`మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి `మూవీ రివ్యూ, రేటింగ్..
టాలీవుడ్ స్వీటి అనుష్క ఐదేళ్ల తర్వాత వెండితెరపై మెరుస్తుంది. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రంతో వచ్చింది. ఇందులో యంగ్ హీరో, కామెడీకి కేరాఫ్‌గా నిలిచే నవీన్ పొలిశెట్టి హీరోగా నటించడం విశేషం. మహేష్‌బాబు పి దర్శకత్వం వహించారు. గురువారం శ్రీకృష్ణాష్టమి(సెప్టెంబర్ 7) సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. సినిమా ఎలా ఉంది అనేది రివ్యూలో తెలుసుకుందాం.
టాలీవుడ్ స్వీటి అనుష్క ఐదేళ్ల తర్వాత వెండితెరపై మెరుస్తుంది. `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` చిత్రంతో వచ్చింది. ఇందులో యంగ్ హీరో, కామెడీకి కేరాఫ్‌గా నిలిచే నవీన్ పొలిశెట్టి హీరోగా నటించడం విశేషం. అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా నటిస్తున్నారంటే ఒకింత క్రేజ్ నెలకొంది. ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాకి అప్ కమింగ్ డైరెక్టర్ మహేష్‌బాబు పి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ పై వంశీ, ప్రమోద్ నిర్మించారు. నేడు గురువారం శ్రీకృష్ణాష్టమి(సెప్టెంబర్ 7) సందర్భంగా ఈ సినిమా విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది. ఆడియెన్స్ ని నవ్వించిందా? అనుష్క, నవీన్ జోడీ మెప్పించిందా? అనేది రివ్యూలో(Miss Shetty Mr Polishetty Movie) తెలుసుకుందాం.
కథః
అన్విత శెట్టి(అనుష్క) యూకేలో పాపులర్ చెఫ్. ఆమె చేసే రెసిపీలకు ఎంతో మంది అభిమానులుంటారు. అమ్మ(జయసుధ)కి అనారోగ్యం. బతికుండగానే పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెస్తుంది. కానీ అన్విత తాను పెళ్లికి నో చెబుతుంది. కానీ తన అమ్మానాన్న చిన్నప్పుడే విడిపోవడమే కారణం. మళ్లీ ఆ తప్పు తాను చేయనని, అందుకే పెళ్లి చేసుకోనని చెబుతుంది. తల్లి కోరిక మేరకు ఇండియాకి వస్తుంది. అంతలోనే అమ్మ చనిపోతుంది. దీంతో ఒంటరవుతుంది. ఈ నేపథ్యంలో ఆ ఒంటరితనం పోవాలంటే తనకు బిడ్డకి జన్మనివ్వాలనుకుంటుంది. పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కనాలనుకుంటుంది. స్పెర్మ్ డోనర్‌ని వెతుకుతుంది. మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి నుంచి స్పెర్మ్ తీసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలో ఎంతో మందిని అన్వేషిస్తుంది. చివరగా స్టాండప్ కమెడియన్ సిద్దు పొలిశెట్టి(నవీన్ పొలిశెట్టి) క్వాలిటీస్ బాగా నచ్చుతాయి. అతని గురించి అన్నీ విషయాలు తెలుసుకుంటుంది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి ట్రావెల్ చేస్తారు. చివరకు తాను ఏం కావాలో అతనికి చెప్పి ఒప్పించాలనుకుంటుంది. అనూహ్యంగా పెద్ద ట్విస్ట్ ఇస్తూ సిద్దు.. అన్వితకి ప్రపోజ్ చేస్తాడు. దీంతో అన్విత షాక్ అవుతుంది. అప్పుడే సిద్ధుకి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇస్తుంది అన్విత. మరి ఆ ట్విస్టేంటి? నవీన్ ప్రేమని అన్విత యాక్సెప్ట్ చేసిందా? ఆమెకోసం సిద్దు స్పెర్మ్ డొనేట్ చేశాడా? ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగిలిన (Miss Shetty Mr Polishetty Movie) కథ.
విశ్లేషణః
స్వీటి అనుష్క, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్‌లో సినిమా అంటే `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి`(Miss Shetty Mr Polishetty Movie) చిత్రంపై అందరిలోనూ ఆసక్తినెలకొంది. `జాతిరత్నాలు` తర్వాత నవీన్ పొలిశెట్టి చేస్తున్న సినిమా కావడంతో ఆ ఆసక్తి మరింత పెరిగింది. ఆ అంచనాలు, ఆసక్తికి తగ్గట్టుగానే `మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి` సినిమా ఉంది. అప్ కమింగ్ దర్శకుడైనా మహేష్‌బాబు పి అంతే బాగా సినిమాని తెరకెక్కించాడు. నవీన్ పొలిశెట్టి మార్క్ కామెడీ, అనుష్క మార్క్ ఎమోషన్స్ మేళవించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. సినిమాని ఆద్యంతం నవ్విస్తూ నవ్విస్తూ చివరగా ఎమోషనల్ టచ్ ఇచ్చిన తీరు బాగుంది. అదే సినిమాకి హైలైట్‌గా నిలుస్తుంది. అయితే డైలాగులు, కామెడీ సీన్లలో నవీన్ పొలిశెట్టి మార్క్ కనిపిస్తుండటం విశేషం.
సినిమా మొదటి భాగం పదిహేను నిమిషాల వరకు సినిమా కాస్త రెగ్యూలర్ గా అనిపిస్తుంది. రెగ్యూలర్‌గా ఇంట్లో పెళ్లికోసం పేరెంట్స్ ఫోర్స్ చేయడం వంటి సీన్లు రొటీన్ ఫీలింగ్‌ని కలిగిస్తాయి. కానీ నవీన్ పొలిశెట్టి ఎంటర్ అయిన తర్వాత సినిమా పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్స్ ట్రాక్ ఎక్కుతుంది. ఆయన మార్క్ కామెడీ డైలాగులు, పంచ్‌లు, ఇన్నోసెంట్ ఇందులో `జాతిరత్నాలు` సినిమాని మించి ఉంటుంది. అలాగని, ఆ సినిమాతో పోలిక లేదు, ఈ సినిమా స్టయిల్ పూర్తిగా భిన్నమైనది. అనుష్క ఇందులో పెళ్ళి, భర్త అనేది లేకుండా,ఫిజికల్‌గా కలవకుండా ప్రెగ్నెంట్ కావాలనుకుంటుంది. అందుకోసం సరైన మగాడిని వెతికే క్రమంలో నవీన్ దొరకడం, అతని గురించి ఆరా తీయడం, ఈ క్రమంలో ఇద్దరి మధ్య వచ్చే సీన్లు చాలా ఫన్నీగా ఉంటాయి. ఆద్యంతం నవ్వులు పూయిస్తుంటాయి. మధ్య మధ్యలో స్టాండప్ కామెడీ సీన్లు మరింతగా నవ్వులు పంచుతాయి. చూస్తున్నంత సేపు నవ్వులే నవ్వులు అనేలా ఉంటుంది.
కామెడీలోనూ ఎమోషన్స్, లవ్‌ని జోడించిన తీరు సూపర్. కామెడీ సీన్లలో ఎమోషన్స్ ని మేళవించడం చాలా కష్టమైన పని, అది కొంచెం బ్యాలెన్స్ తప్పినా, కిచిడి అయిపోతుంది. ఆ విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. పర్‌ఫెక్ట్ గా కామెడీని, లవ్‌ని, ఎమోషన్స్ ని మిక్స్ చేసిన తీరు సూపర్బ్ అనిపిస్తుంది. ఫస్టాఫ్ మొత్తం నవ్వులే నవ్వులు అనేలా సాగుతుంది. సెకండాఫ్‌లో అసలు కథ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి కామెడీ, సీరియల్, లవ్ ట్రాక్, ఎమోషన్స్ ఇలా అన్ని(Miss Shetty Mr Polishetty Movie) ఒకదాని తర్వాత ఒకటి వస్తుంటాయి. కానీ చివరి 15నిమిషాలు పూర్తిగా ఎమోషనల్ సైడ్ వెళ్తుంది. నవ్వించి నవ్వించి ఏడిపించడం అనేలా మారిపోతుంది. నవీన్, అనుష్కల లవ్ ట్రాక్ సైతం ఆద్యంతం గుండెబరువెక్కించేలా ఉంటుంది. సినిమాలో అంతర్లీనంగా మంచి సందేశం కూడా ఉంటుంది. ప్రతి అమ్మాయికి ఒక మగాడు తోడు కావాలని, బిడ్డకి తండ్రి ఉండాలని, తోడు లేకపోతే ఒంటరి ఫీలింగ్ వెంటాడుతుందనే విషయాన్ని చెప్పకనే చెబుతుంది. అదే హార్ట్ టచ్చింగ్‌గా ఉంటుంది. సినిమా చాలా వరకు నేటి సమాజానికి అద్దం పడుతుంది. నేటి కల్చర్‌కి అద్దం పడుతుంది. కుటుంబ వ్యవస్థని చూపిస్తుంది. అందులోనూ రెండు వైపుల బ్యాలెన్స్ చేసిన తీరు బాగుంది.
అయితే అనుష్క.. తాను ఒంటరిగా ఉండాలనుకోవడానికి సంబంధించిన కారణం బలంగా అనిపించదు. సెకండాఫ్‌లో అక్కడక్కడ కాస్త స్లో ఫీలింగ్ కలుగుతుంది. అదే సమయంలో కొంత రెగ్యూలర్ ట్రాక్ అనిపించేలా ఉంటుంది. కానీ నవీన్ పొలిశెట్టి కామెడీ సీన్లు వాటిని డామినేట్ చేస్తాయి. కేవలం సీన్లని మాత్రమే కాదు, అనుష్కని కూడా డామినేట్ చేసేలా అతను పర్‌ఫెర్మ్ చేయడం విశేషం. ఓవరాల్‌గా రెండున్నర గంటలపాటు ఈ చిత్రం ఆద్యంతం నవ్విస్తుంది. గుండెని టచ్ చేస్తుంది.
నటీనటులుః
అనుష్కకి ఇది మంచి కమ్ బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. ఆమె నటిగా ఎప్పుడో ప్రూవ్ చేసుకున్నారు. ఇందులో జస్ట్ అలవోగా చేసుకుంటూ వెళ్లిపోయారు. చివర్లో మాత్రం గుండెని బరువెక్కిస్తుంది. ఇక నవీన్ పొలిశెట్టి చెడుగుడు ఆడుకున్నాడు. తనలోని కామెడీని మాత్రమే కాదు ఇందులో ఎమోషనల్ సైడ్ కూడా చూపించాడు. లవర్‌గానూ మెప్పించాడు. అదే సమయంలో ఎమెషనల్ సీన్లలోనూ అదరగొట్టాడు. డాన్సులు బాగా చేశాడు. తనలోని కొత్త టాలెంట్‌ని పరిచయం చేశాడు. నటన పరంగా చాలా వరకు అనుష్కని డామినేట్ చేశాడు. నవీన్ ఫ్రెండ్‌గా అభినవ్ గోమటం, అనుష్క ఫ్రెండ్ గా సోనియా, నాజర్ ఓకే అనిపించారు. నవీన్ తల్లితండ్రులుగా మురళీ శర్మ, తులసి ఇరగదీశారు. అలాగే అనుష్క అమ్మగా జయసుధ కాసేపు మెప్పించింది.
టెక్నీషియన్లుః
సినిమాకి ఇద్దరు సంగీత దర్శకులు. రథన్ సాంగ్స్ అందిస్తే, గోపీసుందర్ బీజీఎం అందించారు. సాంగ్స్ బాగున్నాయి. కానీ వాహ్ అనిపించేలా లేవు. వాటిపై మరింత ఫోకస్ పెట్టాల్సింది. `లేడీ లేడీ లక్` లాంటి గుర్తుండే పాటలు ఉంటే ఇంకా అదిరిపోయింది. కానీ గోపీసుందర్ బీజీఎంతో అదరగొట్టారు. ఆర్‌ఆర్ అదిరిపోయింది. హైలైట్ గా నిలుస్తుంది. నీరవ్ షా కెమెరా వర్క్ సూపర్బ్. విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ఎడిటింగ్ పరంగా కొంత కేర్ తీసుకోవాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి. దర్శకుడు మహేష్ బాబు పి సినిమాని చాలా బాగా తెరకెక్కించాడు. ఆద్యంతం వినోదాత్మకంగా తీసుకెళ్తూ, ఆలోచింప చేస్తూ, హార్ట్ టచ్ చేసిన తీరు బాగుంది. డైలాగ్‌లు అదిరిపోయాయి. హైలైట్‌గా నిలిచాయి.
ఫైనల్‌గాః ఆద్యంతం నవ్విస్తూ, ఆలోచింప చేస్తూ గుండె బరువెక్కించే చిత్రం. ఎంటర్‌టైన్‌మెంట్ రోలర్ కోస్టర్.
రేటింగ్‌ః 3
నటీనటులు : అనుష్క శెట్టి, నవీన్ పోలిశెట్టి, మురళీ శర్మ, జయసుధ, అభినవ్ గోమఠం, సోనియా దీప్తి, తులసి, నాజర్ తదితరులు
ఛాయాగ్రహణం : నిరవ్ షా
నేపథ్య సంగీతం : గోపి సుందర్
స్వరాలు : రధన్
నిర్మాతలు : వంశీ - ప్రమోద్
కథ, కథనం, మాటలు, దర్శకత్వం : మహేష్ బాబు పి.