Arjun Suravaram Movie Review:నిఖిల్ 'అర్జున్ సురవరం' రివ్యూ
---సూర్య ప్రకాష్ జోశ్యుల
తమిళంలో హిట్టైన రీతిలో ఇక్కడ కూడా చెడుగుడు ఆడేయచ్చు అనే ఆశలు,ఆలోచనలు దర్శకులకు, నిర్మాతలుకు ఉంటాయి. కొనుక్కున్నవాళ్లకు ఫిప్టీ పిప్టీ ఉంటాయి. అయితే ఓపిగ్గా చూసే ప్రేక్షకుడుకి ఎప్పుడూ ఓపెన్ మైండే..బాగుంటే భలే ఉందే అని భుజాన ఎత్తుకుంటాడు. మరి అర్జున్ సురవరం బాగుందనిపించుకుంటాడా...నిఖిల్ కెరీర్ కు బూస్టప్ ఇస్తుందా...అసలు కథేంటి, ఇన్ని కష్టాలు పడి రిలీజ్ చేసిన సినిమాలో ఆ స్దాయి మ్యాటర్ ఉందా...వంటి విషయాలు చూద్దాం.
టైటిల్ మార్చుకుంటూ, రిలీజ్ డేట్స్ మార్చుకుంటూ , ఫైనాన్సియల్ గా అనేక పురిటి కష్టాలు పడి ఎట్టకేలకు అర్జున్ సురవరం థియోటర్స్ లో డెలవరీ అయ్యాడు. సినిమా వాయిదాలు పడుతూ ఆగిపోతే...ఆ హీరో మీద సానుభూతి పుడుతుందేమో కానీ, సినిమాపై నమ్మకం అయితే కరిగిపోతుంది. కానీ చిన్న లాజిక్ ఆలోచిస్తే... వాయిదా పడినంత మాత్రాన సినిమాలో విషయం మాయమైపోదు కదా. అయినా ఈ ఏడాదిలో సామాజికంగా మార్పులు కూడా పెద్దగా రాలేదు ..కాబట్టి ఇప్పటికి ఆ కథ సర్వజనీనమే.
తమిళంలో హిట్టైన రీతిలో ఇక్కడ కూడా చెడుగుడు ఆడేయచ్చు అనే ఆశలు,ఆలోచనలు దర్శకులకు, నిర్మాతలుకు ఉంటాయి. కొనుక్కున్నవాళ్లకు ఫిప్టీ పిప్టీ ఉంటాయి. అయితే ఓపిగ్గా చూసే ప్రేక్షకుడుకి ఎప్పుడూ ఓపెన్ మైండే..బాగుంటే భలే ఉందే అని భుజాన ఎత్తుకుంటాడు. మరి అర్జున్ సురవరం బాగుందనిపించుకుంటాడా...నిఖిల్ కెరీర్ కు బూస్టప్ ఇస్తుందా...అసలు కథేంటి, ఇన్ని కష్టాలు పడి రిలీజ్ చేసిన సినిమాలో ఆ స్దాయి మ్యాటర్ ఉందా...వంటి విషయాలు చూద్దాం.
కథేంటి టీవీ 99 డైనమిక్ రిపోర్టర్ అర్జున్ లెనిన్ సురవరం(నిఖిల్) కు ఇన్విస్టిగేషన్ జర్నలిజం అంటే ప్రాణం. స్టింగ్ ఆపరేషన్స్ తో సూటిగా సొసైటిలోని అన్యాయాలను ప్రశ్నస్తూ పేరు తెచ్చుకుంటాడు. అతని జీవితాశయం బిబీసీ లో జర్నలిస్ట్ జాబ్ సంపాదించి..తన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాలని. మొత్తానికి కష్టపడి తను ఇష్టపడ్డ జాబ్ కు సెలెక్ట్ అవుతాడు. అయితే అదే సమయంలో అతని జీవితంలో ఓ ట్విస్ట్ పడుతుంది. అర్జున్ ఊహించని విధంగా ఓ బ్యాంక్ లోన్ స్కామ్ లో నిందితుడుగా ఏడేళ్ల జైలు శిక్ష పడుతుంది.
తను ఫేక్ సర్టిఫికేట్స్ సబ్ మిట్ చేసానని, తనలాగే మరికొంత మంది ఇలాగే ఇరుక్కుపోయారని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. నిజాయితీగా తన పనేంటో తను చేసుకుపోతున్న తనపై ఈ కేసు చుట్టుకోవటమేమిటో అర్దం కాదు. దాంతో ఈ కేసు అంతు తేల్చాలనుకుంటటాడు. బెయిల్ మీద బయిటకు వచ్చి ఇన్విస్టిగేషన్ ప్రారంభిస్తాడు. ఫేక్ సర్టిఫికేట్స్ స్కామ్ మూలాలు పట్టుకుంటాడు. ఆ విషయాన్ని అన్ని మేజర్ ఛానెల్స్ లో టెలీకాస్ట్ చేస్తాడు.
అప్పుడు ఆ క్రైమ్ సిండికేట్ హెడ్ తరుణ్ ఆరోరా (ఖైధీ నెంబర్ 150 విలన్) సీన్ లోకి ఎంటరవుతాడు. ఈ లోగా తరుణ్ ఫ్యామిలీ మెంబర్ ఒకడు మరణిస్తాడు. అందుకు అర్జున్ వెలికి తీసిన స్కామ్ కారణం అని తెలుస్తుంది. తన కుటుంబ సభ్యుడు మరణాన్ని జీర్ణించుకోలేని తరుణ్ ..నిఖిల్ అంతు చూడాలని నిర్ణయించుకుంటాడు. మరో ప్రక్క ఫేక్ ఇంజినీరింగ్ సర్టిఫికేట్ కలిగిన ఇంజినీరు కట్టిన స్కూల్ బిల్డింగ్ కూలిపోయి..48 పిల్లలు చనిపోతారు. అర్జున్ మరోసారి ఇన్విస్టిగేషన్ చేస్తాడు.
అప్పుడు ఫేక్ సర్టిఫికేట్స్ స్కామ్ కు సంభందించిన మరిన్ని విషయాలు బయిటపడతాయి. వాటిని అర్జున్ బయిటపెట్టగలుగుతాడా..విలన్ తరుణ్ ఊరుకుంటాడా..చివరకు ఏమైంది...నిఖిల్ ..ఎలా తరుణ్ ట్రాప్ నుంచి తప్పించుకున్నాడు. పబ్ లో పరిచయమైన మరో జర్నలిస్ట్ లావణ్య అసలు ఎవరు...ఆమె తో అర్జున్ లవ్ స్టోరీ ఏ టర్న్ తీసుకుంటుంది... వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే... తమిళ చిత్రం కనితన్ రీమేక్ గా వచ్చిన ఈ సినిమాని...మక్కి టు మక్కి అనే పద్దతినే ఫాలో అయ్యిపోయి తీసారు. తమిళంలో డైరక్ట్ చేసిన దర్శకుడే ఇక్కడ కూడా చేయటంతో అప్పుడు తను చేసిన వెర్షనే బెస్ట్ అనుకుని, ఇక్కడ నేటివిటికు తగ్గ మార్పులు చేయటం అనవసం అనుకుని ఎగస్ట్రా కష్టం పడకుండా లాగేసాడు. దాంతో పూర్తి తెలుగు సినిమా చూస్తున్నామనైతే అనిపించదు. అయితే స్టోరీ లైన్ లో ఇంటెన్సిటీ ఉండటంతో స్క్రీన్ ప్లే రొటీన్ గా రాసుకున్నా ఛల్తా హై అన్నట్లు సాగిపోయింది. ఎక్కడా అధ్బుతం అనిపించదు కానీ ఇలాంటి పాయింట్ తో ఇంతకు ముందు సినిమాలు రాకపోవటంతో ఉన్నంతలో కొత్తగా అనిపిస్తుంది.
ఇక ఫస్టాఫ్ లో పెద్దగా ఏమీ జరగినట్లు ఉండదు. ఇంటర్వెల్ బ్యాంగ్ ని టార్గెట్ గా పెట్టుకుని సీన్స్ లాక్కెళ్ళుతున్నట్లు అనిపిస్తుంది. అలాగే అవసరం లేని సీక్వెన్స్ లు, పాటలు కాస్త ట్రిమ్ చేస్తే బాగుండేదేమో. సెకండాఫ్ లోనే కథంతా పెట్టుకున్నారు. పూర్తిగా క్రైమ్ ఇన్విస్టిగేషన్ డ్రామా గా సీరియస్ గా నడుస్తుంది. ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్ బెస్ట్..కాంప్లిక్ట్ ని ఎస్టాబ్లిష్ చేసాక, కాస్తంత ట్విస్ట్ లు, టర్న్ లు కనపడటం మొదలవుతాయి.
అలాగని ఎక్కువ ఊహించుకోకండి...మనకు పెద్దగా ఇబ్బంది పెట్టకుండా ప్రెడిక్టుబుల్ గానే చాలా భాగం సాగుతాయి. దానికి తోడు సినమా మొత్తం ఒకే మోడ్ లో సింగిల్ ట్రాక్ లో నడవటమే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. మధ్యలో కాస్తంత రిలీఫ్ కు రొమాన్స్ ,ఫన్ వంటివి పెట్టుకుంటే బాగుండేది. ఇక క్లైమాక్స్ కు వచ్చేసరికి అప్పటిదాకా ఉన్న నోవల్టి మిస్సై, రొటీన్ గా మారిపోతుంది. హీరో జైలు నుంచి తప్పించుకుని ఇన్విట్విగేషన్ మొదలెట్టడంతో ... ఇండియన్ సినిమా ఇలాగే ముగించాలనే నియయం పెట్టుకుని చేసినట్లుంది. ఏదైమైనా సెకండాఫ్ ట్రీట్మెంట్ ఇంకాస్త ఇన్నోవేటివ్ గా ఉంటే ..ఎత్తుకున్న పాయింట్ కు, తీసుకున్న జానర్ కు న్యాయం చేసినట్లు ఉండేది.
కష్టపడి చేసినా ఈ సినిమాలో నిఖిల్ ...ఇంతబాగా నటించగలడా అనిపించే కొన్ని సన్నివేశాలు ఎదురౌతాయి. ఫైట్స్ లోనే కాకుండా ఎమోషనల్ సీన్స్ లోనూ బాగా చేసాడు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల సినిమా టెంపోని రైజ్ చేయటానికి ప్లస్ అయ్యింది, కొన్ని సీన్స్ తప్ప మిగతాదంతా సోసోగా అనిపిస్తాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ డీసెంట్ గా ఉన్నాయి. ఎడిటింగ్, కెమెరా వర్క్ అద్బుతం కాదు కానీ ఓకే. గ్రాఫిక్స్ వర్క్ చీప్ గా ఉంది.
ఫైనల్ థాట్ : పాయింట్ కొత్తగా ఉన్నంత మాత్రాన సినిమా కొత్తగా ఉంటుందనుకోవటం భ్రమ.
Rating: 2.25/5