MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Deewana Movie Review: దీవాన మూవీ రివ్యూ.. గుండెని పిండేసే హార్ట్ టచ్చింగ్‌ లవ్‌ స్టోరీ

Deewana Movie Review: దీవాన మూవీ రివ్యూ.. గుండెని పిండేసే హార్ట్ టచ్చింగ్‌ లవ్‌ స్టోరీ

హర్షిత్‌ రెడ్డి, స్మేహ మణిమేగలై జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్‌ సంగిశెట్టి రూపొందించిన `దీవాన` మూవీ ఈ శనివారం ఆడియెన్స్ ముందుకు వచ్చింది. మరి ఈ లవ్‌ స్టోరీ ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్‌ అయ్యిందా? 

5 Min read
Author : Aithagoni Raju
Published : Jun 20 2026, 08:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
దీవాన మూవీ రివ్యూ
Image Credit : Asianet News

దీవాన మూవీ రివ్యూ

`శుభం` చిత్రంలో మెయిన్‌ లీడ్‌గా చేసిన హర్షిత్‌ రెడ్డి హీరోగా నటించిన కొత్త మూవీ `దీవాన`. శ్రీకాంత్‌ సంగిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతూ ఈ మూవీని రూపొందించాడు. ఇందులో హర్షిత్‌ రెడ్డి సరసన స్మేహ మణిమేగలై హీరోయిన్‌గా నటించింది. వీకే నరేష్‌, ఝాన్సీ, జీవన్‌, రఘు, వేణు ఎల్దండి కీలక పాత్రలు పోషించిన చిత్రమిది. అర్హ మీడియా, వీ స్టూడియోస్‌ పతాకంపై వాసు దేవ్‌ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మించారు. ఈ మూవీని గీతా ఆర్ట్స్ రిలీజ్‌ చేస్తుండటం విశేషం. నేడు శనివారం(జూన్‌ 20)న విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది? ఆడియెన్స్ ని ఆకట్టుకుందా? ఈ వారంలో వచ్చిన చిత్రాల్లో ఇదైనా ఆకట్టుకుందా? అనేది రివ్యూలో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
దీవాన మూవీ కథ
Image Credit : Asianet News

దీవాన మూవీ కథ

మున్నా(హర్షిత్‌రెడ్డి) ఓల్డ్ సిటీలో అల్లరి చిల్లరగా తిరిగే కుర్రాడు. అతనికి ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉంటారు. వీరి ముగ్గురు అన్నీ షేర్‌ చేసుకుంటారు. స్నేహానికి మరో పేరు. చదువు మధ్యలోనే ఆపేసి నిత్యం గొడవలు, తాగుతూ ఉంటారు. వినాయకుడి నిమజ్ఞ్నం వేళ ఒక అమ్మాయిని చూస్తాడు మున్నా. ఆమె అమ్ములు(స్మేహ మణిమేగలై). మీ సేవా సెంటర్లో పనిచేస్తుంది. ఆమెని చూసి ఫిదా అయిన మున్నా, రోజూ ఆమె వెంటపడుతుంటాడు. రోజు రోజుకి ఆమెనే తన సర్వస్వం అని భావిస్తాడు. ఈ క్రమంలో ఫ్రెండ్స్ తోనూ గొడవ పడతాడు. రోజూ కరెంట్‌ బిల్లుల పేరుతో ఆమె వద్దకు వెళ్లి తన ప్రేమ విషయాన్ని వెల్లడిస్తాడు. ఓ రోజు నీకు నాకు సెట్‌ కాదు, నేను 20 వేలు సంపాదిస్తున్నాను, నువ్వు కూడా అంత సంపాదించాలని, ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవాలని కండీషన్‌ పెడుతుంది. అప్పుడే నీ ప్రేమని ఒప్పుకుంటానని చెబుతుంది. ఆ రోజు వెళ్లిన మున్నా.. ఎస్‌ ఐ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో పాత గొడవలు వెంటాడుతుంటాయి? తన ఆపోజిట్‌ బ్యాచ్‌ కుర్రాళ్లు తరచూ ఇబ్బంది పెడుతుంటారు. దీంతో ఇద్దరి మధ్య గొడవ అవుతుంది. మరోవైపు జాబ్‌ తెచ్చుకున్న తర్వాతనే ఆ అమ్మాయిని చూస్తానని ఒట్టువేసుకుంటాడు.  మరి తన గొడవల మధ్య మున్నా ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నాడా? ఈ క్రమంలో మున్నాకి అమ్ము ఇచ్చిన ట్విస్ట్ ఏంటి?  వీరి ప్రేమ ఎలాంటి మలుపులు తీసుకుందనేది మిగిలిన సినిమా.

Related Articles

Related image1
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Related image2
Transfer Trimurthulu Movie Review: ట్రాన్స్ ఫర్‌ త్రిమూర్తులు మూవీ రివ్యూ, వడ్డే నవీన్‌ రీ ఎంట్రీ మూవీ ఎలా ఉందంటే?
37
దీవాన మూవీ విశ్లేషణ
Image Credit : Asianet News

దీవాన మూవీ విశ్లేషణ

లవ్‌ స్టోరీస్‌లో ఇది సరికొత్త ప్రేమ కథా చిత్రం అని చెప్పొచ్చు. రియాలిటీకి దగ్గరగా ఉండే ప్రేమ కథా చిత్రాలు ఈ మధ్య కాలంలో చాలానే వస్తున్నాయి. నిజానికి ఇలాంటి సినిమాలే ఆదరణ పొందుతున్నాయి. అలాంటిదే `దీవాన`. హైదరాబాద్‌ సిటీలో జరిగే ప్రేమ కథ ఇది. సిటీలో ముగ్గురు కుర్రాళ్లు జాన్‌ జిగ్రీలు. దోస్తాన్‌ కోసం ప్రాణాలిస్తారు. కొట్టుకున్నా, తిట్టుకున్నా మళ్లీ కలిసిపోతారు. తమ మీదకు వేరే వాళ్లు వస్తే, కలిసిపోతారు. ప్రేమ విషయంలోనూ దోస్త్ కి అండగా ఉండి, వాడి లక్ష్యానికి తమ వంతు సపోర్ట్ చేసి అటు లక్ష్యాన్ని, ఇటు ప్రేమని గెలిపించేందుకు స్నేహితులు చేసిన పోరాటమే ఈ మూవీ అని చెప్పొచ్చు. సాధారణంగా ప్రేమ కథా చిత్రాల్లో కేవలం ప్రేమ చుట్టూనే సినిమా సాగుతుంది. కానీ ఇందులో లవ్‌ స్టోరీ ఉంది, స్నేహం ఉంది, ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్నాయి, ఫ్యామిలీ సెంటిమెంట్‌ ఉంది, జీవితానికి కావాల్సిన లక్ష్యం ఉంది. మంచి కామెడీ ఉంది, రొమాంటిక్‌ లవ్‌ ఉంది, స్నేహం విలువని తెలియజేశారు.  అల్లరి చిల్లర పనులున్నాయి, గొడవలున్నాయి, రియలైజేషన్‌ ఉంది, త్యాగాలున్నాయి. ఇలా అన్ని అంశాల మేళవింపుగా ఉంది. ఇలాంటి లవ్‌ స్టోరీ ఈ మధ్య కాలంలో రాలేదనే చెప్పొచ్చు. అయితే అన్ని అంశాలను బ్యాలెన్స్ చేసిన తీరు హైలైట్‌గా చెప్పొచ్చు. ముగ్గురు స్నేహితులు అల్లరి చిల్లర పనులు, వారి గొడవలతో ప్రారంభమై,  అమ్మాయి హీరో లైఫ్‌లోకి రావడంతో ఆమె వైపు, లవ్‌ స్టోరీ వైపు తిరుగుతుంది, మధ్యలో పోరి కోసం పోరగాళ్లను కొట్టుకోవడం ఉంటుంది. లవ్‌ ట్రాక్‌ కొంత డిఫరెంట్‌గా ఉంటుంది. ఆకట్టుకుంటుంది. ప్రేమకోసం ప్రియురాలు సవాల్‌ విసరడం, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని హీరో ఆ ప్రయత్నాల్లో ఉండటం ఈ క్రమంలో చోటు చేసుకునే డ్రామా, స్నేహితుల మధ్య చోటు చేసునే సన్నివేశాలు రియాలిటీకి దగ్గరగా, ఆద్యంతం కమెడీగా, ఎంగేజింగ్‌గా ఉంటాయి. ఇంటర్వెల్‌ ట్విస్ట్ షాక్‌కి గురి చేస్తుంది. 

47
దీవాన మూవీ హైలైట్స్
Image Credit : Asianet News

దీవాన మూవీ హైలైట్స్

సెకండాఫ్‌లో లక్ష్యం కోసం హీరో పోరాడటం, ప్రేమ కోసం తపించడం, ఈ క్రమంలో కొన్ని అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడం వంటి సీన్లు ఆసక్తిని పెంచుతాయి. ఒకే సమయంలో ఫన్‌, ఎమోషన్స్, పెయిన్‌ని ఆవిష్కరించిన తీరు అదిరిపోయింది. సినిమా ఎక్కడ డల్‌ లేదు, ఆ ఫీలింగ్‌ అనిపిస్తున్న చోట మంచి కామెడీగానీ, ఎమోషన్‌ సీన్లు పెట్టి ఆట్టుకునే ప్రయత్నం చేశారు. సెకండాఫ్‌లో కొంత డల్‌ ఫీలింగ్‌ కలుగుతుంది. కానీ ఆ తర్వాత ఎక్కడా ఈ ఫీలింగ్‌ లేకుండా నడిపించాడు. సినిమా ఆద్యంతం రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. మన లైఫ్‌ని, మన కళ్ల ముందు జరుగుతున్న లైఫ్‌ని చూస్తున్న ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమాలో ఎక్కడా వల్గారిటీ లేదు, ఇటీవల కాలంలో ఇంత నీట్‌గా ఉన్న లవ్‌ స్టోరీని చూడలేదనే చెప్పాలి. డైలాగ్‌ లు అదిరిపోయాయి. గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లేతో సినిమాని దర్శకుడు నడపించిన తీరు వాహ్‌ అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌ గా ఉంటుంది. ట్విస్ట్ రివీల్‌ అయిన తీరు కూడా ఎమోషనల్‌గా ఉంటుంది. ఒక చెట్టుకింద దాదాపు పది ఇరవై నిమిషాలపాటు ఎమెషనల్‌ సీన్లతో ఆడియెన్స్ ని అలా కూర్చోబెట్టడం మామూలు విషయం కాదు. దర్శకుడికి సినిమాపై, కథపై, పాత్రలపై ఉన్న కమాండ్‌నిది తెలియజేస్తుంది. ఇటీవల కాలంలో వచ్చిన ఒక బెస్ట్ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీ దీవాన అని చెప్పొచ్చు.

57
దీవాన మూవీలో ఆర్టిస్ట్ లు చించేశారు
Image Credit : Asianet News

దీవాన మూవీలో ఆర్టిస్ట్ లు చించేశారు

మున్నా పాత్రలో హర్షిత్‌ రెడ్డి ఇరగదీశాడు. నటనతో కట్టిపడేశాడు. కుర్రాడు కొత్తవాడైనా, మనకు ఈజీగా కనెక్ట్ అవుతాడు. మనల్ని ఈజీగా ఎంగేజ్‌ చేశాడు. అతనితో మనల్ని ట్రావెల్‌ అయ్యేలా చేశాడు. తన నటనతో సినిమా తీసుకెళ్లిపోయాడు. ఈ మూవీతో మనోడి రేంజ్‌ పెరిగిపోతుందని చెప్పొచ్చు. ఇక సినిమాలో ప్రతి పాత్రకి ప్రయారిటీ ఉండటం విశేషం. అది దర్శకుడి క్లారిటీకి, టాలెంట్‌కి నిదర్శనంగా చెప్పొచ్చు. హీరోయిన్‌ అమ్ముగా స్మేహ మణిమేగలై సింపుల్‌గా కూర్చొని నటించింది. కళ్లతోనే హవభావాలు పలికించింది. ఎమోషనల్‌ సీన్లలోనూ అదరగొట్టింది. ఇక ఆమె ఫ్రెండ్‌గా చేసిన అమ్మాయి కూడా నవ్వించింది, మెప్పించింది. హీరో తండ్రిగా నరేష్‌ నటన కట్టిపడేస్తుంది. సైలెంట్‌గా ఆయన పాత్రతో ఎమోషన్స్, సెంటిమెంట్‌ని పలికించిన తీరు సినిమాకి హైలైట్‌గా నిలిచింది. అమ్మగా ఝాన్సీ అదరగొట్టింది. తెలంగాణ యాస ఆమెకి సరిగా సెట్‌ కాలేదు. ఇక హీరో ఫ్రెండ్స్ గా చేసిన కుర్రాళ్లు ఇరగదీశారు. హీరో పాత్రకి ఏమాత్రం తక్కువ కాదని చెప్పొచ్చు. రఘు నవ్వించాడు, ఆలోచింప చేశాడు. జీవన్‌ నటన నవ్విస్తుంది. ఇలా సినిమాలో ప్రతి పాత్రకి ప్రయారిటీ ఉంటుంది. హైలైట్‌ అవుతుంది.

67
టెక్నీకల్‌గా సాలిడ్‌గా దీవాన మూవీ
Image Credit : Asianet News

టెక్నీకల్‌గా సాలిడ్‌గా దీవాన మూవీ

సినిమా టెక్నీకల్‌గా సాలిడ్‌గా ఉంది. ఈశ్వర్‌ చంద్‌ అందించిన సినిమాకి బ్యాక్‌ బోన్‌గా చెప్పొచ్చు. పాటలు అదిరిపోయాయి. అదే సమయంలో ఆర్‌ఆర్‌ సరికొత్తగా ఉంది. లవ్‌ సీన్లని, ఎమోషనల్‌ సీన్లని మరింత హైలైట్‌ చేసింది. ఆడియెన్స్ సినిమాకి కనెక్ట్ కావడంలో దాని పాత్ర మెయిన్‌గా చెప్పొచ్చు. ముఖ్యంగా క్లైమాక్స్ లో ఎమోషనల్‌ సీన్లలో, ఫ్యామిలీ విషయంలో సెంటిమెంట్‌లో ఆర్‌ఆర్‌ పనితనం తెలుస్తోంది. వంశీ పచ్చిపులుసు కెమెరా వర్క్ మరో హైలైట్‌. విజువల్స్ అదిరిపోయాయి. సినిమా మూడ్‌ని రిఫ్లెక్ట్ చేస్తాయి. ఎడిటర్‌ హృషికేశ్‌ పస్పాల్‌ ఎడిటింగ్‌ షార్ట్ప్ గా ఉంది. ఎక్కడా వంక పెట్టడానికి లేదు. దర్శకుడు శ్రీకాంత్‌ సంగిశెట్టి.. తన మొదటి సినిమాతోనే తానేంటో నిరూపించుకున్నాడు. తన కసి, పెయిన్‌ అంతా ఇందులో పెట్టాడు. అద్భుతమైన సినిమాని తెరకెక్కించాడు. అన్ని అంశాలను బ్యాలెన్స్ చేస్తూ మూవీని రూపొందించడం, దాన్ని ఆడియెన్స్ కి కనెక్ట్ అయ్యేలా, ఎలాంటి లూప్స్ లేకుండా సినిమాని తెరకెక్కించడం మామూలు విషయం కాదు. ఎంతో కమాండ్‌ ఉంటే తప్ప. ఆ విషయంలో దర్శకుడిని అభినందించాల్సిందే. ఇది పూర్తిగా దర్శకుడు విజయంగా చెప్పొచ్చు. ఆర్టిస్ట్ ల ద్వారా నటనని తీసుకున్న తీరు కూడా మరో హైలైట్‌గా చెప్పొచ్చు. మొత్తంగా ఇటీవల కాలంలో మంచి బెస్ట్ లవ్‌ స్టోరీని అందించాడు.

77
ఫైనల్‌గా..
Image Credit : Asianet News

ఫైనల్‌గా..

 ఆద్యంతం కట్టిపడేసే రియలిస్టిక్‌ లవ్‌ స్టోరీ. ప్రేమ, స్నేహం, ఫ్యామిలీ ఎమోషన్స్, జీవిత లక్ష్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఆద్యంతం కట్టిపడేసే సరికొత్త ప్రేమ కథ దీవాన. లవ్‌ స్టోరీస్‌లో ఇటీవల కాలంలో వచ్చిన బెస్ట్ మూవీ అవుతుంది. కమర్షియల్‌గా ఏ రేంజ్‌లో సత్తా చాటుతుందో చూడాలి. 

రేటింగ్‌: 3.25

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
సినిమా సమీక్షలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Transfer Trimurthulu Movie Review: ట్రాన్స్ ఫర్‌ త్రిమూర్తులు మూవీ రివ్యూ, వడ్డే నవీన్‌ రీ ఎంట్రీ మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Recommended image3
Vanda Devullu Review: వంద దేవుళ్ళు మూవీ రివ్యూ.. విజయ్‌ ఆంటోని చేసిన ప్రయోగం ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Maa Inti Bangaram Review: మా ఇంటి బంగారం మూవీ రివ్యూ.. సమంత కమ్‌ బ్యాక్‌ ఫిల్మ్ ఎలా ఉందంటే?
Recommended image2
Transfer Trimurthulu Movie Review: ట్రాన్స్ ఫర్‌ త్రిమూర్తులు మూవీ రివ్యూ, వడ్డే నవీన్‌ రీ ఎంట్రీ మూవీ ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved