- Home
- Entertainment
- Movie Reviews
- Crazy Kalyanam Movie Review: క్రేజీ కళ్యాణం మూవీ రివ్యూ, అనుపమా పరమేశ్వరన్ సినిమా ఎలా ఉందంటే?
Crazy Kalyanam Movie Review: క్రేజీ కళ్యాణం మూవీ రివ్యూ, అనుపమా పరమేశ్వరన్ సినిమా ఎలా ఉందంటే?
అనుపమా పరమేశ్వరన్ మెయిన్ లీడ్‌గా చేసిన మూవీ `క్రేజీ కళ్యాణం`. బద్రప్ప దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ఆడియెన్స్ ని ఆకట్టుకుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం.

క్రేజీ కళ్యాణం మూవీ రివ్యూ
అనుపమా పరమేశ్వరన్, వీకే నరేష్, తరుణ్ భాస్కర్, అఖిల్ రాజ్(ఉడ్డెమారి) ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ `క్రేజీ కళ్యాణం`. నూతన దర్శకుడు బద్రప్ప గాజుల రూపొందించారు. యారో సినిమాస్ పతాకంపై బూసం జగన్ మోహన్ రెడ్డి నిర్మించారు. టీజర్, ట్రైలర్ ఆకట్టుకున్నాయి. ఆడియెన్స్ ని ఎంగేజ్ చేసింది. ఫన్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఆకట్టుకుంటుందని టీమ్ తెలిపింది. ఈ చిత్రం నేడు శుక్రవారం (అక్టోబర్ 16)న విడుదల అయ్యింది. మరి మూవీ ఎలా ఉంది? దసరా పండక్కి ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంది? ఆడియెన్స్ ని ఆకట్టుకుంటుందా ? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
క్రేజీ కళ్యాణం మూవీ కథ
పర్వతాలు(వీకే నరేష్) ఊర్లో మంచి పేరున్న వ్యక్తి. ఆయన పెద్ద అల్లుడు బాలరాజు(తరుణ్ భాస్కర్) పెద్ద తాగుబోతు. మేనల్లుడు కావడంతో తన ఇంట్లోనే ఉంచుకుంటాడు. చిన్న కూతురు కీర్తి(అనుపమా పరమేశ్వరన్) ఎంఎస్సీ చదువుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంది. తన కాలేజీలోనే తనతోపాటు చదువుకునే ఉదయ్ (అఖిల్ ఉడ్డెమారి)ని ప్రేమిస్తుంది. పెద్దల్లుడు బాగా తాగి, అప్పులు చేసి ఊర్లో తన పరువంతా తీస్తుంటాడు. ఇది తట్టుకోలేక ఇక చిన్న కూతురుకి పెళ్లి చేయాలనుకుంటాడు పర్వతాలు. అనేక సంబంధాలు చూస్తారు. ఒక్కరు కూడా సెట్ కారు. చివరికి తన సొంత అన్న కూతురుకి ఒక ఎన్ఆర్ఐ సంబంధం వస్తుంది.
పెళ్లి సంబంధాలకు వచ్చిన వారిని తన ఇంటికి పిలిపించి మర్యాద చేస్తాడు పర్వతాలు. ఆ అబ్బాయి కీర్తిని చూసి ఇష్టపడతాడు. పర్వతాలు అన్న కూతురుని కాదని, తన కూతురు కీర్తిని పెళ్లి చేసుకునేందుకు ఓకే చెబుతాడు. సంబంధం కుదురుతుంది. కానీ ఈ పెళ్లి కీర్తికి ఇష్టం లేదు, తాను చదువుకోవాలనుకుంటుంది. అదే సమయంలో ఉదయ్‌కి తాను ప్రేమిస్తున్నట్టు చెబుతుంది. అదే విషయం తన తండ్రికి చెప్పి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయించాలనుకుంటుంది. మరి తన తండ్రికి ఈ విషయం చెప్పిందా? చెబితే ఆయన రియాక్షన్ ఏంటి. కీర్తి పెళ్లికి ఎలాంటి అడ్డంకులు వచ్చాయి? కీర్తి పెళ్లిలోని ట్విస్ట్ ఏంటి? ఆమె తండ్రి చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుందా? తాను ప్రేమించిన అబ్బాయితో లేచిపోయిందా? చివరికి ఏమైందనేది మిగిలిన కథ.
క్రేజీ కళ్యాణం మూవీ విశ్లేషణ
గ్రామాల్లో అమ్మాయికి పెళ్లి చేస్తే తమ బరువు తీరుతుందని, మంచి చదువుకున్న, జాబ్ చేసే అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని భావిస్తుంటారు. చాలా వరకు అలానే జరుగుతుంటాయి. అమ్మాయి ఇష్టాఇష్టాలతో సంబంధం లేకుండా ఇలాంటి పెళ్లిళ్లు చేస్తారు. అమ్మాయి కెరీర్‌ని పెళ్లితోనే సమాధి చేస్తుంటారు. అలాంటి రియలిస్టిక్ అంశాలతో ఈ మూవీని రూపొందించారు దర్శకుడు బద్రప్ప. అదే సమయంలో తెలంగాణ పల్లెల్లో ఉంటే కల్చర్‌ని, బంధాలు, అనుబంధాలు, అలకలు, గొడవలను బేస్ చేసుకుని తెరకెక్కించారు. రియాలిటీకి దగ్గరగా చూపించారు.
సినిమా ప్రారంభం నుంచి సరదాగా, ఫన్నీగా రన్ అవుతుంది. నరేష్ పాత్రని, బాలరాజు పాత్రని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. వారి మధ్య ఉండే గొడవలను ఫన్నీగా చూపించారు. డబ్బుల కోసం బాలరాజు చేసే ఎదవ పనులు, తాగుతూ ఇంటికి రావడం వంటి సీన్లు చాలా రియలిస్టిక్‌గా ఉన్నాయి. అదే సమయంలో ఫన్నీగానూ ఉన్నాయి. ఇంకోవైపు కీర్తి, ఉదయ్‌ల స్నేహం, ప్రేమ అంశాలను ఆవిష్కరించారు. మరోవైపు తన పరువు పోవడంతో పర్వతాలు బాధపడటం, తాగడం వల్ల బాలరాజు పరిస్థితిని ఆవిష్కరించారు. ఆయా సీన్లు ఆసక్తికరంగా, ఎంగేజింగ్‌గా రన్ అవుతాయి.
అయితే కీర్తికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు అన్న కూతురుకి వచ్చిన సంబంధాన్ని పర్వతాలు తన కూతురికి సెట్ చేసుకోవడం అదిరిపోయింది. ఆయా సీన్లు నవ్వించేలా ఉంటాయి. వాహ్ ఫ్యాక్టర్ని ఇస్తాయి. ఇక సెకండాఫ్ ఫ్యామిలీ డ్రామా చుట్టూ రన్ అవుతుంది. ఓ వైపు పెళ్లికి రెడీ అవుతుంటారు, మరోవైపు ఈ పెళ్లి తనకు ఇష్టం లేక అమ్మాయి చేసే పనులు క్రేజీగా ఉంటాయి. నవ్వించేలా ఉంటాయి. అదే సమయంలో డబ్బుల కోసం బాలరాజు చేసే పనులు నవ్విస్తాయి.
సెకండాఫ్ ఎమోషనల్ సైడ్ వెళ్తుంది. అమ్మాయి ప్రేమ విషయం చెప్పినప్పుడు కుటుంబంలో జరిగే పరిణామాలను చూపించారు. ఎమోషనల్ డ్రామా ప్రధానంగా సాగుతుంది. ఓ వైపు కీర్తి పెళ్లి క్యాన్సిల్ చేయాలనుకోవడం, ప్రేమికుడిని వదులుకోలేకపోవడం, మరోవైపు ఇంతకంటే మంచి సంబంధం రాదని తల్లి దండ్రులు పడే బాధ, ఎలాగైనా అమ్మాయిని దక్కించుకోవాలని ప్రియుడు పడే బాధ, ఈ పెళ్లి ఇష్టం లేని బామ్మ, ఈ అమ్మాయినే చేసుకోవాలని పెళ్లికోడుకు చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా, నాటకీయంగా సాగుతాయి. నవ్విస్తాయి, ఎమోషనల్‌కి గురి చేస్తాయి. ఎంగేజ్ చేస్తాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంది.
క్రేజీ కళ్యాణం మూవీలో ప్లస్, మైనస్‌లు
అయితే సినిమాలో ఫస్టాఫ్‌లో ఫన్ ఆశించిన స్థాయిలో వర్కౌట్ కాలేదు. డోస్ తగ్గింది. కొన్ని సీన్లు మాత్రమే వర్కౌట్ అయ్యాయి. చాలా వరకు తేలిపోయాయి. దీంతో డ్రైగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంటర్వెల్ ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్ ని కూడా ఎమోషనల్‌గా నడిపించారు. బాలరాజు పాత్రలోని మార్పుని, కీర్తిగా అనుపమా నటన అదిరిపోయింది. మామఅల్లుళ్ల గొడవలు నవ్విస్తాయి. బాలరాజు పాత్ర నవ్విస్తుంది. ఆకట్టుకుంటుంది. పర్వతాలు పాత్రలో సెకండాఫ్‌లో వచ్చే ఎమోషనల్స్ బాగున్నాయి. క్లైమాక్స్ అదిరిపోయింది. సంగీతం ఫర్వాలేదు. విజువల్స్ బాగున్నాయి. సినిమాలో మెయిన్‌గా కామెడీ వర్కౌట్ కాలేదు. నరేష్ పాత్ర హైలైట్ కావడంతోపాటు కొన్ని చోట్ల ఓవర్‌గా అనిపిస్తుంది. ఎమోషన్స్ పెద్దగా పండలేదు. డ్రామా కూడా కొన్ని చోట్లు తేలిపోయింది. ఇలాంటివి కొన్ని పక్కన పెడితే పండక్కి సరదాగా టైమ్ పాస్‌కి చూసే మూవీ ఇదే.
క్రేజీ కళ్యాణంలో నటీనటుల ప్రదర్శన
కీర్తిగా అనుపమా పరమేశ్వరన్ అదరగొట్టింది. కామెడీ, ఎమోషన్స్, సీరియస్ ఇలా అన్ని రకాల షేడ్స్ చూపించారు. ముఖ్యంగా పెళ్లి విషయంలో స్ట్రగుల్ అయ్యే అమ్మాయిగా కనిపించింది. ఇందులో కీర్తి తండ్రిగా పర్వతాలు పాత్రలో నరేష్ ఇరగదీశాడు. నవ్వించాడు, ఏడిపించాడు. ఎమోషనల్ సీన్లలో రెచ్చిపోయాడు. ముఖ్యంగా పెళ్లి సీన్లో దుమ్ములేపాడు. ఇక బాలరాజు పాత్రలో తరుణ్ భాస్కర్ సైతం మెప్పించాడు. ఇరగదీశాడు. మాస్ లుక్‌లో మెప్పించాడు. అఖిల్ రాజ్ ఓకే అనిపించాడు. మిగిలిన పాత్రలు ఆకట్టుకుంటాయి.
క్రేజీ కళ్యాణం మూవీ టెక్నీకల్‌గా ఎలా ఉందంటే?
సురేష్ బొబ్బిలి మ్యూజిక్ బాగుంది. పాటలతోపాటు ఆర్ఆర్ కడా అదిరిపోయింది. చాలా చోట్ల ఎలివేట్ అయ్యింది. శ్యామ్ దుపటి కెమెరా వర్క్ కనువిందు చేసేలా ఉంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. శ్రావణ్ కటికనేని ఎడిటింగ్ ఫర్వాలేదు. సినిమా కొంత స్లోగా రన్ అయిన నేపథ్యంలో ఎడిటింగ్ పరంగా ఇంకా వర్క్ చేయాలనిపిస్తుంది. దర్శకుడు బ్రదప్ప అదరగొట్టాడు. కథ, కథనం బాగున్నాయి. సినిమాని తెరపై ఆవిష్కరించిన తీరు బాగుంది. ఫన్ ఆశించిన స్థాయిలో లేదు. ఎమోషన్స్ కే ప్రయారిటీ ఇచ్చారు. వాటిపై మరింత ఫోకస్ చేయాల్సింది. ఓవరాల్‌గా అయితే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలుస్తుందని చెప్పొచ్చు.
ఫైనల్‌గా
ఫ్యామిలీ అంతా కలిసి చూసే కామెడీ ఎంటర్టైనర్. పండక్కి మంచి ఛాయిస్. ఎలాంటి అంచనాలు లేకుండా చూస్తే ఎంజాయ్ చేయగలిగే మూవీ అవుతుంది.
రేటింగ్: 2.75

