మీ బీపీ ఎప్పుడూ ఎక్కువగానే ఉంటోందా..? దానికి కారణాలు ఇవే..
blood pressure : సైలెంట్ కిల్లర్ అయిన అధిక రక్తపోటును తేలిగ్గా తీసిపారేయడానికి వీళ్లేదు. ఎందుకంటే దీనివల్ల ప్రాణాంతకమైన క్యాన్సర్, గుండె పోటు, స్ట్రోక్ వంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది.

ప్రస్తుత కాలంలో ప్రమాదరకమై జుబ్బులు సైతం సాధారణ సమస్యగా మారిపోయాయి. అందులో అధిక రక్తపోటు ఒకటి. ఇది జనాలకు సర్వసాధారణ సమస్యగా కనిపించినప్పటికీ ఇది చాలా భయంకరమైంది. ఈ అధిక రక్తపోటు వల్ల ప్రాణాంతకమైన గుండె పోటు, స్ట్రోక్, క్యాన్సర్ వంటి ఎన్నో జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకే వైద్యులు బీపీని నియంత్రణలో ఉంచుకోవాలని హెచ్చరిస్తుంటారు. ఇది ఎటువంటి లక్షణాలు లేకుండా వస్తుంది. అందుకే ఈ వ్యాధిని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తారు.
ఈ వ్యాధి వల్ల గుండె మరియు ధమనులపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాదు హార్ట్ ఎటాక్, గుండె వైఫల్యం, స్ట్రోక్ వంటి ఎన్నో ప్రాణాంతక వ్యాధులు వచ్చేలా చేస్తుంది. కాబట్టి ఈ సమస్యను అంత ఈజీగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
blood pressure
సాధారణ రక్తపోటు అంటే ఏమిటి.. సాధారణన రక్తపోటు స్థాయి 120/80 mmHg కంటే తక్కువ మొత్తంలో ఉంటుంది. ఇక అధిక రక్తపోటు అంటే 140/90 కంటే ఎక్కువగా ఉండటం. ఇక ఇది 180/120 mmHg కంటే ఎక్కువగా ఉన్నట్టైతే ఇది ప్రాణాంతకం కావొచ్చు.
తరచుగా అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు కొన్ని విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా బీపీ నియంత్రణలో ఉండాలంటే వీటిని తప్పకుండా పాటించాల్సిందే. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం
సోడియం వాడకం తగ్గించాలి.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) ప్రకారం.. సోడియం కు అధిక రక్తపోటుకు మధ్య సంబంధం ఉందని తేల్చి చెప్పారు. యుఎస్ ఆరోగ్య సంస్థ ప్రకారం.. అధికంగా ఎవరైతే సోడియం తీసుకున్నారో వారే ఎక్కువగా అధిక రక్తపోటు సమస్యను ఎదుర్కొంటున్నారట. ముఖ్యంగా వీరు వీరి ఆహారంలో ఉప్పు క్వాంటిటీని తగ్గించినప్పటికీ ప్యాకెట్ ఫుడ్స్, వంటి సోడియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకున్నా బీపీ పెరుగుతుందట. అందుకే వీటికి దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం.. ఉప్పు ను ఎక్కువగా తీసుకున్నా, శాచురేటెడ్, కేలరీలు, ట్రాన్స్ ఫ్యాట్, చక్కెర వంటి ఆహార పదార్థాలు అధిక రక్తపోటుకు కారణం అవుతాయి.
ఎహెచ్ఎ ప్రకారం.. పొటాషియం సోడియంను ఎదుర్కోవడంలో ముందుంటుంది. పొటాషియం ఎంత ఎక్కువగా తీసుకుంటే మీ ఒంట్లో నుంచి సోడియం అంత ఎక్కువగా బయటకు పంపబడుతుంది. అంతేకాదు పొటాషియం ధమనులను, రక్తనాళాల గోడలను ఆరోగ్యంగా ఉంచుతుందని చెబుతున్నారు. మీ శరీరంలో పొటాషియం లెవెల్స్ ను పెంచడానికి .. బ్రోకలి, బచ్చలి కూర, అరటిపండ్లు, ఆకు కూరలు, నారింజ, టొమాటోలు, కొబ్బరి నీళ్లు వంటివి ఉపయోగపడతాయి. కాబట్టి అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు వీటిని రోజువారి ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఒత్తిడి కారణం.. మీరు ఒత్తిడికి గురైనప్పుడు ఆటోమెటిక్ గా రక్తపోటు స్థాయిలు పెరుగుతాయి. అదే ఒత్తిడి తగ్గితే మీ నరాలు ప్రశాంతంగా ఉంటాయి. కానీ అధిక ఒత్తిడి వల్ల రక్తనాళ గోడలకు నష్టం కలుగుతుంది. చెడు ఆహారం, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి రక్తపోటును పెంచుతాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ తెలుపుతుంది.