- Home
- Entertainment
- Movie Reviews
- Psych Siddhartha Movie Review: సైక్ సిద్ధార్థ మూవీ రివ్యూ, రేటింగ్.. జెంజీ మూవీతో నందుకి హిట్ పడిందా?
Psych Siddhartha Movie Review: సైక్ సిద్ధార్థ మూవీ రివ్యూ, రేటింగ్.. జెంజీ మూవీతో నందుకి హిట్ పడిందా?
నందు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `సైక్ సిద్ధార్థ`. వరుణ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం నూతన సంవత్సరం కానుకగా గురువారం విడుదలయ్యింది. సినిమా ఎలా ఉందంటే?

సైక్ సిద్ధార్థ మూవీ రివ్యూ
నందు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లు అవుతుంది. కానీ సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నాడు. నటుడిగా బెస్ట్ అనిపించుకున్నాడు. కానీ హీరోగా నిలబడేందుకు స్ట్రగుల్ అవుతున్నాడు. ఆయన హీరోగా నటించిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ క్రమంలో ఇప్పుడు జెంజీ జోనర్‌లో సినిమా చేశారు. నేటి ట్రెండ్‌ని అద్దం పట్టేలా సినిమా చేశారు. `సైక్ సిద్ధార్థ` అనే చిత్రంతో కొత్త ఏడాది ఆడియెన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీకి వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించగా, స్పిరిట్ మీడియా, ఏసియన్ సురేష్, సౌత్ బే లైవ్, వేరే మీడియా నిర్మిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్ రిలీజ్ చేస్తోంది. నందు, రానా నిర్మాతలు. ఇందులో నందుకి జోడీగా యామిని భాస్కర్ హీరోయిన్‌గా నటించింది. కొత్త ఏడాది సందర్భంగా గురువారం విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది? నందుకు హిట్ పడిందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
సైక్ సిద్ధార్థ మూవీ కథ ఇదే
సిద్ధార్థ(నందు)కి ఆర్ట్ అంటే ఇష్టం. కానీ అడగడుగునా అవమానాలు ఫేస్ చేస్తాడు. ఓ రోజు పబ్‌లో త్రిష(ప్రియాంక రెబెకా శ్రీనివాస్)తో ప్రేమలో పడతాడు. లస్ట్ తో స్టార్ట్ అయి డీప్ లవ్ లోకి వెళ్తాడు. ఆమె కోసం ఏకంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీని పెట్టాలనుకుంటాడు. అందుకోసం మన్సూర్(సుఖేష్ రెడ్డి)తో చేతులు కలుపుతాడు. తన వద్ద ఉన్నదంతా పెడతాడు. కొన్ని రోజులకు సుఖేష్ రెడ్డి, త్రిష మోసం చేస్తారు. వాళ్లిద్దరు కమిట్ అయి, సిద్ధార్థకి హ్యాండిస్తారు. దీంతో పిచ్చోడైపోతాడు సిద్ధార్థ. డబ్బులు లేక, ఓ పాత బస్తీలో చిన్న రూమ్‌లో ఉంటాడు. తాగుడికి బానిస అవుతాడు. మరోవైపు శ్రావ్య(యామినీ భాస్కర్) మేన బావని పెళ్లి చేసుకుంటుంది. అతను రోజూ చిత్ర హింసలు పెడతాడు. కొడతాడు. ఆమెకి కొడుకు కూడా ఉంటాడు. భర్త హింస భరించలేక కొడుకుని తీసుకుని బస్తీలో సిద్ధార్థ ఉండే ఇంట్లో కింది పోర్షన్‌లో అద్దెకు దిగుతుంది. తను క్లాసికల్ డాన్సర్. భర్త విషయంలో మోసపోయిన శ్రావ్య, ప్రియురాలి విషయంలో మోసపోయిన సిద్ధార్థ ఎలా కలిశారు? సిద్దార్థలో వచ్చిన మార్పేంటి? సిద్ధార్థకి రెండో సారి హార్ట్ బ్రేక్ తప్పలేదా? అసలేం జరిగిందనేది సినిమా.
సైక్ సిద్ధార్థ మూవీ ఎలా ఉందంటే?
అమ్మాయిల చేత అబ్బాయిలు మోసపోవడమనే కాన్సెప్ట్ తో ఇటీవల కాలంలో చాలా సినిమాలు వస్తూనే ఉన్నాయి. నేటి ట్రెండ్‌ని, సిటీ కల్చర్‌ని బోల్డ్ గా ఆవిష్కరిస్తూ అడపాదడపా మూవీస్ వస్తూ అలరిస్తున్నారు. `అర్జున్‌రెడ్డి` నుంచి `బేబీ` వరకు ఇలాంటి క్రేజీ, అండ్ బోల్డ్ మూవీస్ ఆడియెన్స్ ని అలరిస్తోన్న విషయం తెలిసిందే. అందులో భాగంగా వాటికి ఎక్స్ ట్రీమ్ లెవల్ ని, బోల్డ్ నెస్ ని యాడ్ చేస్తూ, జెంజీ ట్రెండ్‌కే దడ పుట్టించేలా `సైక్ సిద్ధార్థ` సినిమాని రూపొందించారు. సిటీ కల్చర్‌లో రియల్ లైఫ్‌లో ఇలాంటి స్టోరీస్ చాలానే ఉంటాయి. చాలా మంది కుర్రాళ్లు ఇలాంటి పరిస్థితులు ఫేస్ చేస్తారు. దాన్ని అంతే బోల్డ్ గా, ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఈ మూవీలో చూపించారు. అయితే కథగా చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. సిద్ధార్థ పబ్‌లో ఓ అమ్మాయిని చూసి మోజు పడతాడు, ఆమెతో ఎంజాయ్ చేస్తాడు. ఆమె కూడా సిద్దార్థని బాగా వాడుకుంటుంది. చివరికి హీరో బిజినెస్ పార్టనర్‌తో కమిట్ అవుతుంది. సిద్ధార్థకి హ్యాండిస్తుంది. ఆ బాధలో తాగుడికి బానిస అవుతాడు. ఈ క్రమంలో అతని లైఫ్‌ని శ్రావ్య మార్చేయడమే సినిమా. దాన్ని చాలా బోల్డ్ గా చూపించాడు దర్శకుడు. తనకు ఎలా అనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్లాడు. సినిమా ఫార్మాట్ అనే దాన్ని బ్రేక్ చేసి తీశాడు. ఈ క్రమంలో కొంత అర్జున్‌రెడ్డి స్టయిల్‌ని ఫాలో అయ్యాడు. చాలా వరకు జెంజీ జనరేషన్ ఇష్టపడేలా ఈ మూవీని రూపొందించారు. అలాంటి సీన్లనే ఎక్కువగా పెట్టారు. దీనికితోడు నందు పాత్రలోని లౌడ్ నెస్ డోస్ కాస్త ఎక్కువగా అనిపిస్తుంది. అదే సమయంలో క్రేజీగా ఉంటుంది. ప్రియురాలితో పలు సీన్లని బోల్డ్ గా చూపించారు. అలాగే ఫ్రెండ్స్ మధ్య గొడవలు కూడా క్రేజీగా చూపించారు. అవి కొంత వరకు ఆకట్టుకున్నా, బార్డర్ బ్రేక్‌చేసేలా ఉంటాయి. ఫస్టాఫ్ అంతా గోల గోల సాగుతుంది. పిచ్చి పిచ్చిగా రన్ అవుతుంది. వామ్మో ఇలా చూపించాడేంట్రా అనేలా సాగుతుంది. సెకండాఫ్‌ని కాస్త నెమ్మదిగా నడిపించారు. హీరో లైఫ్‌లోకి శ్రావ్య రావడంతో ఆయన తగ్గుతాడు. ఆమె వల్ల ఆలోచనలో పడతాడు. తెలియకుండానే ఆమె తనలో మార్పు తీసుకొస్తుంది. సరైన దారిలో పెడుతుంది. ఆయా సీన్లు ఆకట్టుకున్నాయి. క్లైమాక్స్ ని కాస్త ఎమోషనల్ గా ముగించాడు.
సైక్ సిద్ధార్థ మూవీలో మైనస్‌లు
సినిమాకి ఓ ప్రాపర్ కథ అంటూ లేదు. దర్శకుడికి ఇష్టం వచ్చినట్లు సినిమాని తీశాడు. ఎవరికోసం తీశాం, ఈ సినిమాని ఎవరు చూస్తారనేది పట్టించుకోకుండా తీసుకుంటూ వెళ్లాడు. బోల్డ్, లస్టీగా కొన్ని సీన్లని పెట్టడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కుర్రాళ్లు కూడా చూడ్డానికి ఇబ్బంది పడేలా కొన్ని సీన్లు ఉన్నాయి. మరోవైపు చూపించిన సీన్లే చూపించి విసుగు తెప్పించారు. సినిమాలో కంటెంట్ లేకపోవడంతో పదే పదే సీన్లని రిపీట్ చేయడంతో చిరాకు తెప్పిస్తుంది. ఆయా సీన్లు అడ్డదిడ్డంగా ఉన్నాయి. సినిమా ద్వారా ఏం చూపించాలనుకున్నాడు, ఏం చెప్పాలనుకున్నాడనేది క్లారిటీ లేదు. జెంజీ ట్రెండ్‌ని చూపించాడంతే. అదే సమయంలో సినిమా షార్ట్ ఫిల్మ్ కి ఎక్కువ, సినిమాకి తక్కువగా ఉంది. దీంతో రిపీట్ సీన్లో రెండు గంటలు లాగారు. అయితే ఈకథని మరింత ప్రాపర్ గా చేసి ఉంటే కచ్చితంగా యూత్‌ని ఆకట్టుకునే మూవీ అయ్యేది.
సైక్ సిద్ధార్థ మూవీలో ఆర్టిస్టులు ఎలా చేశారంటే
సిద్ధార్థగా నందు ఇరగదీశాడు. ఇటీవల ఆయన నటుడిగా పరిణతి చూపిస్తున్నాడు. `దండోరా`లోనూ బెస్ట్ ఇచ్చాడు. ఇందులోనూ అదరగొట్టాడు. కిర్రాక్ పుట్టించాడు. తనలోని కొత్త యాంగిల్‌ని చూపించాడు. ఇక శ్రావ్య పాత్రలో యామిని భాస్కర్ చాలా బాగా చేసింది. సెటిల్డ్ గా చేసి మెప్పించింది. ఆమెకి మంచి కమ్ బ్యాక్ అవుతుందని చెప్పొచ్చు. త్రిష పాత్రలో ప్రియాంక రెబెకా కూడా ఆకట్టుకుంది. సుఖేష్ రెడ్డి మెప్పించాడు. సిద్ధార్థ ఫ్రెండ్‌గా సింహా అదరగొట్టాడు. చిన్న కుర్రాడు కూడా బాగా చేశాడు. మిగిలిన పాత్రలు ఓకే అనిపించాయి.
సైక్ సిద్ధార్థ మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
సినిమాకి స్మరణ్ సాయి సంగీతం బాగుంది. బీజీఎం కూడా ఆకట్టుకుంది. అయితే చాలా చోట్ల అర్జున్ రెడ్డి ఫ్లేవర్ కనిపిస్తుంది. కె ప్రకాష్ రెడ్డి కెమెరా వర్క్ ఫర్వాలేదు. ప్రతీక్ నూతి ఎడిటింగ్ ఓకే అని చెప్పొచ్చు. కంటెంట్ లేకపోవడంతో పదే పదే రిపీటెడ్ సీన్లు వేయడం చిరాకు తెప్పిస్తుంది. నిర్మాణ విలువలు ఫర్వాలేదు. దర్శకుడు వరుణ్ రెడ్డి సినిమాని క్రేజీగా తీశాడు. కాకపోతే దశ దిశ లేని సినిమాని రూపొందించారు. చూస్తే చూడండి,లేకపోతే లేదు అనేలా తీశారు. చాలా నిర్లక్ష్యంతో తీసిన సినిమాగా ఇది అని చెప్పొచ్చు. అతను ప్రాపర్‌గా వర్క్ చేసి తీస్తే బాగుండేది.
ఫైనల్‌గా: సైక్ కాదు, సైకో సిద్ధార్థ. జెంజీ కుర్రాళ్లకి కొంత వరకు నచ్చే మూవీ, కానీ కామన్ ఆడియెన్స్ కి మాత్రం మెంటల్ ఎక్కిపోద్ది.
రేటింగ్: 2.25

