Dussehra Saree: దసరా రోజు ఎరుపు రంగు బార్డర్ ఉన్న తెలుపు చీరల్ని మహిళలు ఎందుకు ధరించాలి?
దసరా రోజు దుర్గా పూజను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. దుర్గా పూజకు మహిళలు ఎరుపు అంచు ఉన్న తెల్లటి చీరలు ఎక్కువగా కడతారు. ముఖ్యంగా బెంగాలీ మహిళలు ఇలా కడుతూ ఉంటారు. ఆ చీరలకు దుర్గా పసుపు ఏమిటి సంబంధం?

దసరా చీరలు ఇవే
తెలుపు రంగు చీరలకు ఎరుపు రంగు బార్డర్ ఉంటే వాటిని బెంగాలీ చీరలు అని పిలుస్తారు. పశ్చిమబెంగాల్లో వీటిని అధికంగా కడుతూ ఉంటారు. ఈ సాంప్రదాయం మెల్లగా అన్ని రాష్ట్రాలకు పాకింది. దుర్గాపూజ పండుగ రోజు భారతదేశ అంతట మహిళలు ఎక్కువగా ఎరుపు రంగు బార్డర్ ఉన్న చీరలను కట్టేందుకు ఇష్టపడతారు. ఇది ఫ్యాషన్ అని ఎంతోమంది అనుకుంటారు. కానీ దీని వెనక సాంప్రదాయమైన, మతపరమైన ప్రాముఖ్యత కూడా ఉంది.
ఎరుపు అంచు ఉన్న చీరలు
దుర్గా పూజ సందర్భంగా మహిళలు ఎరుపు అంచు ఉన్న తెల్లటి చీరలను ధరించి అందంగా కనిపిస్తారు. ఆ రెండు రంగులు దుర్గాదేవితో ముడిపడి ఉన్నాయని చెప్పుకుంటారు. బెంగాలీ మహిళల్లోనే ఎక్కువగా ఈ చీరలు ప్రాచుర్యంలో ఉండేవి. ఇప్పుడు ఎంతోమంది వీటిని కట్టేందుకు ఇష్టపడుతున్నారు. దుర్గాపూజ సందర్భంగా ప్రతి స్త్రీ లేదా బాలిక ఈ రెండు రంగుల్లో ఉన్న డ్రెస్ ను ధరిస్తే మంచిదని చెబుతారు.
రంగుల ప్రాముఖ్యత
ఎరుపు రంగు, శక్తికి చిహ్నం ఇక తెలుపు రంగు స్వచ్చతకు చిహ్నం. ఎరుపు, తెలుపు రంగుల రెండు కూడా దుర్గాదేవికి ఇష్టమైనవే. దుర్గాపూజ సమయంలో శక్తికి చిహ్నంగా ఎరుపు రంగును స్వచ్ఛతకు, చిహ్నంగా తెలుపు రంగును కలిపి ధరిస్తే అమ్మవారి అనుగ్రహం దొరుకుతుందని చెప్పుకుంటారు. అందుకే మహిళలు దుర్గా పూజ రోజు ఇలా ఎరుపు అంచు ఉన్న తెల్లచీరను ధరించేందుకే ఇష్టపడతారు. ఈ రెండు రంగులు కలయిక కూడా ఎంతో అందంగా ఉంటుంది.
చరిత్ర ఇదే
చాలా ఏళ్ళ క్రితం బెంగాల్ లో చేతితో తయారుచేసిన కాటన్ లేదా సిల్క్ తో మాత్రమే తెల్లటి చీరలను తయారు చేసేవారు. అయితే స్వాతంత్య్ర ఉద్యమాలలో కూడా ఈ చీరల ముఖ్యపాత్ర పోషించింది. ఆ సమయంలో ఈ చీరలను ధరించే ఎంతోమంది ఉద్యమంలో పాల్గొన్నారు. మహిళల భారతీయ గుర్తింపుకు ప్రతిబింబంగా కూడా ఈ చీర మారింది.