దేశాలు దాటేటప్పుడు వాళ్ళు పడ్డ బాధలు అన్ని వరస పెట్టి వస్తూంటాయి.  అక్రమంలో తమ దేశంలో ప్రవేశించే వాళ్లని ఎలా ట్రీట్ చేస్తారు? వాళ్లకు ఎదురయ్యే కష్టాలు ఏంటి అని ఎమోషనల్ గా చూపిస్తారు. అంతేకాదు ఇంగ్లాండ్ లో ఇల్లీగల్ గా బతికే వారి  కష్టాలు ఏకవరు పెట్టారు.   ఇక క్లైమాక్స్ హిరాణీ ...ఫన్ తో ముగిస్తూంటారు. ఈ సారి ఎమోషన్స్ తో నింపేసారు.ఆ సీన్స్ సైతం  హెవీగా అనిపిస్తుంది.  ఏదైమైనా ఇది హిరాణీ చేసిన వీక్ స్క్రిప్టు. 

610


టెక్నికల్ గా చూస్తే...

  క‌నికా థిల్లాన్ రాసిన ఈ క‌థ‌ కు సరైన స్క్రీన్ ప్లే అమరలేదేమో అనిపిస్తుంది. ఎమోషన్స్ ఉన్నాయి కానీ అవే ఎక్కువ ఉన్నాయి. కెమెరా వర్క్  నీట్ గా రియలిస్టిక్ గా అనిపిస్తుంది. చాలా చోట్ల మెయిన్ క్యారక్టర్స్ భావోద్వేగాలు పట్టుకోవటంపైనే కాన్సర్టేట్ చేసారు.  రాజ్ కుమార్ హిరాణీ ద‌ర్శ‌కుడిగా, ఎడిట‌ర్‌గా వంక పెట్టలేం. ఆయన స్టైల్ కథలో లేకపోయినా ఇక్కడ కనపడుతుంది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.  సెకండాఫ్ లో కొంత తగ్గిస్తే బాగుండేది అనిపిస్తుంది. పాటలు జస్ట్ ఓకే అనిపిస్తాయి. అమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని హైలెట్ చేసింది చాలా చోట్ల. 
 

710


నటీనటుల్లో ...
షారూఖ్ ని ఇలా సింపుల్ గా సామాన్యుడుగా చూడటం బాగుంది. సూపర్ స్టార్ మనకు ఎక్కడా కనపడనివ్వకపోవటం షారూఖ్ గొప్పతనం. ఫన్ చేయటంలో , ఎమోషన్స్ పండించటంలో షారూఖ్ పండిపోయారు. తాప్సీ గొప్పగా అనిపించదు కానీ ఆ పాత్రకు ఓకే. కొన్ని చోట్ల ఆమె కన్నీరు పెట్టిస్తుంది. అనిల్ గ్రోవ‌ర్, విక్ర‌మ్ కొచ్చ‌ర్, విక్కీ కౌశ‌ల్  కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు.  బొమ‌న్ ఇరానీ పంజాబీ ఇంగ్లిష్‌ ట్యూట‌ర్‌ పాత్ర‌లో ఫెరఫెక్ట్. రాజ్‌ కుమార్‌ హిరాణీ సినిమాల్లో ఆయనది ఎప్పుడూ ప్రత్యేకమైన పాత్రే దొరుకుతోంది. 

810


ప్లస్ లు 

ఫన్ ,మనకు తెలియని కొత్త సమస్యను తెరపై చూడటం
షారూఖ్ ని సామాన్యుడు గా చూపించటం

మైనస్ లు

ప్రెడిక్టబులిటీ 
 సెకండాఫ్ లో సాగుతున్న ఫీల్
నీరసమైన క్లైమాక్స్

910


ఫైనల్ థాట్

చేదు మాత్రని సుగర్ కోటింగ్ చేసి ఇచ్చే  రాజ్‌ కుమార్‌ హిరాణీ ఈ సారి చేదు మాత్రను చేదు మాత్రగానే ఇచ్చారు. ఆయన నుంచి వచ్చిన గత చిత్రాలతో పోలిక పెట్టుకుండా చూస్తే ఓకే అనిపిస్తుంది. షారూఖ్ కు హ్యాట్రిక్ మాత్రం కాదు. అయినా మనం ఐడింటిఫై చేసుకోలేని సమస్యతో మన మనస్సులను గెలవటం కష్టమే. 
Rating:2.5
--సూర్య ప్రకాష్ జోశ్యుల
 

1010


ఎవరెవరు..

బ్యానర్స్: జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ ఫిల్మ్స్‌; 
నటీనటులు: షారుక్‌ ఖాన్‌, తాప్సీ, విక్కీ కౌశల్‌, బొమన్‌ ఇరానీ, దియా మిర్జా, సతీశ్‌ షా, అనిల్‌ గ్రోవర్‌ తదితరులు;
 సినిమాటోగ్రఫీ: సి.కె.మురళీధరన్‌, మనుశ్‌ నందన్‌; 
ఎడిటింగ్‌: రాజ్‌కుమార్‌ హిరాణీ; 
నేపథ్య సంగీతం: అమన్‌ పంత్‌; 
పాటలు: ప్రీతమ్‌; 
నిర్మాతలు: గౌరీ ఖాన్‌, రాజ్‌కుమార్‌ హిరాణీ, జ్యోతి దేశ్‌పాండే; 
రచన: అభిజత్‌ జోషి, రాజ్‌కుమార్‌ హిరాణీ; 
దర్శకత్వం: రాజ్‌కుమార్‌ హిరాణీ; 
విడుదల తేదీ: 21-12-2023

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved