RGV: వర్మ‘అమ్మాయి..డ్రాగన్ గర్ల్’రివ్యూ
రాంగోపాల్ వర్మకు కూడా బ్రూస్లీ అంటే ఎనలేని అభిమానం. తన సినిమాలలోని ఫైట్స్ ఆయనను స్ఫూర్తిగా చేసుకుని చేసినవే అని వర్మ చెబుతుంటారు. ఇదిలావుండగా…ఎంటర్ ది గర్ల్ డ్రాగన్ పేరుతో తన దర్శకత్వంలో ఆర్జీవీ ఇప్పుడు ఓ సినిమాను రూపొందిస్తున్నారు. పూర్తిగా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్న మొదటి ఇండియన్ చిత్రంగా దీనిని పరిగణిస్తున్నారు.
Ladki-Enter The Girl Dragon
పూజ (పూజా భలాకర్) మొదటి నుంచి ‘బ్రూస్ లీ’కు వీరాభిమాని. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం కోసం వైజాగ్ సిటీ వస్తుంది. అక్కడ ఓ సీనియర్ కోచ్ లుయ్ (Tianlong Shi) డ్రాగన్ స్కూల్ నడుపుతూంటాడు. ఆయన దగ్గర ఆమె జాయిన్ అవుతుంది. ఆ ట్రైనింగ్ లో ఉండగానే ఆమె కు ఓ విషయం అర్దమవుతుంది. అదేమిటంటే...అక్కడ లోకల్ డాన్ విఎం (అభిమన్యు సింగ్ )ఒకడు ..తన గురువు కు చెందిన కోట్ల విలువ చేసే మార్షల్ ఆర్ట్స్ నేర్పే ఆ డ్రాగన్ స్కూల్ ని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తూంటాడు. ఆ క్రమంలో ఆ డాన్ ...ఆ కోచ్ ని చంపేస్తాడు. ఇక ఇప్పుుడ తన గురువు చెందిన ఆస్దిని సంరక్షించాలని సిట్యువేషన్ తన చేతిలోకి తీసుకుంటుంది. ఆమె ఏం చేస్తుంది. శక్తివంతుడైన విలన్ ని ఎలా ఎదిరిస్తుంది. అలాగే ఆమెతో ప్రేమలో ఉన్న ఫొటో గ్రాఫర్ నీల్ (పార్ద్ సూరి) పరిస్దితి ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
tu nahi video song ladki movie rgv ram gopal varma Pooja Bhalekar
కథగా చెప్పుకవటానికి ఏమీ లేదు. కథన పరంగానూ అసలు లేదు. ఉన్నదల్లా మార్షిల్ ఆర్ట్స్ విన్యాసాలే. మార్షిల్ ఆర్ట్స్ వచ్చిన అమ్మాయి దొరికింది. ఆమెను పెట్టి సినిమా తీయాలి...అందుకోసం లక్ష సార్లు సినిమా వాళ్లు వాడేసిన స్టోరీ లైన్ తీసుకుంటే నష్టమేమొచ్చింది అనుకున్నట్లున్నారు వర్మ. అదే చేసారు. అసలు సినిమాకు వెళ్ళేది కథ,కథనం, స్క్రిప్టు కోసం కాదు కదా...కాబట్టి వాటి ప్రయారిటీ ఏముంటుంది అని ఫిక్సై చేసినట్లుంది. వర్మకు బ్రూస్ లీ అంటే అభిమానం అని అనేక సార్లు మీడియా ముందు..వెనక చెప్పారు. అదే చూపించారు. బ్రూస్ లీని ఇమిటేట్ చేయించారు. ఇలాంటి మార్షిల్ ఆర్ట్స్ సినిమాలోనూ టు పీస్ బికినీ వేసి ఆమెను ఎక్సపోజ్ చేసే ప్రయత్నమూ చేసావు. అవే స్క్రిప్ట్ లో రాసుకున్నారేమో అనిపిస్తుంది.
గత రోజుల్లో వర్మ సినిమాల్లో ఖచ్చితంగా డ్రామా, ఎమోషన్ ఉండేలా చూసుకునేవారు. దాంతో మిగతావన్ని ఎలా ఉన్నా..వాటితో కొట్టుకుపోయేవి. ఈ సినిమాలో అందుకు స్కోప్ లేదు. కొంతసేపు ఫైట్స్ తర్వాత ఏదో కారణం వెతుక్కుని మరో ఫైట్స్ వచ్చేస్తూంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎలా ఎడిటింగ్ చేయించారా అని. ఈ సినిమా ప్రారంభం వర్మ బ్రూస్ లీ కోట్ “No limit should be your limit” తో మొదలెడతారు. అలాగే ఆయన క్రియేటివిటికి హద్దూ, అదుపూ లేదు అనిపిస్తుంది. దానికి తోడు రంగీలా సినిమాలో ఊర్మిళ చేత బీచ్ లో డాన్స్ స్టెప్స్ వేయించినట్లు ఇక్కడ బీచ్ లో మార్షిల్ ఆర్ట్స్ మూమెంట్స్. ఆయన్నే ఆయన అనుకరించుకునే ప్రయత్నం. వందనాలు వర్మా.
టెక్నికల్ గా
దర్శకుడుగా వర్మ ..ఆయన తీయకుండా వేరే వారి తీయించారేమో అనిపిస్తుంది. ఆయన మ్యాజిక్ మొత్తం మిస్సైంది. స్లో మోషన్ లో సెమీ న్యూడ్ సీన్స్ చూపెడుతూ యాక్షన్ అనుకోమంటే ఎలా.. ఇక వర్మ సినిమాలు గతంలో టెక్నికల్ గా హై స్టాండర్డ్స్ లో ఉండేవి. కెమెరా వర్క్ అయితే ఓ రేంజిలో ఉండేది. ఇప్పుడు ఆయన నుంచి వస్తున్న సినిమాలలో అదేమి ఉండటం లేదు. ఈ సినిమాలో కెమెరా వర్క్ ఓకే. మ్యూజిక్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుది. ప్రొడక్షన్ వాల్యూస్ ..సోసో గా ఉన్నాయి.
నటీనటుల్లో...పూజ భలేకర్ నటన ప్రక్కన పెడితే ఆమె చేసిన యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి. డూప్‌లు, వీఎఫ్‌ఎక్స్‌లు వాడకుండా పూజలాంటి ఓ మార్షల్ ఆర్ట్స్ అమ్మాయి ఏం చేయగలదో అదే సినిమాలో చేసింది. ఆమెది సిన్సియర్ ఎటెమ్ట్. అభిమన్యు సింగ్ ఓకే. మిగతావాళ్లలో చాలా మంది సి గ్రేడ్ నటులు. నటన.
ఫైనల్ థాట్
వర్మ నుంచి వచ్చిన మరో కళాఖండం అనటంలో సందేహం లేదు.
Rating:1.5
ఈ సినిమాలో ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులేమీ లేవు. అలానే ఆశ్చర్య పరిచే సన్నివేశాలూ లేవు. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా పూజా, ఆమె లవ్ స్టోరీ తిప్పి బోర్ కొట్టిస్తారు. అయితే బ్రూస్ లీ పూర్వీకులకు చెందిన దక్షిణ చైనాలోని జూనన్ పట్టణానికి కథను తీసుకెళ్ళడం కాస్తం ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. అక్కడి 62 అడుగుల బ్రూస్ లీ విగ్రహాన్ని చూపించడంతో పాటు ఓ పాటనూ వర్మ తీసారు. అలాగే చైనా లేడీ ఫైటర్ ముఖీ మియాతో ఫైట్ సీన్ కాస్తంత ఆసక్తికరంగా ఉంది.
నటీనటులు: పూజా భలేకర్, మియా ముఖి, అభిమన్యు సింగ్, రాజ్ పాల్ యాదవ్ తదితరులు
దర్శకత్వం :రామ్ గోపాల్ వర్మ
సంగీతం: పాల్ ప్రవీణ్ కుమార్
ఛాయా గ్రహణం: యుకే సెంథిల్ కుమార్
నిర్మాతలు : నరేష్ టి ,శ్రీధర్, రామ్ గోపాల్ వర్మ
విడుదల తేదీ :15-07-2022