ఓంకార్ హారర్ వెబ్ సీరిస్ 'మ్యాన్షన్ 24' రివ్యూ
‘మాన్షన్ 24’ టీజర్, ట్రైలర్లు ఆసక్తిని కలిగించాయి. అంతేకాకుండా ఇందులో సత్యరాజ్, వరలక్ష్మీ శరత్ కుమార్ వంటి స్టార్లు ఉన్నారు.
Mansion 24 movie
ఓంకార్ స్టార్ యాంకర్ గా పేరు తెచ్చుకోవటమే కాకుండా దర్శకుడుగానూ రాజు గారి గది సిరీస్ తో తనదైన ముద్ర వేసారు. ఆ సీరిస్ సినిమాలతో ప్రేక్షకుల్ని హారర్ కామెడీతో ఆకట్టుకున్న దర్శకుడు ఓంకార్ ఈసారి గ్యాప్ తీసుకుని మాన్షన్ 24 అనే సరికొత్త హారర్ వెబ్ సిరీస్ తో వచ్చారు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులో ఉంది. భయంతో కూడిన ఎంటర్టైన్మెంట్ ని అందిస్తానని మాట ఇచ్చారు. మారుతున్న నవతరం ప్రేక్షకులను ఓంకార్ ఈ సీరిస్ తో అలరించారా...హారర్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ మీద విజయాలు అందుకున్న ఓంకార్... ఇప్పుడు 'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ (Mansion 24 Web Series)తో ఓటీటీలో సక్సెస్ అందుకుతున్నారా. ఈ సిరీస్ ఎలా ఉంది? చూద్దాం
Mansion 24 movie
స్టోరీ లైన్
పూర్తిగా పాడుపడ్డ, పాతపడిన మాన్షన్ లో కథ మొదలవుతుంది. అక్కడ అమృత (వరలక్ష్మీ శరత్ కుమార్ ) గాయాలతో పడి ఉంటుంది. ఇక తన ఊపిరి ఆగిపోతుందని , చనిపోయే ముందు తన గతం మన ముందు పరుస్తుంది. అమృత (వరలక్ష్మీ శరత్ కుమార్) ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. అమృత తన తండ్రి కాళిదాసు (సత్యరాజ్) కనపడటం లేదని పోలీసులు కంప్లైంట్ చేస్తుంది. తండ్రి పనిచేసే పురావస్తు తవ్వకాల డిపార్ట్మెంట్ కి వెళ్లి ఎంక్వైరీ చేస్తే తవ్వకాల్లో దొరికిన విలువైన సంపదతో పారిపోయాడని చెప్తారు. అయితే అక్కడ ఆమెకి ఒక నిజం తెలుస్తుంది. ఆయన చివరగా ఆ పాతపడ్డ మాన్షన్ కి వెళ్ళాడని తెలుసుకుంటుంది. అయితే అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదమని, అక్కడికు వెళ్ళిన వాళ్ళు ఎవరు తిరిగి రాలేదని అమృత కు చెప్తారు. కాళిదాసుపై దేశద్రోహి కేసు పెట్టడం, మీడియా లో ఆయనపై నెగిటివ్ వార్తలు రావటంతో తల్లి (తులసి)క్రుంగిపోయి హాస్పటల్ పాలవుతుంది. ఈ క్రమంలో తన తండ్రి దేశద్రోహి కాదని, నిర్దోషి అని నిరూపించాలంటే ఆయన చివరగా వెళ్లి మాయమైన మాన్షన్ వెళ్ళాలని నిర్ణయించుకుని బయిలుదేరుతుంది. ఆ మాన్షన్ లో అడుగు పెట్టాక, అక్కడ ఉండే వాచ్ మెన్ (రావు రమేష్) ఆ మాన్షన్ చాలా ప్రమాదమని తన అనుభవాలని, తను విన్న కథలని చెప్పటం మొదలెడతాడు. అప్పుడు ఏమైంది...ఆ ‘మాన్షన్ 24’లో ఏముంది. ఆమె తండ్రి ఎలా మాయమయ్యాడు...అమృత అక్కడ నుంచి బ్రతికి బయిటపడిందా వంటి వివరాలు తెలియాలంటే సీరిస్ చూడాల్సిందే.
Mansion 24 movie
ఎలా ఉంది...
సాధారణంగా హారర్ ఫిలింస్ తో మెప్పించాలంటే దర్శకుడికి ఫిలిం మేకింగ్ లో కొన్ని గిమ్మిక్ లు తెలిసి ఉండాలి. ముఖ్యంగా మారిన ప్రేక్షకుడుని మెప్పించటం అంత సామాన్యమైన విషయం కాదు. అందుకోసం చాలా కసరత్తు చేయాలి. ఓంకార్ కథను ఎత్తుగడ వరకూ బాగానే చేయగలిగారు. అనుష్క భాగమతి చిత్రాన్ని గుర్తు చేసే ఈ సీరిస్ లో హారర్ ఎలిమెంట్స్ బాగానే పొందుపరిచారు. అయితే అవన్నీ మనని భయపడతాయని చెప్పలేం. అయితే ఓంకార్ గతంలో చేసిన హారర్ ఫిల్మ్ లు రాజుగారి గది సీరిస్ లలో కామెడీ మనకు నచ్చుతుంది. ఎందుకనో తన బలాన్ని ఇందులో వదిలేసారు ఓంకార్. ప్యూర్ హారర్ గా తీర్చి దిద్దాలని భావించారు. అయితే అందుకు ఈ సీరిస్ లో చూపించిన ఎలిమెంట్స్ సరిపోవు. పదేళ్ల క్రితం అయితే ఖచ్చితంగా అద్బుతం అందుము ఏమో...అయితే ఇలాంటివి చాలా చూసేయటం, ఇందులో ట్విస్ట్ ఊహించేయగలగటం వంటివి ఓంకార్ ఊహించి ఉండరు.
Mansion 24 movie
ఈ ‘మాన్షన్ 24’ కొన్ని చోట్ల అయ్యితే భయపెట్టింది. పెద్ద క్యాస్టింగ్ ఉంది కాబట్టి చూస్తున్నంతసేపూ ఎంగేజ్ చేసింది. క్లైమాక్స్ ఈ సీరిస్ కు తగ్గట్లు లేదు. అది బాగుంటే ఖచ్చితంగా నెక్ట్స్ లెవిల్ అయ్యేది. అలాగే అమృత అక్కడకి వెళ్లి వాచ్ మేన్ చెప్పే కథలు వరసపెట్టి వింటూంటే ..వరస ఎపిసోడ్స్ కదులుతూంటే మనకు కేవల ఆ కథలు వినడానికే అమృత ఆ పాతపడ్డ మాన్షన్ కి వెళ్తుందా అనిపిస్తుంది. లాస్ట్ ఎపిసోడ్ దాకా ఇదే తంతు. మనం అమృతకు , ఆమె తండ్రికు ఏం జరిగిందో మొదట తెలుసుకోవాలనుకుంటాము కానీ అక్కడ ఏం జరుగుతూందో చెప్తూంటే ఇంటెన్సిటీ ఏమి ఉంటుంది. ఓంకార్ ఆ విషయం ఎందుకనో మర్చిపోయారు.
Mansion 24 movie
ఎవరెలా చేసారు...
కీ రోల్ లో కనిపించిన వరలక్ష్మి శరత్ కుమార్...అమృత పాత్రకు ఫెరఫెక్ట్ యాప్ట్. మాన్షన్ వాచ్ మెన్ పాత్రలో రావు రమేష్ వెరైటిగా ఉన్నాడు. సత్యరాజ్ కనపడేది కాసేపు అయినా సిన్సియర్ ఆఫీసర్ గా ఉంటాడు. ఇంకా బిందు మాధవి, అవికా గోర్, అయ్యప్ప పీ శర్మ, మానస్, అమర్ దీప్, నందు వారి వారి పాత్రలలో రాణించారు.
Mansion 24 movie
టెక్నికల్ గా ..
'భ్రమకు భయం తోడైతే నిజంలా మారిపోతుంది' వంటి డైలాగులు కథలో అక్కడక్కడా వస్తూ ముందుకు నడిపిస్తాయి.స్క్రీన్‍ప్లేలో ఎలాంటి ప్రయోగాలు చేయలేదు. స్క్రిప్టులో అక్కర్లేని సీన్స్ లేవు. హారర్‌పైనే పూర్తిగా దృష్టి సారించారు ఓంకార్. అతిగా భయపెట్టాలనుకోలేదు. హారర్ ఎఫెక్టులు జస్ట్ ఓకే అన్నట్లున్నాయి. మయూఖ్ ఆదిత్య డైలాగ్స్ బాగున్నాయి. వికాస్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ జస్ట్ ఓకే అన్నట్లుంది. ఆది నారాయణ్ ఎడిటింగ్ ఫెరఫెక్ట్. బి రాజశేఖర్ సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ నీట్ గా ప్రొడక్ట్ కు సరపడ ఉన్నాయి.
Mansion 24 movie
ఫైనల్ థాట్
పాడుబడ్డ మాన్షన్ లు అన్నీ పనిగట్టుకుని భయపెట్టవు. భయపెట్టేవేమీ డోర్స్ ఓపెన్ కావు. కాబట్టి మాన్షన్ ఎక్కడైనా కనపడితే అక్కడ వాచ్ మెన్ ని పట్టుకుని అతని ద్వారా బోలెడు కథలు వినచ్చనే ధైర్యంతో, ఉత్సాహంతో ముందుకు వెళ్లండి. ఈ లోగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో 6 ఎపిసోడ్లుగా అందుబాటులో ఉన్న ఈ వెబ్ సిరీస్ ను ఒకసారి ట్రై చేయండి.
Rating:2.25
Mansion 24 movie
నటీనటులు: వరలక్ష్మీ శరత్ కుమార్, రావు రమేష్, సత్య రాజ్, అవికా గోర్, బిందు మాధవి, నందు తదితరులు
డైలాగ్స్: మయూఖ్ ఆదిత్య
ఎడిటింగ్: ఆది నారాయణ్
సినిమాటోగ్రఫీ: బి. రాజశేఖర్
సంగీతం: వికాస్ బడిస
నిర్మాతలు: ఓంకార్, అశ్విన్ బాబు, కళ్యాణ్ చక్రవర్తి
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఓంకార్