అల్లరి నరేష్ ‘ఉగ్రం’ రివ్యూ
నరేష్ కి ఇది షష్టిపూర్తి (60వ) చిత్రం. కామెడీ ఇమేజ్ ఉన్న నరేష్ కు.. ఇలాంటి కథలతో మరింత గుర్తింపు వస్తోంది. ‘నాంది’లో అండర్ ట్రయిల్ ఖైదీలు గురించి చెప్పారు ‘ఉగ్రం’లో మిస్సింగ్ కేసులు గురించి చూపించారు.
Ugram Movie Review
కామెడీ నుంచి యాక్షన్ లోకి దూకి తన ఉగ్ర స్వరూపాన్ని ప్రదర్శించే పనిలో పడ్డాడు అల్లరి నరేష్. నాందితో తనూ అన్ని రకాల చిత్రాలు చేయగలననే ధైర్యం నరేష్ కు వచ్చింది. ఈ సినిమాలో పోలీస్ గా అల్లరి నరేష్ తనను తాను బాగా మార్చుకున్నాడు. తన పాత్ర వరకూ ది బెస్ట్ గా పోషించాడు నరేష్. ఆ కష్టం తెరపై కనపడింది. అయితే ఈ కథ నరేష్ కెరీర్ కు బూస్ట్ ఇస్తుంది. నాంది స్దాయి హిట్ అవుతుందా... అసలు కథేంటి వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.
స్టోరీ లైన్:
శివ(అల్లరి నరేష్) నిజాయితీతో పాటు దూకుడు ఉన్న పోలీస్. దాంతో అతని దూకుడు ,ఏటిట్యూడ్ సమస్యలను, శత్రువులను తెచ్చిపెడుతుంది. ఒకరోజు భార్య అపర్ణ (మిర్నా మీనన్), కూతురుతో కలిసి కారులో వెళ్తూ ఉండగా యాక్సిడెంట్ అవుతుంది. భార్య, కూతురు ఇద్దరినీ హాస్పిటల్‌లో జాయిన్ చేస్తాడు. తర్వాత రోజు శివ హాస్పిటల్‌కు ఎవరినీ తీసుకురాలేదని, అక్కడున్న డాక్టర్లు చెప్తారు. ఈ క్రమంలో తన భార్య,కూతురు మిస్సయ్యారని అర్దమవుతుంది. అక్కడ నుంచి డాక్టర్స్, పోలీస్ డిపార్టమెంట్ వారిస్తున్నా ఆ మిస్సింగ్ కేసుని డీల్ చేయటం మొదలెడతాడు. ఆ క్రమంలో కొన్ని భయంకరమైన నిజాలు బయిటపడతాయి. అవేమిటి... భార్య,కూతురు ఏమయ్యారు. వాళ్లు చివరకు దొరికారా , సిటీలో వరుసగా వెలుగు చూస్తున్న మిస్సింగ్ కేసులకు వీరికి సంబంధం ఏంటి?వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇవన్నీ తెలియాలంటే ఉగ్రం చూడాల్సిందే.
ఎనాలసిస్ ..
ఒక సూపర్ హిట్ కాంబినేషన్ తర్వాత అదే దర్శకుడు, హీరో కలిసి సినిమా చేస్తున్నారంటే ఖచ్చితంగా సినిమాపై ఎక్సపెక్టేషన్స్ ఏర్పడతాయి. వాటిని పెంచుతూ టీజర్,ట్రైలర్ రిలీజైతే మంచి బజ్ క్రియేట్ అవుతుంది. ఈ సినిమాకు అదే జరిగింది. అయితే ఆ క్రేజ్ ని ఈ సినిమా అందుకోలేదనే చెప్పాలి. నాంది’లో అండర్ ట్రయిల్ ఖైదీలు గురించి దృష్టి పెడితే సెకండ్ సినిమా ‘ఉగ్రం’లో మిస్సింగ్ కేసులు గురించి చెప్పే ప్రయత్నం చేసారు. కొంత రీసెర్చ్ కనపడింది. కానీ రీసెర్చ్ చూడటానికి జనం రారు కదా. అలాగే ఈ కథలో ఇంటెన్స్ ఎక్కువ ఉండాలి. కానీ అదే మిస్సైంది. ఎక్కడా ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది కనపడదు. ఫస్టాఫ్ ఒక కథ, సెకండాఫ్ వేరే కథలోకి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. రెండింటికి లింక్ ,మెయిన్ కథతో మొత్తం కథకు లింక్ కనపడదు. దానికి తోడు థ్రిల్లర్ కావటంతో చివరి ఇరవై నిముషాల్లో విలన్ కనపడటం, అక్కడ నుంచే అసలు కథ ఇదీ రివీల్ అవటం జరుగుంది. ఈ థ్రిల్లర్ రీసెంట్ గా సమంత చేసిన యశోదను గుర్తు చేస్తుంది.
అయితే యశోదలో ఇంటర్వెల్ కు వచ్చేసరికే కథలోకి పూర్తిగా వచ్చేసి, విలన్స్ ఎవరో రివీల్ అవటం, వాళ్ల గుట్టు ఎలా రట్టు అవుతుందనే విషయం చుట్టూ స్క్రీన్ ప్లే తిరుగుతుంది. కానీ ఇక్కడ చివరి ఇరవై నిముషాల దాకా కథ ని దాచి పెట్టటమే ఇబ్బందిగా మారింది. ఎక్కడక్కడ పాయింటాఫ్ ఇంట్రస్ట్ చూసుకున్నారే కానీ ఓవరాల్ కథని చూసుకోలేదనిపిస్తుంది. అలాగే ఈ సినిమా చూస్తూంటే మనకు మళయాళంలో వచ్చిన జోసెఫ్ సినిమాని గుర్తు వస్తుంది. ఆ సినిమాలో లాంటి డెసిషనే హీరో కీలక సమయంలో తీసుకుంటాడు. ఇలా కొన్ని పాపులర్ చిత్రాల పోలికలు ఉన్నా హిజ్రాల ఫైట్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ వంటివి బాగా డిజైన్ చేసారు. థియేటర్ లో మంచి అప్లాజ్ వచ్చింది. నరేష్ కూడా తన ఉగ్ర రూపాన్ని చూపించటానికే ట్రై చేసాడు. అయితే ఇలా ఒక సినిమాలోనే పీక్స్ కు వెళ్లి ఉగ్ర రూపం చూపెట్టేస్తే తర్వాత సినిమాల్లో ఏం చేయగలగుతాడనిపిస్తుంది. దర్శకుడు కూడా తన మొదటి సినిమాని మించి యాక్షన్ చూపాలనుకుని హింస డోస్ పెంచాడు. అలాగే సినిమా ఎక్కడా రిలీఫ్ ఇవ్వలేదు. దానికి తోడు సెంటిమెంట్ మరీ ఎక్కువ అయ్యిందనిపిస్తుంది.
Ugram Movie Review
టెక్నికల్ గా...
హిజ్రాలును హైలెట్ చేయటం, పోలీస్ లను కొంచెం కొత్తగా చూపించాలని ట్రై చేయటం దర్శకుడు విజయ్ కనకమేడల ఈ సినిమాలో చేసారు. అవి పండాయి కూడా. అయితే తనను తానే అనుకరించుకున్నట్లు అదే నరేష్ తో నాందిలాంటి ప్లేవర్ సినిమా తియ్యాలనుకోవటం కొంచెం ఇబ్బంది. అలాగే స్టోరీ లైన్ కు సరపడ స్క్రీన్ ప్లే సెట్ చేసుకోలేకపోయారు. ప్రేక్షకుడుకి నరేష్ పై ఎక్కడా సానుభూతి రాదు. ఎమోషన్ కనెక్ట్ కాలేదు. అవి ప్రక్కన పెడితే డైరక్టర్ గా మంచి ఫెరఫార్మెన్స్ లు, టెక్నికల్ గా మంచి వాల్యూస్ పాటించాడు. ఇక సినిమాటోగ్రఫీ బాగుంది. లైటింగ్ అయితే..వెలుగు,నీడలతో ఆడుకున్నారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా మరో ప్లస్ పాయింట్. ప్రొడక్షన్ డిజైన్ ఓకే. ఎడిటింగ్ చాలా చోట్ల షార్ప్ చేస్తే బాగుండేది అనిపించింది. అన్నిటికన్నా ముఖ్యంగా యాక్షన్ కొరియోగ్రాఫర్స్ బాగా చేసారు. యాక్షన్ సీక్వెన్స్‌లు ఎపిసోడ్స్ గూస్ బంప్స్ తెప్పించాయి.
నటీనటుల్లో ...
అల్లరి నరేష్ మెల్లిగా అల్లరి ముద్ర నుంచి పూర్తిగా బయిటపడేందుకు దోహదం చేసే పాత్ర ఎస్ఐ శివ కుమార్ నరేషే వన్ మ్యాన్ షో . అయితే ఫస్ట్ హాఫ్ అంతా వాయిస్/మోడ్యులేషన్ పరంగా ఇన్ కన్సిస్టెంట్ గా కనిపించింది.మిర్నా మీనన్ అపర్ణ పాత్రలో గ్లామర్ గా కాకుండా మంచి నటిగా కనపడింది. బేబి ఊహ క్యూట్‌గా నటించింది.ఇంద్రజ వంటి సీనియర్స్ తమ పాత్రల పరిధి మేరకు మంచి ప్రదర్శన కనబరిచారు.
బాగున్నవి
నరేష్ ఫెరఫార్మెన్స్
కొన్ని యాక్షన్ బ్లాక్ లు
బాగోలేనివి
ఏడుస్తున్నా మనంకు ఎమోషన్ గా కనెక్ట్ కాకపోవటం
రిలీఫ్ లేకుండా పోవటం
సబ్ ప్లాట్స్ లేని సింగిల్ థ్రెడ్ ఎజెండా కల స్టోరీ లైన్
Ugram Movie Review
ఫైనల్ థాట్
మనం చూడబోయే చిత్రం ఏ జానర్ అనేది స్పష్టంగా చెప్తే అలాంటి సిమాలు ఇష్టపడే వాళ్లే వస్తారు. మిగతావాళ్లు అందుకు ప్రిపేర్ అయ్యి చూస్తారు. యాక్షన్ చిత్రం అని చూడటం మొదలెడితే అది థ్రిల్లర్ అని తేలితే థ్రిల్ అవటం ప్రక్కన పెడితే ...ఫూల్ అయ్యామేమో అనిపిస్తుంది.
-----సూర్య ప్రకాష్ జోశ్యుల
రేటింగ్ : 2.5/5
Ugram Movie Review
నటీనటులు : అల్లరి నరేష్, మిర్నా మీనన్, ఇంద్రజ, శత్రు తదితరులు
కథ : తూము వెంకట్
మాటలు : అబ్బూరి రవి
ఛాయాగ్రహణం : జె. సిద్ధార్థ్
సంగీతం : శ్రీచరణ్ పాకాల
Run Time : 2 గం 28 నిమిషాలు
నిర్మాతలు : సాహూ గార్లపాటి, సురేష్ పెద్ది
స్క్రీన్ ప్లే, దర్శకత్వం : విజయ్ కనకమేడల
విడుదల తేదీ: మే 5, 2023