MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • ANR: రొమాన్స్ చేసిన జమునకి ఏఎన్నార్ అన్నగా నటించిన ఏకైక సినిమా? దొంగరాముడు మూవీ రివ్యూ

ANR: రొమాన్స్ చేసిన జమునకి ఏఎన్నార్ అన్నగా నటించిన ఏకైక సినిమా? దొంగరాముడు మూవీ రివ్యూ

ఏఎన్నార్, జమున కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైనసినిమాలు వచ్చాయి. జంటగా చాలా సినిమాల్లో ఆన్ స్క్రీన్ రొమాన్స్ ను పండించిన ఇద్దరు.. అన్నా చెల్లెలుగా నటించిన ఏకైక సినిమా ఏదో తెలుసా?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jun 28 2026, 10:22 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సమాజానికి మంచి చెప్పిన సినిమా..
Image Credit : Annapurna Pictures

సమాజానికి మంచి చెప్పిన సినిమా..

తెలుగు సినీ చరిత్రలో కొన్ని సినిమాలు కాలానికి అతీతంగా నిలిచిపోతాయి. అలాంటి చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన సినిమా దొంగరాముడు. అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, సావిత్రి హీరోయిన్ గా నటించిన ఈసినిమాలో జమున ఏఎన్నార్ చెల్లెలుగా నటించింది. 1955లో రిలీజ్ అయిన ఈ సినిమాకు కె.వి. రెడ్డి దర్శకుడు. కుటుంబ బంధాలు, సామాజిక బాధ్యత, మానవత్వం, వంటి జనాలకు ఉపయోగపడే అంశాలను కలగలిపి అద్భుతంగా తీర్చిదిద్దిన సినిమా దొంగరాముడు. ఈ చిత్రం నేటికీ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
దొంగరాముడు సినిమా కథ విషయానికి వస్తే..
Image Credit : Annapurna Pictures

దొంగరాముడు సినిమా కథ విషయానికి వస్తే..

చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన రాము (అక్కినేని నాగేశ్వరరావు) తన చెల్లెలు లక్ష్మి(జమున)ని ఎంతో ప్రేమగా పెంచాలని భావిస్తాడు. అయితే పేదరికం, ఆకలి, అనాథ జీవితం అతడిని చిన్నచిన్న దొంగతనాల వైపు నెడతాయి. తల్లి అనారోగ్యం వల్ల మందులు దొంగతనం చేస్తూ.. దొరికిపోయి కేసులో చిక్కుకుని జైలుకు వెళ్లాల్సి వస్తుంది. బాల నేరస్తుల జైల్లో అతన్ని వేస్తారు. రాము జైలులో ఉండగా తల్లి మరణించడంతో.. చెల్లెలు లక్ష్మి అనాథాశ్రమంలో చేరుతుంది. 

శిక్ష పూర్తయిన తర్వాత బయటకు వచ్చిన రాము కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకుంటాడు. నిజాయితీగా జీవించాలనుకున్నా, గతం అతడిని వెంటాడుతూనే ఉంటుంది. సమాజం అతడిని అనుమానంతో చూస్తుంది. మరోవైపు తన చెల్లెలు కోసం చేసే ప్రయత్నాల్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటాడు.

ఈ క్రమంలో సీత (సావిత్రి) రాము జీవితంలోకి వస్తుంది. ఆమె ప్రేమ, నమ్మకం రాముకు కొత్త ధైర్యాన్ని ఇస్తాయి. చెల్లెల్ని కలుసుకోవాలన్న రాము ప్రయత్నాల వల్ల లక్ష్మీ ఇబ్బందులు పడుతుంటుంది. ఆ సమయంలోనే ఆమెకు డాక్టరు మోహన్ అండగా ఉంటాడు. ఈ క్రమంలో రాముపై హత్యానేరం మోపబడుతుంది. ఈవిషయంలో సీత రాముకి అండగా ఉంటుంది. చివరికి రాము తన చెల్లెల్ని కలుసుకుంటాడా? తనపై ఉన్న నేరస్థుడి ముద్రను చెరిపేసుకుని సమాజంలో గౌరవంగా నిలబడతాడా? అనేదే మిగిలిన కథ.

36
దొంగరాముడు సినిమా విశ్లేషణ..
Image Credit : Annapurna Pictures

దొంగరాముడు సినిమా విశ్లేషణ..

'దొంగరాముడు' సినిమా సాధారణ దొంగ కథ కాదు. పరిస్థితుల కారణంగా నేరం చేసిన వ్యక్తి జీవితంలో మార్పు రావాలంటే సమాజం కూడా అవకాశం ఇవ్వాలనే సందేశాన్ని దర్శకుడు కె.వి. రెడ్డి ఎంతో అద్భుతంగా చెప్పాడు. కథలో ఎమోషన్స్ కు పెద్దపీట వేస్తూనే.. మంచి ఎంటర్టైన్మెంట్ ను కూడా అందించాడు. కుటుంబ అనుబంధాలు, ప్రేమ, సామాజిక విలువలను కలగలిపి.. మంచి విలువలు ఉన్న సినిమాను సమాజానికి అందించాడు కేవి రెడ్డి.

సినిమా ప్రారంభం నుంచే ప్రేక్షకుడిని కథలోకి తీసుకెళ్లే కథనం ప్రధాన బలం. మొదటి భాగంలో రాము బాల్యం, అతని పరిస్థితులు ఆడియన్స్ ను ఏడిపిస్తాయి. రెండో భాగంలో కుటుంబ అనుబంధాలు, ప్రేమ, త్యాగం, ఆత్మగౌరవం వంటి అంశాలు కథను మరింత బలంగా నిలబెడతాయి. . క్లైమాక్స్ మాత్రం ప్రతీ సగటు ప్రేక్షకుడికి ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది.

46
నటీనటులలో ఎవరు ఎలా చేశారు?
Image Credit : Annapurna Pictures

నటీనటులలో ఎవరు ఎలా చేశారు?

అక్కినేని నాగేశ్వరరావు రాము పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. అమాయకత్వం, ఆవేశం, చెల్లెలిపై ప్రేమ, భావాలను సహజంగా ఆవిష్కరించారు. ఈ పాత్ర ఆయన కెరీర్‌లో గుర్తుండిపోయే పాత్రల్లో ఒకటిగా నిలిచింది. ఇక మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారు. ఎమోషనల్ సీన్స్ లో ఆమె నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. జమున కూడా అక్కినేని చెల్లెలి పాత్రలో అద్భుతంగా నటించింది. ఇక జగ్గయ్య, రేలంగి, సూర్యకాంతం తదితరులు తమ పాత్రల పరిధిలో చక్కటి నటన ప్రదర్శించారు. ముఖ్యంగా రేలంగి హాస్యం ఎమోషనల్ సీన్స్ మధ్యలో.. ఆడియన్స్ ను కాస్త నవ్విస్తూ.. ఉపశమనం కలిగిస్తుంది.

56
టెక్నికల్ గా చూసుకుంటే?
Image Credit : Annapurna Pictures

టెక్నికల్ గా చూసుకుంటే?

దొంగరాముడు సినిమాకు కె.వి. రెడ్డి దర్శకత్వం ప్రధాన బలం. ప్రతి సన్నివేశాన్ని సహజత్వంతో, బలమైన కథనంతో తెరకెక్కించారు. సామాజిక సందేశాన్ని టీచర్ మాదిరి రుద్దకుండా.. ఆడియన్స్ కు బోర్ అనిపించకుండా కథలోనే కలిపి వడ్డించాడు రెడ్డి. పెండ్యాల నాగేశ్వరరావు అందించిన సంగీతం చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ. పాటలు, నేపథ్య సంగీతం కథకు బలం చేకూర్చాయి. ఛాయాగ్రహణం, ఎడిటింగ్ కూడా ఆ కాలానికి తగినట్టుగా అద్భుతంగా అందించారు.

66
దొంగరాముడు సినిమా విశేషాలు...
Image Credit : Annapurna Pictures

దొంగరాముడు సినిమా విశేషాలు...

అమెరికన్ కథ "Loving Brothers" ఆధారంగా దొంగరాముడు సినిమాను తెరకెక్కించారు. అందులో అన్న పాత్రను చెల్లలు పాత్రగా మలిచారు. ఇక అన్నపూర్ణ పిక్చర్స్ నిర్మించిన ఫస్ట్ సినిమా దొంగరాముడు. నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, అక్కినేని నాగేశ్వరరావు భాగస్వామ్యంతో ఈ సంస్థ ప్రారంభమైంది. తొలి చిత్రమే ఘనవిజయం సాధించి, అన్నపూర్ణ పిక్చర్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థగా నిలబెట్టింది. అంతే కాదు దర్శకుడు కె.వి. రెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ కూడా ఇదే.

ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు, జమున అన్నాచెల్లెలుగా నటించారు. ఆతరువాత రోజుల్లో ఇద్దరు జంటగా ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. చెల్లెలుగా నటించిన జమునతోనే గుండమ్మ కథ లాంటిసినిమాల్లో ఘాటు రొమాన్స్ చేశారు అక్కినేని. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ కోసం హీరో అక్కినేని నాగేశ్వరరావు.. విలన్ గా నటించిన ఆర్. నాగేశ్వరరావు ప్రత్యేకంగా స్టంట్ మాస్టర్ వద్ద శిక్షణ తీసుకున్నారు. ఆ కాలంలో ఇలా ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవడం చాలాప్రత్యేకం.

దొంగరాముడు సినిమా హిట్ అవ్వడంతో పలు భాషల్లో ఈమూవీని డబ్ చేశారు. తమిళంలో "తిరుట్టు రామన్" పేరుతో డబ్ చేశారు. తర్వాత హిందీలో మన్ మౌజీ, తమిళంలో వసంతి పేర్లతో రీమేక్ చేశారు.ఈ చిత్రం అత్యుత్తమ చిత్ర నిర్మాణానికి ఉదాహరణగా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యయనంలో (ఆర్కైవ్‌లో) చోటు సంపాదించింది. ఇది తెలుగు సినిమాకు లభించిన అరుదైన గౌరవాల్లో ఒకటి. ఈ సినిమా చూడాలి అనుకునేవారికి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hitler Movie Review: మోహన్ బాబు వల్ల డిజాస్టర్స్ నుంచి బయటపడ్డ చిరంజీవి, డైరెక్టర్ ను భయపెట్టిన మెగా ఫ్యాన్స్.. హిట్లర్ మూవీ రివ్యూ
Recommended image2
Pithapuramlo Ala Modalaindi Review: పిఠాపురంలో అలా మొదలైంది మూవీ రివ్యూ.. కూతురిని ఎలా పెంచాలంటే?
Recommended image3
Secret Soldier Movie Review: సీక్రెట్‌ సోల్జర్‌ మూవీ రివ్యూ.. స్నేహం, స్పై యాక్షన్‌ మేళవించిన మూవీ ఎలా ఉందంటే?
Related Stories
Recommended image1
Bhagyaraj: ఒకే కథ, ఇద్దరు దిగ్గజాలు, రెండు బ్లాక్‌బస్టర్లు.. భాగ్యరాజ్, భారతీరాజా చేసిన అద్భుతం
Recommended image2
Chiranjeevi: లేడీ గెటప్ లో చిరంజీవి, మీసం లేకుండా చూసి సురేఖ ఏమని వార్నింగ్ ఇచ్చిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved