MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' రివ్యూ

రాజ్ తరుణ్ 'అనుభవించు రాజా' రివ్యూ

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందింది అని చెప్పబడిన  ఈ సినిమా ఇవాళ అనగా నవంబర్ 26, 2021 న విడుదలైంది. రాజ్ తరుణ్ కెరీర్ కు లైఫ్ లైన్ గా మారిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఉందో మెప్పించిందో చూద్దాం  

3 Min read
Surya Prakash Asianet News
Published : Nov 26 2021, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Anubhavinchu Raja Trailer

Anubhavinchu Raja Trailer

కొందరు హీరోలు ఎన్ని ఫ్లాఫ్ లు ఇచ్చినా...ఏమో ఈ కొత్త సినిమాలో ఏదో చేస్తాడేమో అనే ఆశ ఉంటుంది. అలాంటి వారిలో రాజ్ తరుణ్ ఒకరు. దాదాపు అరడజన్ ఫ్లాపులు వచ్చిన తర్వాత కూడా వరుస ఆఫర్స్ దక్కించుకుంటున్న ఈ యంగ్ హీరో తాజా చిత్రం ఈ రోజు రిలీజైంది.  ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్ సినిమాపై అంచనాలు బాగానే పెంచేశాయి. అందులోనూ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. దానికి తోడు ఈ సినిమా ప్రమోషన్ కూడా బాగానే చేసుకుంటున్నాడు రాజ్ తరుణ్. ఈ సినిమా ఇప్పుడు రాజ్ తరుణ్ కెరీర్‌కు అత్యంత కీల‌కంగా మారింది. ఈ క్రమంలో వచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది, రాజ్ తరుణ్ ని ఫ్లాఫ్ ల ప్రవాహం నుంచి ఒడ్డున  పడేసిందా, కథ ఏమిటి...ఏ మేరకు నవ్వించాడు వంటి విషయాలు రివ్యూలో చూద్దాం. 

28
Anubhavinchu Raja

Anubhavinchu Raja

కథ
రాజు (రాజ్ తరుణ్) ఓ సెక్యూరిటీ గార్డ్ లో ఓ పెద్ద ఐటీ కంపెనీలో చేస్తూంటాడు. ఆ కంపెనీలో పనిచేసే సాప్ట్ వేర్ ఎంప్లాయి శృతి (కశిష్‌ ఖాన్‌) ని ప్రేమిస్తాడు. అయితే ఆమె మొదట అతన్ని తమ కంపెనీలో డేటా సెక్యూరటీ చూసుకునే జాబ్ అనుకుంటుంది. ఓ రోజు అదేమీ కాదు..గేటు అవతల ఉండే సెక్యూరిటీ గార్డ్ జాబ్ అని రివీల్ అయ్యి దూరం అవుతుంది. మరో ప్రక్క రాజు పై ఓ ప్రొపిషనల్ కిల్లర్ గ్యాంగ్ ఎటాక్ చేస్తూంటుంది. రాజుని చంపమని వాళ్లకు సుపారీ ఇచ్చి ఉంటారు. ఇంతకీ  వాళ్లు ఎవరు...అసలు రాజు ప్లాష్ బ్యాక్ ఏమిటి..విలేజ్ నేపధ్యం ఏమిటి..విలేజ్ లో ఉండాల్సిన రాజు ఎందుకు సిటీకు వచ్చి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. అతన్ని చంపుదామని ప్రయత్నిస్తున్న వాళ్లు ఎవరు వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
 

38
Anubhavinchu Raja

Anubhavinchu Raja

ఎనాలసిస్...

రాజ్ తరుణ్ కు ఈ సినిమాలో పల్లెటూరు ప్లాష్ బ్యాక్ ఉంటుంది. నిజానికి అదే బ్యాంకింగ్ కూడా. ఆ ఊళ్లో బేవార్స్ గా తిరుగుతూ.. కోడి  పందాలలో పాల్గొంటూ, ప్రెసెడెంట్ ఎలక్షన్స్ లో గెలవాలని ట్రై చేస్తూంటాడు. అయితే ఆ సెటప్ ఎంత ఓల్డ్ అయ్యిపోయిందో డైరక్టర్,టీమ్ గమనించినట్లు లేరు. తెలుగు తెరపై ఎన్నో సార్లు ..ఎన్నో ఏళ్ల నుంచి చూస్తూండటంతో...ఆ ప్లాష్ బ్యాక్ ఏదో పాతికేళ్ల క్రితం జరిగిందేమో అనిపిస్తుంది. రెండు మూడేళ్ల గ్యాప్ లో జరిగినట్లు అనిపించదు. దాంతో ఆ సీన్స్ ఏవీ కొత్తగా అనిపించవు. దానికి తోడు రాజ్ తరుణ్ సినిమా అనగానే కాస్తంత ఫన్ ని ఎక్సపెక్ట్ చేస్తాం. అదీ పెద్దగా చెప్పుకోదగిన స్దాయిలో లేదు. ఫస్టాఫ్ లో ఏదో కామెడీ అలా నడిచిపోయింది. 

48
Anubhavinchu Raja

Anubhavinchu Raja


అలాగే ఫస్టాఫ్ లో ... ప్రీ ఇంటర్వెల్ దాకా కథ నడిచినట్లు, కథలోకి వచ్చినట్లు అనిపించదు. అక్కడదాకా కాంప్లిక్ట్ పాయింట్ లోకి ప్రవేశించరు. ఇంటర్వెల్ దగ్గర అసలు నువ్వు ఎవరివి అని హీరోయిన్, ప్రెండ్ అడిగితే భాషా,సమరసింహా రెడ్డి స్దాయిలో సెకండాఫ్ లో ప్లాష్ బ్యాక్ ఓపెన్ చేస్తారు. అయితే ఆ క్యూరియాసిటీకు దగ్గ పాయింట్ కనపడదు.  అలాగే ఎమోషన్స్ కూడా చాలా ఫోర్సెడ్ గా ఉంటాయి.  ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తగ్గించి ఉంటే బాగుండేది. పోనీ ఆ ప్లాష్ బ్యాక్ అయ్యాక ..విషయం ఇదీ అని తెలిసాక  హడావిడిగా ప్రీ క్లైమాక్స్,  క్లైమాక్స్ వచ్చేస్తుంది. విలన్ ఎవరో తెలిసేసరికే సినిమా అయ్యిపోతే ఇంక హీరో చెయ్యగలిగేదేముంటుంది. ఇదేమీ థ్రిల్లర్ సినిమా కాదు. విలన్ ఎవరో తెలియటమే సినిమా అనుకోవటానికి. 

58
Anubhavinchu Raja

Anubhavinchu Raja

ఎవరెలా చేసారంటే...

రాజ్ తరుణ్ ఇటు సెక్యూరిటీ గార్డ్ గా..అటు పల్లెలో ఉండే ఓ పెద్ద డబ్బుండి జల్సా లు చేసే కుర్రాడిగా వేరియేషన్స్ చూపిస్తూ బాగా చేసారు. బాడీ లాంగ్వేజ్, భాష రెండు సపోర్ట్ చేసాయి. అయితే అతనికి కథే కలిసి రాలేదు. ఇక హీరోయిన్ కశిష్‌ ఖాన్‌ ...తొలి సినిమా అయినా బాగా చేసింది. తమిళ నటుడు నరేష్ ..విలేజ్ ప్రెసిడెంట్ గా బాగా చేసారు. నెల్లూరు సుదర్శన్ ఫన్ బాగానే వర్కవుట్ అయ్యింది. విలన్ వేషాలు వేసే అజయ్ ఈ సినిమాలో దాన్ని కంటిన్యూ చేసాడు. ఆదర్శ బాలకృష్ణ  కూడా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో ఒదిగిపోయాడు.

68
Anubhavinchu Raja

Anubhavinchu Raja


టెక్నికల్ గా..

దర్శకుడు శ్రీను గవిరెడ్డి ...ఓ టెంప్లేట్ డ్రైవెన్ డ్రామాలో కథను చెప్పటటానికి ప్రయత్నించాడు. అయితే కొన్ని టిపికల్ పాత్రల, కమర్షియల్ ఎలిమెంట్స్, కలిపాడు కానీ, అవేమీ సరిగ్గా ఇమడలేదు. ఫస్టాఫ్ ఉన్న ఫ్లోని సెకండాఫ్ మెయింటైన్ చేయలేకపోయారు. అలాగే సరైన కాంప్లిక్ట్ ని కూడా కథలో తీసుకోకపోవటంతో యావరేజ్ స్క్రిప్టు తయారైంది. దర్శకత్వం సోసోగా ఉంది. డైలాగులు అక్కడక్కడా బాగా పేలాయి. పాటల్లో టైటిల్ సాంగ్, ‘‘బతికేయ్‌ హాయిగా’’ బాగున్నాయి. ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. నిర్మాణ విలువలు బ్యానర్ కు తగినట్లు ఉన్నాయి.

78
Anubhavinchu Raja

Anubhavinchu Raja

ఫైనల్ థాట్

 గోదావరి ప్రాంత నేపధ్యంలో కథ జరుగుతోందంటే పాతికేళ్ల క్రితం నాటి పరిస్దితులు,పాత్రలు ఇప్పటికీ చూపించటం,కామెడీ చెయ్యాలనుకోవటమే ఆశ్చర్యమనిపిస్తుంది. 

---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
 

88
Anubhavinchu Raja

Anubhavinchu Raja


 ఎవరెవరు..
సంస్థ‌: అన్నపూర్ణ స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి; 
న‌టీన‌టులు: రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళి, నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ, భూపాల్ రాజు, అరియానా, త‌దిత‌రులు;
 సంగీతం: గోపీ సుందర్; 
ఛాయాగ్రహ‌ణం: నాగేష్ బానెల్; 
ఎడిటర్: ఛోటా కే ప్రసాద్;
 సాహిత్యం: భాస్కర భట్ల‌, 
క‌ళ: సుప్రియ బట్టెపాటి, రామ్ కుమార్ ; 
నిర్మాత: సుప్రియ యార్లగడ్డ; 
దర్శకత్వం: శ్రీను గవిరెడ్డి; 
రన్ టైమ్: 2h 11min
విడుద‌ల తేదీ‌: 26 న‌వంబ‌ర్ 2021

Also read '83' టీజర్ వచ్చేసింది.. కపిల్ దేవ్ గా రణ్వీర్ సింగ్ ట్రాన్స్ఫర్మేషన్ అదుర్స్

Also read NTR vs Lokesh: చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ... రెండుగా చీలిన టీడీపీ

 

About the Author

Surya Prakash
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved