MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ రివ్యూ

ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ రివ్యూ

టీజర్ విడుదల అయ్యినప్పుడు  చాలా మంది ట్రోల్ చేసారు కానీ, ఎప్పుడైతే ట్రైలర్, పాటలు విడుదల అయ్యాయో, అప్పటి నుండి ఈ చిత్రం పై హైప్ మామూలు రేంజ్ లో రాలేదు. మరి అంత అంచనాలు అందుకుందా  

5 Min read
Surya Prakash
Published : Jun 16 2023, 09:55 AM IST| Updated : Mar 11 2024, 07:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
Adipurush Review

Adipurush Review

రామాయణం అంటే... కేవలం రాముని చరిత్ర మాత్రమే కాకుండా  రాముడు అనుసరించిన మార్గంగా చెప్తారు . న్యాయం, ధర్మం అంటే ఏమిటి వాటిని ఎలా ఆచరణలో పెట్టాలి, మాటకు కట్టుబడి ఎలా బతకాలి ఎలాంటి కష్టమొచ్చినా మాట తప్పకుండా ఎలా బతకాలి -వంటి అనేక అంశాలు తెలుసుకోవడానికే రామాయణం. అయితే ఈ విషయాలని ఈ సినిమా ఎంతవరకూ అనుసరించింది... ఈ సినిమాలో రామాయణంలో ఏమన్నా కొత్త కోణాన్ని చూపగలిగారా, టీజర్ వచ్చినప్పటి నెగిటివిటినీ సినిమా సమర్దవంతంగా దాటగలిగిందా  వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

211


స్టోరీ లైన్:

రాఘవుడు (ప్రభాస్)  తన భార్య జానకి (కృతి సనన్),  సోదరుడు శేషు (సన్నీ సింగ్)తో కలిసి వనవాసానికి వెళతాడు. రాఘవ మోహన రూపం చూసిన శూర్పణఖ అతనితో మోహంలో పడి తన భర్తగా ఆహ్వానిస్తుంది. 'నేను వివాహితుడిని. క్షమించండి' అని రాఘవుడు తప్పుకుంటాడు.దాంతో కోపం తెచ్చుకుని  జానకి ఉండబట్టే కదా అలా మాట్లాడాడు అని ఆమెను చంపాలని విఫల యత్నం చేస్తుంది.  తన వదినను రక్షించే క్రమంలో శేషు వేసిన బాణం సూర్పణఖ  ముక్కుకు తగులుతుంది. అవమానంతో లంకకు వెళ్లిన సూర్పణఖ... అన్నయ్య లంకేశుడి (సైఫ్ అలీ ఖాన్) దగ్గర మొరపెట్టుకుంటుంది. అంతేకాదు తన అన్నను రెచ్చగొట్టడానికి ..జానకి  అందం గురించి గొప్పగా చెప్తుంది. దాంతో తన చెల్లి ముక్కు కోసిన వారికి బుద్ది చెప్పటానికి..జానకిపై మోహావేశంతోనూ  సాధువు వేషధారణలో వెళ్లిన లంకేశుడు...జానకిని అపహరించి లంకకు తీసుకొస్తాడు. అప్పుడు  రాఘవ ఊరుకోడు కదా ...భజరంగి , ఆయన వానర సైన్యం సహాయంతో ..లంకపై దండెత్తి హోరాహోరీ  యుద్ధం చేస్తాడు..కానీ లంకేష్ కు బ్రహ్మ ఇచ్చిన ఓ వరం ఉండటంతో ఆయనకు మరణం లేదు. ఈ విషయం తెలిసిన రాఘవ ఏం చేసాడు...? భజరంగి ఈ యుద్దంలో ఎలా సాయం చేసాడు...వంటి విషయాలు వెండితెరపై చూసి తెలుసుకోవాలి. 
 

311

విశ్లేషణ:

ఫిక్షన్ కథను సినిమాగా తీసేటప్పుడు ఆ కథా ప్రపంచంపై విమర్శలకు పెద్దగా తావుండదు. కానీ నిజ జీవిత చరిత్రలు తెరకెక్కించేటప్పుడు,  లేదంటే పురాణాలు ఇతిహాసాల ఆధారంగా సినిమా తీసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏ మాత్రం మార్పులు,చేర్పులలో  తేడా చేసినా ఈ సోషల్ మీడియా యుగంలో ట్రోల్స్ తప్పవు.ఆదికావ్యం...ఆదిపురుష్ గా అనువర్తన జరిగేటప్పుడు అనేక మార్పులు జరిగాయనటంలో సందేహం లేదు. అయితే  ఆ మార్పులు మూలాన్ని పెకలించలేదు కానీ మోడ్రన్ మేకింగ్ పేరుతో చేసిన మార్పులు మాత్రం బాగోలేవు . వాల్మీకి రాసిన రామాయణంలో అరణ్య కాండ, యుద్ధ కాండ ఆధారంగా రూపొందిన సినిమా ఇది.  


 

411


ఈ జనరేషన్ పిల్లలకు హారీ పోటర్ తరహాలోనే మన పురాణాలు చెప్తే అర్దమవుతాయనుకుని తీసినట్లు అనిపించే సినిమా ఇది. మార్వెల్ సినిమాలు, సూపర్ హీరో సినిమాలను తరహాలో రామాయణాన్ని ప్రెజెంట్ చేసారు. అందుకు తగ్గట్లుగా కథనాన్ని డిజైన్ చేసారు. ఆ సినిమాలు చూసి, ఇష్టపడే వాళ్లకు ఈ మూవీ నచ్చుతుందనే ఆలోచనే ఈ కథ,కథనాన్ని నడిపించింది.  వాళ్లు అనుకునే ఈ జనరేషన్ పిల్లలు, కుర్రాళ్లు ఈ సినిమాకు వస్తే ఎంజాయ్ చేయగలగుతారు. అదే సమయంలో తాము చూసిన సూపర్ హీరోలు, గేమ్స్ లో ఉండే కొన్న విజువల్స్ ఈ సినిమాలో కనపడి విసుక్కుంటారు. అయితే  కొన్నిసార్లు కొత్తను ఆహ్వానించవలిసిందే. ఇదో వికటించిన ప్రయోగం అనుకోవాలి.

511


ఇక ఫస్టాఫ్ సినిమా బాగానే నడిచిపోయింది. సినిమా వర్కవుట్ అయ్యిందనుకునేలోగా సెకండాఫ్ వచ్చి బోర్ కొట్టించేస్తుంది. అందుకు కారణం దాదాపు ఎక్కువ శాతం కథ ఫస్టాఫ్ లోనే వచ్చేయటం.  సినిమా సెకండాఫ్ లో ఎక్కువ భాగం యుద్దం ఎపిసోడ్స్ తో నిండిపోయి విసుగెత్తించింది.  అలాగని మొత్తం ప్రయత్నాన్ని  తప్పు పట్టలేం.  గతంలో రామాయణం ఆధారంగా వచ్చిన  సినిమాల్లో లాగానే ఈ సినిమాను తీస్తే ఇంక ఎందుకు పనిగట్టుకుని ఈ సినిమా చూడటం...ఆ సినిమాలే రీరిలీజ్ చేసుకుంటే పోయేది కదా...అలాగని కొత్త పేరుతో రోతను అందించకూడదు. మరీ సినిమాటెక్ లిబర్టీ కాకపోతే రావణుడు అంత వింతగా ఎందుకు ఉంటాడు..మన దేశవాసిలా అనిపించడు. అలాగే రెగ్యులర్ తెలుగు సినిమాలు ఎక్కువగా చూసి, విలన్ పాత్రలను ఆవాహన చేసుకున్నట్లు విచిత్రంగా బిహేవ్ చేస్తూంటాడు.
 

611


 సీతాదేవి..పూర్తిగా నార్తిండియన్ జానకే. అంజనేయులు వారు మాత్రం బాగా కుదిరారు. కుంభకర్ణుడు పాత్ర కూడా తేలిపోయింది. అంత గొప్ప పాత్ర రెండు దెబ్బలకే చనిపోతుంది. ఇక సెకండాఫ్ లో రావణుడు..సీతాదేవి పీకకు కత్తి పెట్టడం..అదీ రాముడి ఎదురుగా... ఏదో సైకో సినిమా ఆలోచనలా ఉంటుంది... నిజంగా రావణుడు అలా చేయలేదని ఎలా చెప్పగలం అంటే..అంత చీప్ గా అంత గొప్ప రావణుడు బిహేవ్ చేయడని నమ్ముతాం కాబట్టి. అలాంటివి చాలా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు ఈ సినిమాలో దివ్యత్వం, ఎమోషన్ కనెక్టివిటీ  లేదు. 
 

711


ప్రభాస్ ,మిగతా ఆర్టిస్ట్ లు ఎలా చేసారంటే...

నిజానిక ఈ సినిమాలో ప్రభాస్ చేయటానికి ఏ అవకాశం స్క్రిప్టు ఇవ్వలేదు. అలా నడుచుకుంటూ వెళ్తూ , అప్పుడప్పుడూ బాణం సంధిస్తూ ఉంటాడు. పూర్తి ప్యాసివ్ పాత్ర అనిపిస్తుంది. ఆయన ఎమోషన్స్ ఏమీ మనకు అందవు.  అలాగే మీసాలతో రాముడు ఉంటాడా అంటూ చాలా మంది ఈ సినిమా ఫస్ట్ లుక్ రాగానే ప్రశ్నించారు. అయితే రాముడికి మీసాలు ఉన్నాయా లేవా అనే విషయం ప్రక్కన పెడితే.. సినిమా చూస్తున్నప్పుడు మాత్రం ఆ అనుమానం అయితే రాదు. అలాగే వినయ విధేయ రాముడిని ఇన్నాళ్లు చూసాం. ఈసారి ఫెరోషియస్ గా ఉండే రాముడు ఈ సినిమాలో కనపడతాడు. అందుకే మీసాలు మెయింటైన్ చేసారేమో అనిపిస్తుంది. ఇక రావణుడు గా ...చేసిన సైఫ్ ...లుక్ , డ్రస్ పరంగా అసలు బాగోలేదు కానీ నటన వరకు మెప్పించాడు.  . కృతి .. సీతాదేవి గా కన్నా హిందీ సినిమాల జానకి గానే కనిపిస్తుంది. హనుమంతుడు పాత్ర ఎంపిక మాత్రం వంద శాతం కరెక్ట్ గా అనిపించింది.దేవదత్త నాగే బాగా ప్లస్ అయ్యారు. లక్ష్మణుడు పాత్ర ...ఎంతచూసినా నార్త్ ఫేస్ క్రిందే అనిపిస్తుంది. మిగతావాళ్లు కథలో కలిసిపోయారు. 
 

811

టెక్నికల్ గా...:

సాంకేతికంగా ఈ సినిమా ఇంకా బాగా ఉండాల్సింది. ముఖ్యంగా సెకండాఫ్ లో అంతదారుణమైన విఎఫ్ ఎక్స్ వర్క్ శాకుంతలంలో ఈ మధ్యన కనపడింది. మళ్లీ ఈ సినిమాలో కనపడింది.   హాలీవుడ్ సినిమాలలో అదిరిపోయే విఫెక్స్ లతో చూసేస్తున్న టైమ్ లో అంతకు మించి ఉంటే కానీ ఆనని పరిస్దితి.  ఇక సినిమాలో హైలెట్ మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అని చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ సెకండాఫ్   లెంగ్త్ తగ్గించే కార్యక్రమం పెడితే బాగుండేది.  రావణుడి తలలు  VFX లో దారుణంగా కార్టూన్స్ లాగ ఉంటాయి. ఫైనల్ అవుట్ ఫుట్ లో అవి ఎందుకు చూసుకోలేదో..లేక అదే కొత్త అని ఫీలయ్యారో.. డబ్బింగ్ విషయానికి వస్తే..డైలాగులు అచ్చం ..డబ్బింగ్ ఫీల్ రావాలని రాసినట్లు అనిపిస్తాయి. 

పాటల్లో ...రాఘవ్, జానకిల ప్రేమలోని గాఢతను తెలిపే మెలోడి  ‘రామ్ సీతా రామ్’ పాట బాగుంది.   ”జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజా రామ్ .. నీ సాయం సదా మేమున్నాం.. సిద్ధం సర్వసైన్యం.. సహచరులై సహా వస్తున్నాం.. సకలం స్వామి కార్యం.. మహిమాన్విత మంత్రం నీ నామం”..  అంటూ సాగే డివోషనల్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. రావణుడితో యుద్ధానికి సన్నద్ధం అవుతున్న సందర్భంలో వచ్చే ఈ పాట బాగా క్లిక్ అయ్యింది.

అయితే అందరూ ఎదురూచూసే పాట మాత్రం లేదు..తీసేసారు... 

911

హైలెట్స్:
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
ఫస్టాఫ్ 
భజరంగి పాత్ర

మైనస్ లు :
ఎప్పటికీ పూర్తికాదా అనిపించేటంత లెంగ్త్
అర్దం పర్దం లేని రావణ చేష్టలు
నాసిరకం VFX 
 

1011


Final Thoughts:

సినిమా ఫస్టాఫ్ ..రెండో సారి వచ్చిన ట్రైలర్ లా క్లిక్ అయ్యింది..సెకండాఫ్ మాత్రం మొదటి వచ్చిన టీజర్ లా నాసిరకంగా ఉంది.

ఏదైమైనా రాముడు, లక్ష్ణణుడు, సీత, రావణబ్రహ్మ ల కథ  కాకుండా రాఘవ, శేషు, జానకి,లంకేష్ ల మధ్య జరిగే కథ కాబట్టి ఇలాగే ఉండచ్చు. ఉంటుంది. అయితే అసలు రామాయణం గురించి తెలియని ఈ జనరేషన్ పిల్లలకు ఈ సినిమా చూపించవచ్చు.వారి విజువల్  భాషలోనే చెప్పారు కాబట్టి వాళ్లకు చూపించవచ్చు.

-----సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5

1111

 నటీనటులు : ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, దేవదత్త, సోనాల్ చౌహన్ తదితరులు
మూలకథ : వాల్మీకి రాసిన రామాయణం ఆధారంగా
మాటలు : భీమ్ శ్రీనివాస్ (తెలుగులో)
పాటలు : రామజోగయ్య శాస్త్రి 
ఛాయాగ్రహణం : కార్తీక్ పళని
  నేపథ్య సంగీతం : సంచిత్ - అంకిత్  
స్వరాలు : అజయ్ - అతుల్, సచేత్ - పరంపర!
నిర్మాతలు : భూషణ్ కుమార్, కృష్ణకుమార్, ఓం రౌత్, వంశీ, ప్రమోద్, రాజేష్ నాయర్, ప్రసాద్ సుతార్
విడుదల : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (తెలుగులో)  
దర్శకత్వం : ఓం రౌత్
విడుదల తేదీ: జూన్ 16, 2023
 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved