మగవాళ్లకంటే ఆడవాళ్లకే చలి ఎక్కువ పెడుతుందట.. ఎందుకంటే..?
ఇది కాస్త ఆశ్చర్యంగా, వింతగా అనిపించినా ఇదే నిజముంటున్నారు నిపుణులు.. మగవాళ్లకంటే ఆడవాళ్లకే ఎక్కువగా చలిపెట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే..

దేశంలో చలి తీవ్రత రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ చల్లటి వాతావరణం వల్ల దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు, ఇన్ఫెక్షన్లు వంటి ఎన్నో సమస్యలు వస్తుంటాయి. ఈ సీజన్ లో బాడీలో టెంపరేచర్ తగ్గితే ఎన్నో సమస్యలు వస్తాయి. చలి నుంచి బయటపడాలంటే వేడిని కలిగించే బట్టలను వేసుకోవాలి. అయితే ఈ చలి మగవాళ్లకంటే ఆడవాళ్లకే ఎక్కువగా పెడుతుందట. ఆడవాళ్లే చలిని ఎక్కువగా అనుభవిస్తారట.
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. పురుషుల కంటే మహిళలకే ఎక్కువ చలి పెడుతుంది. అంతే ఒకే వెదర్ పురుషులకు నార్మల్ గా అనిపించినా.. అదే ఆడవారికి మరీ చల్లగా అనిపిస్తుందట. దీనికి కారణం ఆడవాళ్ల అంతర్గత నిర్మాణం, భౌతిక రూపం. వీటివల్లే ఆడవాళ్లకు ఎక్కువ చల్లగా అనిపిస్తుందట.
వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పురుషుల కంటే మహిళలకే చలి ఎక్కువగా అనిపించడానికి కారణం వారి జీవక్రియ. శరీరంలో శక్తి స్థాయిలను నిర్వహించడానికి జీవక్రియ పనిచేస్తుంది. శరీరంలో శక్తి పుష్కలంగా ఉన్నప్పుడు.. శరీరం త్వరగా చల్లబడే అవకాశం ఉండదు. అలాగే శరీరంలో చాలా చురుగ్గా కూడా ఉంటుంది. అయితే పురుషులతో పోలిస్తే మహిళల్లోనే మెటబాలిజం స్థాయి తక్కువగా ఉన్నట్టు పరిశోధకులు గుర్తించారు. అందుకే పురుషుల కంటే ఆడవారికే చలి ఎక్కువగా అనిపిస్తుంది.
lifestyle
ఆడవారిలో కండరాలు తక్కువగా ఉంటాయి
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పురుషులతో పోల్చితే ఆడవారిలో కండరాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనివల్ల కూడా ఆడవారికి ఎక్కువ చలిగా అనిపిస్తుంది. నిజానికి కండరాలు మన శరీరాల్ని వెచ్చగా ఉంచుతాయి. ఇక ఆడవారిలో ఈ కండరాలు తక్కవగా ఉండటం వల్ల వీళ్లు చలికి త్వరగా వణుకుతున్నారు. ఇకపోతే గది ఉష్ణోగ్రత సాధారణంగా 20-22 డిగ్రీల సెల్సియస్ ఉంటే మంచిది. కానీ ఆడవారికి 25 డిగ్రీల సెల్సియస్ ఉంటేనే కంఫర్ట్ గా అనిపిస్తుంది.
ఇలాంటి పరిస్థితిలో వెంటనే వైద్యుడిని సంప్రదించాలి
చలికాలంలో ఎక్కువగా వడదెబ్బ తగిలినా, ఎప్పుడూ వణుకుతున్నా, నిరంతరం చలిగా అనిపించినా.. దానిని సాధారణ శారీరక సమస్యగా భావించకూడదు. ఇలాంటి సమస్యలు వస్తే వెంటనే హాస్పటల్ కు వెళ్లడం మంచిది. ఇది శరీరంలోని ఇతర ఎన్నో రోగాలకు సంకేతం కావొచ్చంటున్నారు నిపుణులు. ఇలాంటి వాటికి సకాలంలో హెల్త్ చెకప్ లు చేయించుకోవడం చాలా అవసరం.