వాచ్ ని ఎడమచేతికే ఎందుకు పెట్టుకుంటారు? కుడిచేతికి పెట్టుకుంటే ఏమవుతుంది?
గడియారాన్ని ఎక్కువగా ఎడమచేతికి ఎందుకు పెడతారో తెలుసా? కుడిచేతికి ఎందుకు పెట్టుకోరు? ఇందుకు గల కారణాలేంటో తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

రిస్ట్ వాచ్ గురించి ఆసక్తికర విషయాలు..
సమయం తెలుసుకునేందుకు ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నారుగానీ ఒకప్పుడు గడియారాలను ఎక్కువగా వాడేవారు. ముఖ్యంగా బయటకు వెళ్లేటపుడు చేతికి వాచ్ పెట్టుకునే కల్చర్ ఎక్కువగా ఉండేది ... ఇది కొంతకాలినికి స్టైల్ గా మారిపోయింది. ఇప్పుడు కూడా చాలామంది స్టైలిష్ గా, ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్ లు పెట్టుకునేందుకు ఇష్టపడతారు. ఇక సెలబ్రిటీలు లక్షలు, కోట్ల విలువచేసే వాచ్ లు పెట్టుకుని కనిపిస్తుంటారు. అయితే ఎంత ఖరీదైనది అయినా వాచ్ ను ఎడమచేతికే పెట్టుకుంటారు. ఈ చేతికే ఎందుకు పెట్టుకోవాలి? కుడిచేతికి ఎందుకు పొట్టుకోరో తెలుసా?
వాచ్ ను ఎడమచేతికి ధరించడాకి కారణాలివే...
వాచ్ ఎడమ చేతికే ధరించడానికి ప్రత్యేక కారణాలేవీ లేవు.. కేవలం సౌకర్యవంతంగా, ఈజీగా ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టే ఇలా చేస్తారు. ప్రపంచ జనాభాలో దాదాపు 85-90% మంది కుడిచేతి వాటం కలిగినవారే. వీళ్లు పనులన్నీ కుడిచేతితో చేస్తారు. రాయడం, తినడం, వస్తువులను పట్టుకోవడం వంటి వాటిలో కుడిచేయి ఎక్కువగా పనిచేస్తుంది.
గడియారాన్ని ఎడమ చేతికి ధరించడం వల్ల కుడిచేయి స్వేచ్ఛగా పనిచేయగలుగుతుంది. అంతేకాదు ఇది గడియారానికి నష్టం జరగకుండా కాపాడుతుంది. ఉదాహరణకు మీరు ఏదైనా రాస్తున్నప్పుడు కుడిచేతికి వాచ్ ఉంటే ఇబ్బందిగా ఉంటుంది... అదే ఎడమచేతికి ఉంటే కుడిచేత్తో సౌకర్యవంతంగా రాసుకోవచ్చు.
జేబు గడియారాల కల్చర్
ఒకప్పుడు రిస్ట్ వాచ్ ల స్థానంలో జేబు గడియారాలుగా ఉండేవి… అందుకే జీన్స్ ప్యాంట్స్ కి ప్రత్యేకంగా ఓ చిన్న జేబు ఉండేది. అందులో ఈ వాచ్ ను పెట్టుకునేవారు. ఇప్పటికీ ఈ జీన్స్ ప్యాంట్స్ కు ఈ జేబు ఉంటుంది.
అయితే మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికులకు తమ ఆయుధాలను ఉపయోగించడానికి రెండు చేతులు అవసరం అయ్యేవి. దీంతో జేబువాచీల్లో సమయం తెలుసుకోవడం కష్టమయ్యేది. అప్పుడే ఈ చేతి గడియారాల వాడకం ప్రారంభమయ్యింది.
చేతి గడియాలు ఎడమచేతికి ఉంటేనే సౌకర్యవంతం
చేతి గడియారాలలో టైమ్ సెట్ చేసుకోడానికి ఓ చిన్న ఏర్పాటు ఉంటుంది... ఇది గడియారం కుడివైపు ఉంటుంది. కాబట్టి ఎడమ చేతికి గడియారాన్ని ధరించినప్పుడు కుడిచేతి వేళ్ళతో క్రౌన్‌ను తిప్పడం సులభం అవుతుంది. ఈ డిజైన్ అలవాటు నేటికీ కొనసాగుతోంది. ఆధునిక స్మార్ట్ వాచ్ లలో కూడా బటన్లు చాలావరకు కుడివైపునే ఉంటాయి.
గడియారం రక్షణ
గడియారాన్ని ఎడమ చేతికి ధరించడం దాని రక్షణకు దోహదపడుతుంది. కుడిచేయి దైనందిన పనుల్లో ఎక్కువగా పాల్గొంటుంది కాబట్టి గడియారానికి గీతలు పడటం లేదా విరిగిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎడమ చేతికి ధరించడం వల్ల గడియారం దెబ్బతినే అవకాశాలు తక్కువ.
కార్మికులు, క్రీడాకారులు, కఠినమైన పనులు చేసేవారికి ఇది చాలా ముఖ్యం. గడియారం ఎడమ చేతిలో ఉండటం వల్ల పనిచేసేటప్పుడు కలిగే ప్రభావాలు, రాపిడి నుండి అది రక్షించబడుతుంది. దీనివల్ల గడియారం మన్నిక పెరుగుతుంది.