MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Purushaha Moview Review: పురుషః మూవీ రివ్యూ.. సప్తగిరి, పవన్‌ కళ్యాణ్‌, కసిరెడ్డి నవ్వించారా?

Purushaha Moview Review: పురుషః మూవీ రివ్యూ.. సప్తగిరి, పవన్‌ కళ్యాణ్‌, కసిరెడ్డి నవ్వించారా?

ఈ వారం చిన్న సినిమాల జోరు కొనసాగుతుంది. అందులో భాగంగా పవన్‌ కళ్యాణ్‌ హీరోగా పరిచయం అవుతూ, సప్తగిరి, కసిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన `పురుషః` మూవీ విడుదలైంది. మరి ఈ చిత్రం ఆకట్టుకునేలా ఉందా? 

3 Min read
Author : Aithagoni Raju
Published : May 22 2026, 08:36 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పురుషః మూవీ రివ్యూ
Image Credit : Asianet News

పురుషః మూవీ రివ్యూ

కొత్త కుర్రాడు పవన్‌ కళ్యాణ్‌ బత్తుల, సప్తగిరి, కసిరెడ్డి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం `పురుషః`. వీరు వులవల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కళ్యాణ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించారు. రాయంచ కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా నేడు శుక్రవారం(మే 22)న విడుదలైంది. కామెడీ, ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
పురుషః మూవీ కథేంటంటే?
Image Credit : Asianet News

పురుషః మూవీ కథేంటంటే?

చిన్నప్పట్నుంచి గోవింద్‌(పవన్‌ కళ్యాణ్‌), సత్తిబాబు(సప్తగిరి), శ్రీను(కసిరెడ్డి రాజ్‌ కుమార్‌), కిస్‌(వెన్నెల కిశోర్‌) మంచి స్నేహితులు. అన్నీ షేర్‌ చేసుకుంటారు. వీరికి పెళ్లిళ్లు అవుతాయి. గోవింద్‌ని.. కమల(రాయంచ కొక్కుర)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. సత్తిబాబుకి లక్ష్మి(హసిని)తో, శ్రీనుకి గీత(విషిక)తో మ్యారేజ్‌ అవుతుంది. వీరి పెళ్లి లైఫ్‌ సవ్యంగా సాగదు. గొడవలు అవుతుంటాయి. దీంతో తమకు విడాకులు కావాలని వీరి భార్యలే కోర్ట్ లో కేసు వేస్తారు. ఆ తర్వాత విడాకుల కోసం కోర్ట్ చుట్టూ భర్తలు తిరుగుతుంటారు కానీ, భార్యలు రారు. దీంతో వాయిదాల మీద వాయిదా వేస్తుంటారు. వీరి బాధని అర్థం చేసుకున్న జడ్జ్(వీటీవీ గణేష్‌) వీరి సమస్య ఏంటనేది తెలుసుకుంటారు. ఇందులో గోవింద్‌, కమల లవ్‌ స్టోరీ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. మరి గోవింద్‌, కమల ప్రేమ కథ ఎలా స్టార్ట్ అయ్యింది? ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? గోవింద్‌ గతం ఏంటి? అలాగే సత్తిబాబు, శ్రీనులపై వారి భార్యలకు ఎక్కడ అనుమానం కలిగింది? వీళ్ల కొంపముంచడంలో కిస్‌ పాత్రేంటి? చివరికి ఈ కథ ఎలాంటి ముగింపుని తీసుకుందనేది సినిమా.

Related Articles

Related image1
Top 10 Heroes: పడిపోయిన అల్లు, చరణ్‌, ఎన్టీఆర్‌, విజయ్‌.. ధురంధర్‌ 2 హీరో సంచలనం.. నెం 1 ఎవరంటే?
Related image2
Drishyam 3 Review: దృశ్యం 3 మూవీ రివ్యూ.. మోహన్‌లాల్‌, మీనా కలిసి నటించిన మూవీ ఎలా ఉందంటే?
36
పురుషః మూవీ ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

పురుషః మూవీ ఎలా ఉందంటే?

విడాకుల చుట్టూ తిరిగే ఫ్యామిలీ డ్రామానే `పురుషః` భార్యభర్తల జీవితాలను ఆవిష్కరించే చిత్రమిది. సాధారణంగా ఇలాంటి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. వీటిలో ఫన్‌ వర్కౌట్‌ అయితే, డ్రామా పండితే సినిమా సక్సెస్‌ అయినట్టే. ఈ మూవీని కూడా కామెడీ ప్రధానంగా చేసుకుని, ఆద్యంతం నాటకీయంగా నడిపించారు. భార్యభర్తల మధ్య జరిగే గొడవలను కామెడీగా చూపించారు. అయితే సినిమా చూస్తుంటే, ప్రతి ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ జరిగే విషయాలే గుర్తుకొస్తుంటాయి. ఓ రకంగా చెప్పాలంటే ఇదొక భార్య భర్తల బయోపిక్‌ లాంటిది. అందులో కొన్ని ప్రధాన సంఘటనలను బేస్‌ చేసుకుని ఈ మూవీని తెరకెక్కించినట్టు ఉంటుంది. సినిమా ప్రారంభం ముగ్గురు భర్తలు తమ విడాకుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతుంటారు. కోర్ట్ ప్రతిసారి వాయిదా వేస్తుంటుంది. వీరికి లాయర్‌ అనంత శ్రీరామ్‌. వీరికి తగ్గట్టుగానే ఆయన కూడా ఉంటాడు. ఇలా వాయిదాలతో ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ఈ ముగ్గురు తమ ఇళ్లని వదిలేసి ఒకే రూమ్‌లో ఉంటారు. తమ కష్టాలు చెప్పుకుంటూ బాధపడుతుంటారు. ఆయా సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఇక జడ్జ్ వద్దకు వెళ్లగా, ఆయన వీరి స్టోరీస్‌ని అడుగుతాడు. అందులో గోవింద్‌ లవ్‌ ట్రాక్‌ ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కమలని ఆయన ఎలా పెళ్లి చేసుకున్నారు, ఆయన భార్యకి గోవింద్‌ పై ఎక్కడ అనుమానం వచ్చింది. దాని వెనుక ఉన్న మరో లవ్‌ స్టోరీ ఏంటనేది రివీల్‌ అవుతుంది. ఈ లవ్‌ ట్రాక్‌ ఇంట్రెస్టింగ్‌గా ఆకట్టుకునేలా ఉంటుంది. అలాగే సప్తగిరి, కసిరెడ్డిల బాధలు, ఇంట్లో భార్యలతో వాళ్లు పడే బాధలు నవ్వులు పూయించేలా ఉంటాయి. మధ్యలో వీళ్లు సూపర్‌మేన్‌లుగా మారడం, అయినా వాళ్లు వీరిని చితక్కొట్టడం నవ్వించేలా ఉంటుంది. కసిరెడ్డి జంపింగ్‌ పదాలతో  డబుల్‌ మీనింగ్‌ డైలాగ్‌లతో బాగా నవ్వించాడు. అయితే మూవీలో అన్ని చోట్ల ఫన్‌ వర్కౌట్‌ కాలేదు, కొంత సాగదీసినట్టుగా ఉంటుంది. సీన్‌ బై సీన్‌ కొంత సంబంధం లేకుండా ఉన్నట్టుగా ఉంటుంది. కొంత ఎమోషన్స్ మిస్‌ అయ్యాయి. అయితే క్లైమాక్స్ మాత్రం  కట్టిపడేస్తుంది. ఎమోషనల్‌గా ఉంటుంది. ప్రేమే అన్నింటికి పరిష్కారం అని చెప్పిన కన్‌క్లూజన్‌ అదిరిపోయింది. అలాగే హార్ట్ కి సంబంధించిన ఒక ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది.

46
పురుషః లో ఆర్టిస్ట్ లు ఎలా నటించారంటే?
Image Credit : Asianet News

పురుషః లో ఆర్టిస్ట్ లు ఎలా నటించారంటే?

గోవింద్‌ పాత్రలో కొత్త కుర్రాడు పవన్‌ కళ్యాణ్‌ బాగా నటించాడు. హీరోగా సినిమాని తన భుజాలపై నడిపించాడు. నటన పరంగానూ బాగా చేశాడు. ఎక్స్‌ ప్రెషన్స్ తోనే భావాలు పలికించాడు. లవ్‌ స్టోరీలో బాగా యాక్ట్ చేశాడు. అతనికి మంచి భవిష్యత్‌ ఉందని చెప్పొచ్చు. ఇక సత్తిబాబు పాత్రలో సప్తగిరి అదరగొట్టాడు. తనదైన స్టయిల్ నవ్వించే ప్రయత్నం చేశాడు. కసి రెడ్డి కూడా జంపింగ్‌ పదాలతో నవ్వులు పూయించి సినిమాకి అసెట్‌ అయ్యాడు. కమలగా రాయంచ లుక్‌ పరంగా బాగుంది. యాక్టింగ్‌ పరంగా ఫర్వాలేదనిపించింది. అలాగే విషిక కామెడీ బాగుంది. హసిని కూడా ఉన్నంతలో మెప్పించింది. వెన్నెల కిశోర్‌ కనిపించేది కాసేపే అయినా నవ్వులు పూయించాడు. లాయర్‌గా అనంత శ్రీరామ్‌ నవ్వించే ప్రయత్నం చేసినా పెద్దగా వర్కౌట్‌ కాలేదు. జడ్జ్ గా వీటీవీ గణేష్‌ ఓకే అనిపించారు. మిగిలిన పాత్రలు ఓకే అని చెప్పొచ్చు.

56
పురుషః మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
Image Credit : Asianet News

పురుషః మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?

శ్రావణ్‌ భరద్వాజ్‌ మ్యూజిక్‌ ఫర్వాలేదు. ఆర్‌ఆర్‌ బాగుంది. తన బెస్ట్ ఇచ్చాడని చెప్పొచ్చు. సతీష్‌ ముత్యాల కెమెరా వర్క్ ఆకట్టుకుంది. విజువల్‌గా సినిమా పెద్ద రేంజ్లో ఉంది. బత్తుల కోటేశ్వరరావు రాజీపడకుండా నిర్మించారు. తమ ప్యాషన్‌ ప్రతి ఫ్రేములోనూ తెలుస్తోంది. సినిమా చాలా రిచ్‌గా ఉంది. పెద్ద బడ్జెట్‌ మూవీలా ఉంది. ఇక దర్శకుడు వీరు వులవల ఎంచుకున్న కథ బాగుంది. హార్ట్ కి సంబంధించి ఎంచుకున్న పాయింట్‌ బాగుంది. దాన్ని అంతే బాగా కన్విన్సింగ్‌గా చెప్పాడు. డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆలోచింప చేసేలా ఉన్నాయి. ప్రస్తుతం సమాజంలో భార్యభర్తల సంబంధాలు ఎలా ఉన్నాయనేది స్పష్టంగా కళ్లకి కట్టినట్టు చూపించాడు. అదే సమయంలో మంచి కన్‌క్లూజన్‌ కూడా ఇచ్చాడు. ఆ విషయంలో అభినందించాల్సిందే.

66
ఫైనల్‌గా..
Image Credit : Asianet News

ఫైనల్‌గా..

ఫ్యామిలీతో కలిసి చూసే టైమ్‌ పాస్‌ మూవీ `పురుషః`. భార్యాభర్తలకు సంబంధించి ఇచ్చిన సందేశం బాగుంది.

రేటింగ్‌ 2.75

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Mangalya Balam Review: టాలీవుడ్ చరిత్రలో ఫస్ట్ 100 డేస్ సినిమా.. ఏఎన్నార్, సావిత్రి రొమాంటిక్ మూవీ, 'మాంగల్య బలం' రివ్యూ
Recommended image3
Gang Leader Review: చిరంజీవి కోసం కెరీర్‌ను పణంగా పెట్టిన నాగబాబు, మెగాస్టార్ రఫ్ఫాడించి 35 ఏళ్లు.. గ్యాంగ్ లీడర్ రివ్యూ
Related Stories
Recommended image1
Top 10 Heroes: పడిపోయిన అల్లు, చరణ్‌, ఎన్టీఆర్‌, విజయ్‌.. ధురంధర్‌ 2 హీరో సంచలనం.. నెం 1 ఎవరంటే?
Recommended image2
Drishyam 3 Review: దృశ్యం 3 మూవీ రివ్యూ.. మోహన్‌లాల్‌, మీనా కలిసి నటించిన మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved