‘టైగర్ నాగేశ్వరరావు’ రివ్యూ అండ్ రేటింగ్
రవితేజ (Raviteja) నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. స్టూవర్టుపురంలో పేరుమోసిన గజదొంగ ‘టైగర్ నాగేశ్వరరావు’ (Tiger Nageswararao) జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహించారు.
Tiger Nageswara Rao
ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలను గడగడలాడించిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు అనఫీషియల్ బయోపిక్ గా రూపొందిన చిత్రం ఇది. రవితేజ వంటి స్టార్ నటించటంతో గజదొంగ పాత్ర సైతం ఇప్పుడు నచ్చే విషయం గా మారబోతోంది. గజదొంగ పాత్రలో రవితేజ జీవించాడని చెప్పబడుతోన్న ఈ చిత్రం ఏ మేరకు ఈ జనరేషన్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటోంది. అసలు ఎవరీ టైగర్ నాగేశ్వరరావు. నిజంగానే బయోపిక్ తీసి తర్వాత తరాలకు అందించదగ్గ విషయం ఉన్న కథేనా, ఏమిటి ఈ గజదొంగ ప్రత్యేకత, లెంగ్త్ ఎక్కువ అవటాన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
Tiger Nageswara Rao Review-
స్టోరీ లైన్
ఇంటిలిజెన్స్ బ్యూరో అధికారి రాఘవేంద్ర రాజపుత్ (అనుపమ ఖేర్) ...నొటోరియస్ క్రిమినల్ టైగర్ నాగేశ్వరరావు (రవితేజ) గురించి వివరాలు తెలుసుకోవాలనకుంటాడు. అందుకు కారణం నాగేశ్వరరావు ..తాను ప్రధానమంత్రి ఆఫీస్ లో దొంగతనం చేస్తానని ఛాలెంజ్ విసరటమే. అక్కడ నుంచి అతను ఎవరనేది మనకు చెప్పటం మొదలవుతుంది. ‘గజదొంగ స్టూవర్ట్‌పురం నాగేశ్వర రావు 1970, 80లలో పోలీసులకు ఇతని పేరంటనే సింహ స్వప్నం. వాళ్లను ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవాడంటారు. పెద్దవాల్లను దోచుకుని బడుగు, బలహీన వర్గాల పంచిపట్టేవాడంటారు. అందుకే ప్రజల్లో ఆయనంటే గౌరవ మర్యాదలు ఉండేవి. రాబిన్ హుడ్ టైప్ అన్నమాట. ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో భారీ దోపిడీలు సాగించినా పోలీసు కాల్పుల నుంచి కూడా తప్పించుకోవడంతో నాగేశ్వర రావుని టైగర్ అంటూ ఆయన అనుచరులు కొనియాడడం మొదలెట్టారు. పోలీస్ లకు మోస్ట్ వాంటెడ్ గా మారిన నాగేశ్వరరావు ఏకంగా ప్రధాన మంత్రి ఆఫీస్ నే టార్గెట్ చేయటానికి గల కారణమేమిటి...అతను అసలు ఆలోచన ఏమిటి..ఎందుకు అతని జీవితంపై సినిమా తీసేటంత పేరు వచ్చింది, మార్వాడి అమ్మాయి (నుపూర్) ఎలా అతని జీవితంలో కు వచ్చింది..రేణు దేశాయ్ పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
Tiger Nageswara Rao Review
విశ్లేషణ
ఓ టైమ్ లో సంచలనం సృష్టించిన గజదొంగ జీవిత చరిత్ర తెరకెక్కిస్తున్నానే ఎక్సైట్మెంట్ తో దర్శకుడు, నిర్మాత ఈ సినిమా మొదలెట్టినట్లున్నారు. కానీ దాన్ని స్క్రిప్టుగా మలుచుకోవటంలోన తడబడ్డారు. నాగేశ్వరరావు పాత్రలో రెండు షేడ్స్ వున్నాయి. ఒక షేడ్ లో చాలా భయంకరమైన వ్యక్తి. మరో కోణంలో చాలా మనసున్న మనిషి. ఈ రెండూ కోణాలు బాలెన్స్ చేస్తూ సాగాలి. ఈ క్రమంలో కాంప్లిక్ట్స్ పుట్టాలి. లేకపోతే ఏదో భజన చేసినట్లు ఉంటుంది. అదే మిస్సైంది. అలాగే బయోపిక్స్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే సినిమా చూసే వారికి ఆ పాత్ర గురించి సమాచారం చాలా వరకూ తెలిసిందే ఉంటుంది. తెలిసిన విషయాన్ని ఇంట్రస్టింగ్ గా చెప్పడం ఓ పెద్ద ఛాలెంజ్. అప్పుడు కొన్ని తాము అల్లుకున్న సినిమా టెక్ అంశాలను తెరపైకి తెస్తూంటారు. అయితే అవి అసలుకథలో సింక్ అయితే ఏ సమస్యా రాదు. అలాగే టైగర్ నాగేశ్వరరావు గురించి కూడా కొంత సమాచారం తెలుసు. దాన్ని తెరపై చూస్తున్నపుడు ఎమోషనల్ కనెక్ట్ చేయటం కోసం కొన్ని సీన్స్ అల్లి కలిపారు.
Tiger Nageswara Rao Review
సినిమా ప్రారంభం ట్రైన్ దొంగతనంతో మొదలెట్టి అదిరిపోయిందనిపించినా..ఆ తర్వాత ఆ టెంపోని కొనసాగించటంలో విఫలమైంది టీమ్. మురళి శర్మ చెప్తున్నట్లుగా ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ లో కథనం మొదలెట్టి ఓ అరగంట ఆ టెంపో కొనసాగించారు. అయితే ఆ తర్వాత వచ్చే లవ్ ఎపిసోడ్స్ తో అసలు శ్రమ చూసేవాడికి,తీసిన వారికి మొదలైంది. ఏకంగా ప్రధాన మంత్రి ఇంటినే దొంగతనం చేయాలనే లక్ష్యం దిసగా ఇంట్రర్వెల్ సాగి మళ్లీ ట్రాక్ లోకి వచ్చినట్లు అనిపించింది. అయితే మళ్లీ సెకండాఫ్ అదే సిట్యువేషన్. ఎటునుంచి ఎటువైపు కథ వెళ్తుందో తెలియని పరిస్దితి. కథలో కాంప్లిక్ట్స్ ఫెరఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేయలేకపోవటంతో కేవలం సీన్స్ మాత్రమే కనిపిస్తాయి. కథ డ్రైవ్ మనకు కనపడదు. ముఖ్యంగా సెకండాఫ్ లో అదిరిపోయిందిరా అనిపించే థ్రిల్లింగ్ దొంగతనం ఒక్కటీ కనపడదు. దాంతో ఈ సినిమా ఎప్పుడు పూర్తి అవుతుందా అని ఎదురూచూస్తూంటాము. అయితే మూడు గంటల రన్ టైమ్ మనకు ఆ అవకాసం ఇవ్వదు. టైగర్ నాగేశ్వరరావు పాత్రను రాబిన్ హుడ్ గా చూపెట్టాలనే తాపత్రయమే సెకండాఫ్ మొత్తాన్ని ఆక్రమించేసింది. అందులో కాంప్లిక్ట్ ఏముంటుంది. డ్రామా ఎక్కడ పుడుతుంది. రేణు దేశాయ్ పాత్ర సైతం ఎక్సపెక్టేషన్స్ తగినట్లు అనిపించదు. ఇంత డల్ సెకండాఫ్ లోనూ ఒకటే ఓదార్పు అదే ఓ యాక్షన్ ఎపిసోడ్.
Tiger Nageswara Rao Review
సాధారణంగా బయోపిక్స్ అంటే అప్పటి జీవితాలను ఇప్పటి తరానికి ప్రేరణగా ఉండటం కోసం రూపొందిస్తూంటారు. అలా భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, గాంధీ, వల్లభాయ్ పటేల్ వంటి బయోపిక్ లతో పాటు సినీ నటులైన ఎన్టీఆర్,జయలలిత, సావిత్రి ల బయోపిక్స్, అలాగే ఎంతోమంది స్పోర్ట్స్ పర్సన్స్ బయోపిక్స్‌ను తెరకెక్కించారు. రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకులు దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్, హజీ మస్తాన్, వరదరాజన్ ముదలియార్ వంటి కరుడు కట్టిన నేరస్తుల జీవితాలను ప్రేరణగా తీసుకుని వారిని హీరోలుగా చూపిస్తూ సినిమాలను తెరకెక్కించారు. ఇప్పుడు ఒకప్పటి స్టూవర్ట్‌పురం బందిపోటు దొంగ జీవితాన్ని తెరకెక్కించారు. గతంలో స్టూవర్ట్‌పురం దొంగల జీవితాలను బేస్ చేసుకుని చిరంజీవి హీరోగా స్టూవర్ట్‌పురం పోలీస్ స్టేషన్ సినిమా వచ్చింది. అలాగే భానుచందర్ హీరోగా స్టూవర్ట్‌పురం దొంగలు అనే పేరుతో మరో సినిమా కూడా తెరకెక్కింది. అయితే ప్రత్యేకంగా ఓ దొంగ జీవితాన్ని బేస్ చేసుకుని మాత్రం ఏ సినిమా తెరకెక్కలేదు. ఈ సినిమా వచ్చింది.
Tiger Nageswara Rao Review- Premier Talk
టెక్నికల్ గా ...
ఇది పూర్తి స్క్రిప్టు సమస్య ఉన్న సినిమా. ఫస్టాఫ్ లో మొదటి అరగంట తరువాత సినిమా గాడితప్పింది. దర్శకత్వం లోపం పెట్టలేము. మిగతా డిపార్టమెంట్స్ మనస్సు పెట్టి పనిచేసాయి. జీవీ ప్రకాష్ ఇచ్చిన సాంగ్స్ వర్కవుట్ కానప్పటికీ, BGMమాత్రం డీసెంట్ గా ఉంది. కొన్ని సీన్స్ కు మ్యూజిక్ మంచి హై ఇచ్చింది. ఎడిటింగ్ మాత్రం తిట్టుకునేలా చేసింది. మూడు గంటలు ఎంగేజ్ చేయలేనప్పుడు ట్రిమ్ చేస్తే ఫలితం మారి ఉండేది. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ మాత్రం చక్కగా ఉంది. డైలాగులు సోసోగా ఉన్నాయి. నిర్మాత మాత్రం బాగా ఖర్చు పెట్టి చేసారని అర్దమవుతుంది. కెమెరా వర్క్ పీరియడ్ సెట్టింగ్ కు తగినట్లు ఉంది. అలాగే ఆర్ట్ వర్క్ కూడా ఫెరఫెక్ట్. VFX వర్క్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.
Performance
డార్క్ క్యారెక్టర్‌లో రవితేజ పర్ఫార్మెన్స్, అతడి ఎంట్రీ, స్క్రీన్ ప్రజెన్స్, ఎలివేషన్స్ బాగున్నాయి. రవితేజ కెరీర్ లో వన్ అఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ . హీరోయిన్ నూపూర్ సనన్, గాయిత్రి భరద్వాజ్...రొటీన్ టిపికల్ పాత్రలు. అయితే వాళ్లు లోపం ఏమీ లేదు. పాత్రకు తగినట్లు మంచి అవుట్ ఫుట్ ఇచ్చారు. రేణు దేశాయ్ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపని పాత్ర. మిగతా పాత్రలు ముకశి షక్మ. అనురమ ఖేర్ వంటివి ఓకే అన్నట్లు సాగుతాయి
బాగున్నవి:
👉#RaviTeja ఫెరఫార్మెన్స్
👉ప్రారంభ ఎపిసోడ్ ట్రైన్ సీక్వెన్స్
👉ప్రొడక్షన్ వాల్యూస్
బాగోలేనివి:
👉ఎప్పుడు అయ్యిపోతాయిరా అనిపంచే పాటలు
👉లాగి లాగి వదిలిన సెకండాఫ్
👉రన్ టైమ్
👉 లవ్ ట్రాక్ లు
👉 ప్రేక్షకుడుని కట్టిపాడేయలేని స్క్రీన్ ప్లే
👉VFX
ఫైనల్ థాట్ :
దొంగ కథ అయినా దొర కథ అయినా ఇంట్రస్టింగ్ గా చూడాలంటే క్యారక్టర్ ఆర్క్ అయినా ఉండాలి లేదా కథలో సరపడా కాంప్లిక్ట్స్ అయినా ఉండాలే. అలా కాకుండా కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే ఉంటే అది కమర్షియల్ గా సాగే డాక్యుమెంటరీ అవుతుంది.
Rating:2.5
బ్యానర్: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్
తారాగణం: రవితేజ, నూపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్ తదితరులు
డైలాగ్స్: శ్రీకాంత్ విస్సా
సంగీతం: జివి ప్రకాష్ కుమార్
డీవోపీ : ఆర్ మదీ
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
సమర్పణ: తేజ్ నారాయణ్ అగర్వాల్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
రచయిత, దర్శకత్వం: వంశీ
నిర్మాత: అభిషేక్ అగర్వాల్
విడుదల తేదీ : 20 అక్టోబర్ 2023