- Home
- Life
- World Food safety day: వేసవిలో ఈ మసాలా దినుసులను అస్సలు తినకండి.. ఒకవేళ తిన్నారో మీ పని అంతే..!
World Food safety day: వేసవిలో ఈ మసాలా దినుసులను అస్సలు తినకండి.. ఒకవేళ తిన్నారో మీ పని అంతే..!
World Food safety day: మసాలాలు వంటలకు రుచిని పెంచడమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అయితే కొన్ని మసాలా దినుసులను వేసవిలో మాత్రం తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

మన జీవితంలో ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. తినకుండా మనం 1 రోజు కూడా ఉండలేము. మూడుపూటలా తిండి కోసం పొద్దంతా ఎండలో కష్టించేవారు చాలా మందే ఉన్నారు. నిజానికి అందరూ కష్టించేది కూడా ముందుగా పొట్ట కూటి కోసమే. అందుకే మనం బతకాలంటే ఆరోగ్యకరమైన ఆహారాన్నే తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సీజన్ తో పాటుగా మన ఆహారపు అలవాట్లను కూడా కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది. లేదంటే హెల్త్ ఇష్యూస్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవాన్ని (World Food safety day) ప్రతి సంవత్సరం జూన్ 7 న జరుపుకుంటారు. మెరుగైన మరియు సరైన పోషకాలను తినడం గురించి ప్రజలకు అవగాహన కల్పించడం దీని ముఖ్య లక్ష్యం. అటువంటి పరిస్థితిలో వేసవిలో తినకూడని మసాలా దినుసుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
సుగంధ ద్రవ్యాలు భారతీయ వంటకాల్లో ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఇవి ఆహారానికి రుచిని తెస్తాయి. కానీ కొన్ని మసాలా దినుసులు మన శరీరానికి వేడిని కలిగిస్తాయి. మనకు వేడి చేసే ఆహారాలను ఈ ఎండాకాలంలో తినడం ఏ మాత్రం మంచిది కాదు.
ఎండుమిర్చి.. దాదాపు ప్రతి వంటకంలో ఉపయోగించే ఎండుమిర్చి వేసవిలో మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇదివేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. దీని వల్ల పొట్ట, ఛాతీలో మంట వంటి అనేక సమస్య తలెత్తుతాయి. అందుకే వేడిలో మిరపకాయలు తీసుకోవడం తగ్గించాలి.
అల్లం.. అల్లం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా అల్లాన్నిచలికాలంలో ఎక్కువగా ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇది జలుబు, కఫం, జలుబు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కానీ వేసవిలో దీనిని తీసుకోవడం హానికరం. ఎందుకంటే ఇది వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. వేడి వల్ల డయేరియా, హార్ట్ బర్న్, ఉదర సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
వెల్లుల్లి.. అల్లం-వెల్లుల్లి కలయిక ఎలా ఉందంటే ఈ రెండింటినీ అన్ని రకాల కూరగాయల్లో ఉపయోగిస్తారు. కానీ వెల్లుల్లి కూడా వేడి చేసే లక్షణాలను కలిగి ఉంటుంది. వేసవిలో దీనిని తీసుకోవడం వల్ల యాసిడ్ రిఫ్లక్స్, రక్తస్రావం మరియు చెడు శ్వాస వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
నల్ల మిరియాలు.. నల్ల మిరియాలు కూడా ఎర్ర మిరియాలు వలె వేడిని కలిగిస్తాయి. కాబట్టి దీనిని వేసవిలో తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. లేకపోతే ఇది గుండెల్లో మంట, అసిడిటీ మరియు కడుపునొప్పి సమస్యకు దారితీస్తుంది.
గరం మసాలా.. గరం మసాలాలో జాపత్రి, పెద్ద యాలకులు, లవంగాలు, బిర్యాని ఆకు, సోంపు మొదలైన అనేక స్టాండింగ్ మసాలా దినుసులు ఉంటాయి. ఈ ఎండకాలంలో ఇవి మనకు వేడి చేస్తాయి. వేడిలో వీటిని తక్కువ పరిమాణంలోనే వాడాలి. లేకపోతే ఇది కడుపు సమస్యలను కలిగిస్తుంది.