MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Movie Reviews
  • Chor Bazaar: 'చోర్ బజార్' సినిమా రివ్యూ

Chor Bazaar: 'చోర్ బజార్' సినిమా రివ్యూ

పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం చోర్ బజార్. జార్జి రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఈ రోజు రిలీజైంది.

3 Min read
Surya Prakash
Published : Jun 24 2022, 02:10 PM IST| Updated : Jun 24 2022, 02:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110


పూరి జగన్నాథ్ కుమారుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన ఆకాష్ తనకంటూ సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకోసం డిఫరెంట్ కథలు ట్రై చేస్తున్నారు. అదే సమయంలో జార్జి రెడ్డి చిత్రంతో తను మాస్ సీన్స్ డీల్ చేయగలను అనిపించుకున్న దర్శకుడు జీవన్ రెడ్డి సైతం కమర్షియల్ హిట్ కోసం ఈ సినిమాతో మన ముందుకు వచ్చారు. ఈ ఇద్దరి ప్రయత్నాలను,ఆకాంక్షలను ఈ సినిమా ఎంతవరకూ నెరవేర్చింది.  ఈ సినిమా అయినా ఆకాష్ హీరోగా నిలబడతాడా...సినిమా కథేంటి?

210


కథ

హైదరాబాద్‌ పాతబస్తీలో బాగా పాపులర్ ప్లేస్ చోర్ బజార్. ఆ ప్రాంతంపై గ్రిప్, కంట్రోలు ఉన్నోడు బచ్చన్ సాబ్ (ఆకాష్ పూరి). అక్కడ టైర్లు దొంగతనాలు చేస్తూ బ్రతుకే అతనికి ఓ లవర్ సిమ్రన్ (గెహనా సిప్పీ). ఆమె ఓ మూగమ్మాయి. ఆమెకు మనోడు దొంగ అనే విషయం తెలియదు. కథ ఇలా కూల్ గా నడుస్తున్న సమయంలో హైదరాబాద్‌లోని మ్యూజియంలో వజ్రం మిస్ అవుతుంది. అది  నైజాం నవాబుల  కాలం నాటిది.  రూ.200 కోట్ల విలువ చేసే ఆ వజ్రం అటు తిరిగి ఇటు తిరిగి చోర్ బజార్ చేరుతుంది. దాన్ని నెల రోజుల్లో కనిపెట్టి , య‌థాస్థానంలో పెట్టాల‌ని పోలీసు శాఖ‌ను ఆదేశిస్తాడు హోమ్ మినిస్ట‌ర్ (సునీల్‌). ఇక ఆ డైమండ్ చోర్ బ‌జార్‌లో బ‌చ్చ‌న్ గ్యాంగ్‌లోని ఓ బుడ్డోడికి దొరికాక కథ మలుపుతిరుగుతుంది.

310


 దాన్ని ఏదో మామూలు రాయిగా అంద‌రూ భావిస్తూంటారు. చోర్ బ‌జార్‌కు చేరిన ఆ డైమండ్‌ను చేజిక్కించుకోడానికి ఒక‌వైపు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రిమిన‌ల్ చార్లీ గ్యాంగ్‌, ఇంకోవైపు పోలీసులు తమ ప్రయత్నాలు చేస్తూంటారు. చివరకు ఆ వజ్రం ఏం అయింది? బచ్చన్ సాబ్ కళ్లబడిందా... చోర్ బజార్‌ని ఎలాగైనా మూయించాలనుకుంటున్న గబ్బర్ సింగ్ (సుబ్బరాజు) మ్యాటరేంటి? బచ్చన్ సాబ్ జీవితాన్ని మార్చిన యూట్యూబ్ వీడియోలో కంటెంట్ ఏమిటి. మాంజా(సంపూర్నేష్ బాబు) కథ వంటి  విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

410

 ఎలా ఉంది
వాస్తవానికి ఇలా డైమండ్ దొంగతనం వంటి కథలు...క్రైమ్ కామెడీ జానర్ లోకి వస్తాయి. కానీ దర్శకుడు దాన్ని మిక్సెడ్ జానర్ లో నడపాలనుకున్నాడు. దాంతో ఓ వైపు డైమండ్ చోరి, దాని వెతుకులాట, మరో వైపు హీరో లవ్ స్టోరీ .దానికి తోడు చోర్ బ‌జార్ లో ఉండే వాళ్ల‌ను మాన‌వీయ కోణంలో చూపించాల‌ని ప్ర‌య‌త్రం మధ్యలో..మూడు మిక్స్ చేసాడు. అది సరిగ్గా కదురకపోవటంతో చాలా గందరగోళంగా మారింది. తన దగ్గర కంటెంట్ ఉంది కానీ  ఇంప్రెసివ్‌గా ప్రెజెంట్ చేసే విషయంలో  డైరెక్ట‌ర్ ఫెయిల‌య్యాడు.

510

 

స్క్రీన్ ప్లే విషయంలో జరిగిన పొరపాట్లు, తడబాట్లు స్పష్టంగా కనపడిపోతూంటాయి. అలాగే ప్రీ క్లైమాక్స్ లో చోర్ బ‌జార్ నివసించేవారి బ‌చ్చ‌న్ ఇచ్చే స్పీచ్‌ విసిగిస్తుంది.  అలాగే బ‌చ్చ‌న్ త‌ల్లి బేబీ (అర్చ‌న‌) పాత్ర‌ కూడా పండలేదు.  ఉన్నంతలో హీరోయిన్ సిమ్ర‌న్ క్యారక్టర్ బాగా డిజైన్ చేసారు. అలాగే కొన్ని లాజిక్స్ గమ్మత్తుగా ఉంటాయి. సినిమాలో డైమండ్ పోయిందనే విషయం..హోమ్ మినిస్ట‌ర్ చాలా మందితో డిస్క‌స్ చేసినా  బ‌య‌ట‌కు రాదు. ఈ సినిమా అటు క్రైమ్ కామెడీకు, యాక్షన్ కామెడీకు మద్యలో ఇరుక్కుపోయింది. ఫైనల్ గా ఓ రొటీన్ సినిమా చూస్తున్నామా అనే ఫీల్ వచ్చేసింది.

610


టెక్నికల్ గా...
దర్శకుడుగా దళం, జార్జి రెడ్డి నాటి షార్పనెస్ ఇందులో కనపడలేదు. తనది కాని కథను డీల్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. సురేష్ బొబ్బిలి సంగీతం అందించిన పాటల్లో ‘జడ’, ‘నూనుగు మీసాల’ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా చోట్ల మరీ అతిగా అనిపించింది. అఖండ నాటి తమన్ ని అనుకరించారేమో. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు గొప్పగాలేవు.

710


ఎవరెలా చేసారు

 ఆకాష్ పూరి జస్ట్ ఓకే అనిపిస్తారు.  యాక్షన్ సీన్స్ లో బాగా చేసినా అతని వయస్సుకి తగినట్లు కనిపించవు. నటనలో మరింత పరిణితి రావాల్సి ఉంది. అతను మోసే క్యారక్టర్ అయితే కాదు. తన తండ్రి సినిమాల్లో పాత్రలను అనుకరిస్తున్నట్లు తెలిసిపోతూంటుంది. ఇక మూగ పాత్రలో కనిపించిన గెహనా సిప్పీ బాగా చేసింది. నిరీక్షణ ఫేమ్ అర్చన ఇన్నాళ్లు గ్యాప్ వచ్చినా తన పాత్రను ప్రతిభావంతంగా పోషించింది. గుర్తిండిపోతుంది. సునీల్, సుబ్బరాజు, సంపూర్ణేష్ బాబు వంటి ఆర్టిస్టులకు సరైన పాత్రలు పడలేదు. న‌ల్ల వేణు, ర‌చ్చ ర‌వి, ఇమ్మాన్యుయేల్, యాద‌మ్మ రాజు లాంటి జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్లు ఉన్న కాసేపు ఎంగేజ్ చేసారు.

810
Chor Bazaar

Chor Bazaar

నచ్చినవి
వజ్రం చుట్టూ కథ నడిపే ప్రయత్నం
అర్చన ఉన్న సీన్స్
పాటలు
హీరోయిన్ క్యారక్టరైజేషన్

నచ్చనవి
కథ, కథనం
బ్యాక్ గ్రౌండ్ స్కోర్

910
Chor Bazaar

Chor Bazaar


ఫైనల్ థాట్
మాస్  ఎలిమెంట్స్ ఏ మాత్రం పండకపోయినా, అతిచేసినా మసే అని ఈ సినిమా మరోసారి ఈ బోర్ బజార్ ప్రూవ్ చేస్తుంది.
Rating:2
---సూర్య ప్రకాష్ జోశ్యుల

 

1010
Chor Bazaar

Chor Bazaar


తారాగ‌ణం: ఆకాశ్ పూరి, గెహ‌నా సిప్పీ, అర్చ‌న‌, సునీల్‌, సుబ్బ‌రాజు, సంపూర్ణేశ్ బాబు, ప్ర‌వీణ్‌, ర‌చ్చ ర‌వి, ఇమ్మాన్యుయేల్‌, న‌ల్ల వేణు
మ్యూజిక్: సురేశ్ బొబ్బిలి
బ్యాగ్రౌండ్ స్కోర్: ప్రియ‌ద‌ర్శ‌న్ బాల‌సుబ్ర‌మ‌ణ్య‌న్‌
సినిమాటోగ్ర‌ఫీ: జ‌గ‌దీశ్ చీక‌టి
ఎడిటింగ్: అన్వ‌ర్ అలీ
ఆర్ట్: గాంధీ న‌డికుడిక‌ర్‌
ఫైట్స్: పృథ్వీ శేఖ‌ర్‌
నిర్మాత: వి.య‌స్‌. రాజు
ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం: బి. జీవ‌న్ రెడ్డి
బ్యాన‌ర్: ఐ.వి. ప్రొడక్ష‌న్స్‌
విడుద‌ల తేదీ: 24 జూన్ 2022

 

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
బాలయ్య దగ్గర రికమండేషన్ లెటర్ తీసుకున్నా, ఎక్కడ తిరిగినా అడగొద్దు అని నా భర్తకు చెప్పా.. నటి హేమ కామెంట్స్
Recommended image2
దసరా బుల్లోడు రివ్యూ, వాణిశ్రీ తో ఏఎన్నార్ మోటు సరసం, రొమాంటిక్ సాంగ్స్ తో రెచ్చిపోయిన అక్కినేని..
Recommended image3
రివాల్వర్‌ రీటా మూవీ రివ్యూ, రేటింగ్‌.. కీర్తి సురేష్‌ ఈ సినిమాతో అయినా హిట్‌ కొట్టిందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved