- Home
- Entertainment
- Movie Reviews
- `కుబేర` మూవీ రివ్యూ.. ధనుష్, నాగార్జున, రష్మికలతో శేఖర్ కమ్ముల చేసిన మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా?
`కుబేర` మూవీ రివ్యూ.. ధనుష్, నాగార్జున, రష్మికలతో శేఖర్ కమ్ముల చేసిన మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా?
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం `కుబేర`. నేడు విడుదలైన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

`కుబేర` మూవీ రివ్యూ
కూల్ అండ్ క్లాసిక్, సెన్సిబుల్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల రూట్ మార్చారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో మల్టీ స్టారర్ మూవీ `కుబేర`ని రూపందించారు. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య, ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు శుక్రవారం (జూన్ 20) రిలీజ్ అయ్యింది. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది? హిట్టా ఫట్టా? అనేది రివ్యూలో చూద్దాం.
`కుబేర` మూవీ కథ
నీరజ్(జిమ్ సార్ప్) ఇండియాలోనే పెద్ద కుబేరుడు(బిజినెస్ మ్యాన్). ప్రపంచంలోనే తాను నెంబర్ వన్ బిలియనీర్ కావాలనుకుంటాడు. బంగాళాఖాతంలో ఆయిల్ నిధి బయటపడుతుంది. దాన్ని చేజిక్కించుకునేందుకు ప్రభుత్వ పెద్దలతో చేతులు కలుపుతాడు. అందుకు వారికి లక్ష కోట్లు ఇవ్వాల్సి వస్తుంది.
అందులో యాభైవేల కోట్లు బ్లాక్, యాభై వేల కోట్లు వైట్లో హవాలా ద్వారా ఇప్పించే ప్లాన్ చేస్తారు. ఇది చేయాలంటే మాజీ సీబీఐ ఆఫీసర్ దీపక్(నాగార్జున) అయితే కరెక్ట్ అని ఆయన్ని తీసుకొస్తారు. దీపక్ చేయని నేరానికి ప్రభుత్వపెద్దల కారణంగా జైల్లో గడపాల్సి వస్తుంది. ఆయన్ని జైలు నుంచి తీసుకొచ్చి ఈ డీల్ సెట్ చేస్తారు. విదేశాల నుంచి హవాలా మనీ తెప్పించేందుకు కొందరు బినామీలను పెడతారు.
అందుకు బిచ్చగాళ్లని ఎంచుకుంటారు. అలా దేవా(ధనుష్)ని తిరుపతిలో పట్టుకుంటారు. ఇలా నలుగురు బిచ్చగాళ్లని ట్రైన్ చేసి బినామీలుగా మార్చి వేల కోట్లు ట్రాన్స్ ఫర్ చేయిస్తుంటారు. మిగిలిన ముగ్గురు ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేస్తారు. వారిని చంపేస్తారు. కానీ దేవా ట్రాన్సాక్షన్ క్యాన్సిల్ అవుతుంది. కానీ అతన్ని చంపేసేందుకు తీసుకెళ్తారు.
ఈ క్రమంలో వారి నుంచి తప్పించుకుంటాడు దేవా. అతన్ని పట్టుకునేందుకు దీపక్ టీమ్, నీరజ్ మనుషులు వెతుకుతుంటారు. కానీ ఒకసారి దొరికి పారిపోతాడు. వారి నుంచి పారిపోయే క్రమంలో సమీరా(రష్మిక మందన్నా) పరిచయం అవుతుంది.
ఆమె ప్రేమించిన వాడితో లేచిపోవడానికి నల్గొండ నుంచి ముంబయి వెళ్తుంది. ప్రేమించిన వాడి చేతిలో మోసపోతుంది. దేవా వల్ల తాను కూడా చిక్కుల్లో పడుతుంది. నీరజ్ మనుషులు వారిని వెంటాడుతుంటారు. మరోవైపు నీరజ్ కోసం పనిచేసిన దీపక్‌లో మార్పు వస్తుంది. అన్యాయం వైపు కాకుండా, నిజాయితీ వైపు ఉండాలనుకుంటాడు.
మరి ఆయనలో వచ్చిన మార్పు ఎలాంటి పరిణామాలకు దారితీసింది. దేవా వద్ద ఉన్న డబ్బు నీరజ్ కి వెళ్లిందా? ఆ మనీ కోసం దేవా ఏం చేశాడు? తనకు సమీరా ఇచ్చిన సపోర్ట్ ఏంటి? ఈ కథ ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగిలిన కథ.
`కుబేర` మూవీ విశ్లేషణః
శేఖర్ కమ్ముల మూవీస్ సెన్సిబుల్‌గా ఉంటాయి. చాలా ఇంటెన్సిటితో ఉంటాయి. సమాజంలోని రుగ్మతలను ఆయన టచ్ చేస్తుంటారు. ఇందులోనూ అలాంటిదే చూపించారు. ప్రస్తుతం దేశంలో కుబేరుగా రాణిస్తున్న ఒక బిజినెస్ మ్యాన్ ప్రభుత్వాలను ఎలా శాసిస్తున్నారనేది చూపించారు.
అదే సమయంలో రాజకీయ నాయకులు, బిజినెస్‌మ్యాన్‌లు ఎలా కుమ్మక్కవుతారనేది ఇందులో కళ్లకి కట్టినట్టు చూపించారు. సినిమా ప్రారంభంలో ఆయిల్ నిధి దొరకడం, దీనిపై ఆ వ్యాపారవేత్త కన్నుపడటం, మంత్రులతో డీల్ సెట్ చేయడం, భారీ లెవల్‌లో మనీ ట్రాన్స్ ఫర్ చేయడం వంటివి రియాలిటీకి దగ్గరగా చూపించారు.
ఇంకా చెప్పాలంటే జరిగిన విషయాలనే దర్శకుడు ఇందులో చూపించినట్టుగా అనిపిస్తుంది. దానికి బిచ్చగాడి కథకి లింక్ చేసిన తీరు బాగుంది. ఫస్టాఫ్ అంతా ఈ స్కామ్ కి సంబంధించిన వ్యవహారాలు, బినామీలను క్రియేట్ చేయడం, బిచ్చగాళ్లని తీసుకొచ్చి వారిని బిజినెస్ మ్యాన్‌లుగా తయారు చేయడంతో సాగుతుంది.
అంతలోనే దేవా తప్పిపోవడంతో ఆయన్ని పట్టుకునేందుకు వీరుపడే పాట్ల చుట్టూ సాగుతుంది. సెకండాఫ్ సైతం అదేకొనసాగుతుంది. ఇక దేవాలో వచ్చిన మార్పు, దీపక్‌లో వచ్చిన మార్పు క్యూరియాసిటీని క్రియేట్ చేస్తాయి. మరోవైపు సమీరాతో దేవా జర్నీ కూడా కాస్త ఫన్నీగా ఇంట్రెస్టింగ్‌గా నడిపించారు. అదే సమయంలో దీపక్ ఫ్యామిలీ సీన్లు కాస్త ఎమోషనల్‌గా ఉంటాయి.
`కుబేర` లో మైనస్‌లు
అయితే సినిమా ప్రారంభంలో భారీ హైప్ ఇచ్చారు. ఆ తర్వాత డైరెక్ట్ గా కథలోకి తీసుకెళ్లారు. కానీ స్లోగా సినిమాని నడిపించడంతో ల్యాగ్ అనే ఫీలింగ్ కలుగుతుంది. ఫస్టాఫ్ మొత్తం సినిమా ఈ ట్రాన్సాక్షన్, దేవాని పట్టుకోవడం చుట్టూనే సాగుతుంది.
కథని చాలాస్లోగా నడిపించాడు దర్శకుడు. ఎలాంటి ట్విస్ట్ లు, టర్న్ లు లేవు. దీంతో ఆడియెన్స్ కి కనెక్ట్ కాలేకపోతుంది. నెక్ట్స్ ఏంటనే క్యూరియాసిటీ మిస్ అయ్యింది. ఎక్కడ కూడా హై మూమెంట్స్ లేవు. రెగ్యూలర్‌గా కథని నడిపించుకుంటూ వెళ్లారు. మరోవైపు సెకండాఫ్‌లోనూ వరుస హత్యలకు సంబంధించిన సీన్లు కూడా చాలా పేలవంగా డీల్ చేశారు.
హై మూమెంట్స్ ఉన్నా కూడా వాటిని సరిగ్గా వాడుకోలేదు. ధనుష్, రష్మిక ల మధ్య సన్నివేశాలను సో సోగానే తీసుకెళ్లాడు. వారిమధ్య సీన్లలో ఫన్ పెద్దగా వర్క్ కాలేదు. నాగార్జున పాత్రని ఇంకా బాగా డీల్ చేయాల్సింది. ఆ పాత్రని సరిగ్గావాడుకోలేదనిపిస్తుంది.
సినిమా ప్రారంభం నుంచి సింపుల్‌గా ఫ్లాట్‌గా సాగడంతో క్లైమాక్స్ లో అయిన ఏదైనా మ్యాజిక్ చేస్తారని ఆశిస్తే అక్కడ కూడా నిరాశనే కలుగుతుంది. సింపుల్‌గా ముగింపు పలికారు. పెద్ద స్టార్ కాస్టింగ్ ని పెట్టుకుని ఇలా సింపుల్‌గా క్లోజ్ చేయడం అంతగా నప్పలేదు. అక్కడ హై మూమెంట్స్ ఏదైనా ప్లాన్ చేయాల్సింది. ప్రపంచ కుబేరుడు కుక్కచావు చచ్చాడని చెప్పిన తీరు బాగుంది.
`కుబేర`లో నటీనటులు ఎలా చేశారంటే?
దేవా పాత్రలో ధనుష్ రెచ్చిపోయారు. పాత్రలో జీవించాడు. సినిమా మొత్తం దేవానే తప్ప ధనుష్ ఎక్కడా కనిపించడు. బిచ్చగాడిగా ఆయన విశ్వరూపం చూపించారు. వాహ్ అనిపించాడు. సినిమాకి ఆయన నటనే హైలైట్.
ఇక దీపక్ గా నాగార్జున బలమైన పాత్రలో నటించాడు. చాలా సహజంగా చేసి మెప్పించాడు. ఓ కొత్త నాగ్‌ని చూడొచ్చు. కానీ ఆయన్ని సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. ఆయన పాత్ర ముగింపు కూడా నప్పేలా లేదు. సమీరా పాత్రలో రష్మిక బాగా చేసింది. తను కూడా సెకండాఫ్‌లో రచ్చ చేసింది. తన బెస్ట్ ఇచ్చింది.
ఇక నీరజ్ పాత్రలో జిమ్ సార్ఫ్ అదరగొట్టాడు. నెగటివ్ రోల్‌లో కార్పొరేట్‌గా ఒదిగిపోయాడు. అంతే బాగా చేశాడు. ఖుష్బూగా చేసిన అమ్మాయి మెప్పించింది. మిగిలిన పాత్రలకు పెద్దగా ప్రయారిటీ లేవు.
`కుబేర` టెక్నీషియన్ల పనితీరుః
`కుబేర` మూవీకి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందించారు. అమ్మపై వచ్చే పాట ఆకట్టుకుంది. దాన్నే బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌లో వాడుకున్నాడు. అది వచ్చినప్పుడు ఎమోషనల్‌గా అనిపిస్తుంది. కానీ మిగిలిన పాటలు, బీజీఎం మాత్రం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సీన్లని హైలైట్ చేయలేకపోయాయి.
ఓ రకంగా దేవిశ్రీ నుంచి ఇలాంటి పేలవమైన మ్యూజిక్ ని ఊహించలేం. కెమెరా వర్క్ బాగానే ఉంది. విజువల్స్ బాగున్నాయి. కొత్తగా అనిపిస్తాయి. ఎడిటింగ్ పరంగా చాలా వర్క్ చేయాల్సింది. ఓ అరగంట కట్‌చేసినా నష్టం లేదు. నిడివి పెద్ద మైనస్. నిర్మాణం పరంగా బాగానే ఉంది.
దర్శకుడు శేఖర్ కమ్ముల తనదైన స్టయిల్‌లో మూవీస్ చేస్తారు. కమర్షియల్ అంశాలను మేళవిస్తూనే తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెబుతారు. ఇందులోనూ అదే చేశారు, కానీ కమర్షియల్ ఎలిమెంట్లని తగ్గించారు. తన మార్క్ పాటలు లేవు. ఫన్‌లేదు. ఎమోషన్స్ లేవు. దీంతో సినిమా మొత్తం డ్రై గా సాగుతుంది. డైలాగ్‌లు కూడా సింపుల్‌గానే ఉన్నాయి.
న్యాయం, నీతి గురించి చెప్పే డైలాగ్ బాగుంది. ఎమోషన్స్ లో డెప్త్ మిస్ అయ్యింది. పెయిన్‌లోనూ డెప్త్ మిస్ అయ్యింది. సంఘర్షణ కూడా పెద్దగా పండలేదు. దీంతో సినిమా డ్రై ఫీల్ తెప్పిస్తుంది.
ఫైనల్‌గాః చప్పగా సాగే `కుబేర`.
రేటింగ్‌ః 2.5