- Home
- Entertainment
- Movie Reviews
- రవితేజ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసా? మూడు ఇండస్ట్రీ హిట్స్ మిస్
రవితేజ రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసా? మూడు ఇండస్ట్రీ హిట్స్ మిస్
Raviteja Rejected Movies: మాస్ మహారాజా రవితేజ తన కెరీర్‌లో ఎన్నో చిత్రాలను వదులుకున్నారు. అయితే వాటిలో ఇండస్ట్రీ హిట్ మూవీస్ కూడా ఉన్నాయి. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం.

అసిస్టెంట్ నుంచి స్టార్ గా ఎదిగిన రవితేజ
మాస్ మహారాజా రవితేజ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం సూపర్ స్టార్ ఇమేజ్‌తో రాణిస్తున్నారు. రవితేజ హీరో అవడం అంత ఈజీగా జరగలేదు. సినిమాల్లో చిన్న బాయ్‌గా పనిచేయడం నుంచి స్టార్ట్ అయ్యింది కెరీర్. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. చిన్న చిన్న పాత్రలు పోషించారు. ఎన్నో చిత్రాల్లో గుర్తింపు లేని పాత్రలు చేశారు. క్రమంగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చాడు. ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నారు.
ఆనందం మూవీ
ఈ సందర్భంగా రవితేజ తన కెరీర్‌లో మిస్ చేసుకున్న మూవీస్ ఏంటో తెలుసుకుంటే, ఆ లెక్కన చాలా సినిమాలున్నాయి. ఇందులో బ్లాక్ బస్టర్ చిత్రాలుండటం విశేషం. మూడు ఇండస్ట్రీ హిట్స్ కూడా ఉంది. రవితేజ మిస్ చేసుకున్న మూవీస్‌లో `ఆనందం` ఒకటి. దర్శకుడు శ్రీనువైట్లతో అప్పటికే `నీకోసం` చిత్రం చేశాడు రవితేజ. ఇది మామూలుగానే ఆడింది. అయితే రవితేజ పూర్తి స్తాయి హీరోగా వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే కావడం విశేషం. అనంతరం శ్రీనువైట్ల `ఆనందం` కథని రవితేజకి చెప్పగా, అప్పటికే ఇతర ప్రాజెక్ట్ లతో బిజీగా ఉండటంతో నో చెప్పాడు. జై ఆకాష్, రేఖ వేదవ్యాస్ జంటగా నటించిన `ఆనందం` డీసెంట్ హిట్‌గా నిలిచింది.
అల్లు అర్జున్ `ఆర్య`
రవితేజ మిస్ చేసుకున్న బ్లాక్ బస్టర్ మూవీ `ఆర్య`. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటించారు. ఈ మూవీ స్టోరీని రవితేజకి కూడా చెప్పించారు దిల్ రాజు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీకి మాస్ రాజా కనెక్ట్ కాలేదు. దీంతో నో చెప్పారు. ఈ మూవీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. అల్లు అర్జున్‌కి కెరీర్ టర్నింగ్ మూవీగా నిలిచింది. ఈ మూవీతో ఒక మంచి బ్లాక్ బస్టర్‌ని రవితేజ మిస్ చేసుకున్నారని చెప్పొచ్చు.
సుమంత్ `గోదావరి`
రవితేజ నో చెప్పిన మరో మూవీ `గోదావరి`. సుమంత్, కమలినీ ముఖర్జీ నటించిన చిత్రమిది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. కూల్ ఫీల్‌గుడ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ కథని మొదట రవితేజకే చెప్పారట శేఖర్ కమ్ముల. అప్పటికే రాజమౌళితో `విక్రమార్కుడు` చేస్తున్న నేపథ్యంలో దీనికి నో చెప్పాల్సి వచ్చిందట. అలా ఈ చిత్రాన్ని రవితేజ వదులుకోవాల్సి వచ్చింది.
మహేష్ బాబు `పోకిరి`
అలాగే రవితేజ వదులకున్న చిత్రాల్లో `పోకిరి` కూడా ఉంది. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ కథని రవితేజతో చేయాలనుకున్నారు. లైన్ కూడా చెప్పారు. కానీ అప్పటికే `నా ఆటోగ్రాఫ్` మూవీకి కమిట్ అయ్యాడు రవితేజ. అది బాగా నచ్చింది. దీంతో `పోకిరి`ని లైట్ తీసుకున్నాడు రవితేజ. ఈ మూవీని మహేష్ బాబు ఓకే చేశారు. ఇలియానా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
వెంకటేష్ `బాడీగార్డ్`
రవితేజ నో చెప్పిన చిత్రాల్లో `బాడీ గార్డ్` కూడా ఉంది. వెంకటేష్, త్రిష జంటగా నటించిన ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకుడు. మలయాళంలో వచ్చిన `బాడీగార్డ్`కిది రీమేక్. తెలుగులో ఇది డిజాస్టర్ అయ్యింది. అయితే ఈ సినిమా కథని కూడా గోపీచంద్.. రవితేజకి చెప్పారట. ఆ సమయంలో ఆయన `డాన్ శీను` చేస్తున్న నేపథ్యంలో ఈ మూవీ చేయడానికి కుదరలేదు. అలా ఓ ఫ్లాప్ మూవీని మిస్ చేసుకున్నాడు రవితేజ. ఓ రకంగా రిజెక్ట్ చేయడం మంచే జరిగింది.
పవన్ కళ్యాణ్ `గబ్బర్ సింగ్`
ఈ క్రమంలో మరో బ్లాక్ బస్టర్‌ని వదులుకున్నారు రవితేజ. అదే `గబ్బర్ సింగ్`. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. ఇది బాలీవుడ్‌లో వచ్చిన `దబాంగ్` మూవీకి రీమేక్. తెలుగులో రవితేజ హీరోగా రీమేక్ చేయాలనుకున్నారు హరీష్ శంకర్. ఆ సమయంలో వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ మూవీ చేయలేకపోయారు. అలా మరో ఇండస్ట్రీ హిట్‌ని మిస్ చేసుకున్నారు రవితేజ.
ఎన్టీఆర్ `జైలవకుశ`
వీటితోపాటు ఎన్టీఆర్ నటించిన `జై లవకుశ`కి కూడా రవితేజ నో చెప్పారట. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేశారు. బాబీ దర్శకత్వం వహించారు. ఈ మూవీ బాగానే ఆడింది. ఇలా మూడు ఇండస్ట్రీ హిట్ చిత్రాలను, మూడు డీసెంట్ హిట్ చిత్రాలను, ఒక డిజాస్టర్‌ని రవితేజ వదులుకున్నారు.
`మాస్ జాతర`తో వస్తోన్న రవితేజ
ప్రస్తుతం రవితేజ `మాస్ జాతర` చిత్రంలో నటించారు. ఈ మూవీ ఈ శుక్రవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ తో విడుదల కాబోతుంది. నిజానికి ఈ రోజే(అక్టోబర్ 31)న మూవీ విడుదల కావాల్సి ఉంది. కానీ `బాహుబలి ది ఎపిక్` కారణంగా ఒక్క రోజు గ్యాప్ ఇచ్చారు. `మాస్ జాతర`లో శ్రీలీల హీరోయిన్‌గా నటించింది. భాను భోగవరపు అనే నూతన దర్శకుడు రూపొందించారు. నాగవంశీ నిర్మించారు. వరుసగా పరాజయాల్లో ఉన్న రవితేజ ఈ మూవీతో హిట్ కొట్టాలని భావిస్తున్నారు. మరి అది ఎంత వరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.