MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • King Of Sweets: రాజుల కిచెన్ నుంచి.. ఇంటింటికీ చేరిన ‘ కింగ్ ఆఫ్ స్వీట్’ ఏదో తెలుసా?

King Of Sweets: రాజుల కిచెన్ నుంచి.. ఇంటింటికీ చేరిన ‘ కింగ్ ఆఫ్ స్వీట్’ ఏదో తెలుసా?

King Of Sweets: చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు అందరికీ స్వీట్లు అంటే ఇష్టమే. ఒక్కొక్కరికి ఒక్కో స్వీటు బాగా నచ్చుతుంది. కానీ.. మనకు దొరికే అన్ని రకాల స్వీట్లలో... కింగ్ ఆఫ్ స్వీట్ ఏదో తెలుసా? కేవలం రాజుల కోసం చేసే ఈ స్వీట్ ఇంటింటికీ ఎలా చేరింది?

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 06 2026, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
స్వీట్లలో రారాజు ఎవరు?
Image Credit : chat gpt

స్వీట్లలో రారాజు ఎవరు?

ఏ పండగ వచ్చినా, ఇంట్లో ఏ చిన్న శుభకార్యం ఉన్నా... ఆ ఇంట్లో కచ్చితంగా స్వీట్ ఉండాల్సిందే. నోటిని తీపి చేసే స్వీట్లు మన మార్కెట్లో కొన్ని వందల, వేల రకాలు ఉన్నాయి. కానీ, ఆ స్వీట్స్ అన్నింటికీ... రాజు ఒక స్వీట్ ఉంది. ఒకప్పుడు.. ఆ స్వీట్ ని కేవలం రాజుల కోసం మాత్రమే తయారు చేసేవారు. కమ్మని నేతితో చేసే ఈ వంట తర్వాతర్వాత రోజుల్లో ప్రతి ఒక్కరికీ చేరువైంది. మరీ ముఖ్యంగా... ప్రతి ఇంటికీ చేరింది. ఆ స్వీట్ ఏంటి? ఆ స్వీట్ కింగ్ ఆఫ్ స్వీట్స్ గా ఎలా మారింది?

కింగ్ ఆఫ్ స్వీట్.. మైసూర్ పాక్...

మీకు నమ్మసక్యంగా లేకపోయినా మైసూర్ పాక్.. కింగ్ ఆఫ్ స్వీట్స్. నెయ్యంతా కుమ్మరించి.. నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా ఉండే మైసూర్ పాక్.. తయారీ వెనక పెద్ద కథే ఉంది. శనగపిండి, నెయ్యి, పంచదార తో కలిపి చేసే ఈ స్వీట్ ని దాదాపు చాలా మంది మహిళలు తమ ఇళ్లల్లో చాలా ఈజీగా చేసుకుంటూనే ఉంటారు. కానీ, ఒకప్పుడు దీనిని రాజుల కోసం మాత్రమే తయారు చేసేవారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
రాజుల వంట గది నుంచి పుట్టిన స్వీట్..
Image Credit : Gemini AI

రాజుల వంట గది నుంచి పుట్టిన స్వీట్..

మైసూర్ పాక్ కథ 19వ శతాబ్దం చివర్లో మైసూర్ రాజులైన ‘ఒడియార్’ సంస్థనంలో మొదలైంది. మైసూర్ రాజా నాలుగో కృష్ణ రాజ ఒడియార్ కి స్వీట్లు తినడం అంటే ఇష్టం. అయితే..ఒక రోజు ఆయన భోజన సమయంలో స్వీట్ లేదు. దీంతో.. అప్పటికప్పుడు వాళ్ల వంటగాడు కాకాసుర మడప్ప ఒక ప్రయోగం చేశాడు. శనగపిండి, నెయ్యి , పంచదార పాకాన్ని కలిపి వేగంగా ఒక వంటకం తయారుచేసి రాజుగారికి వడ్డించాడు. ఆ రుచికి ఫిదా అయిన రాజు, "దీని పేరు ఏమిటి?" అని అడగ్గా.. కంగారులో మడప్ప ‘మైసూర్’ (నగరం పేరు) ‘పాక’ (కన్నడలో పాకం) కలిపి ‘మైసూర్ పాక్’ అని పేరు చెప్పేశాడు. ఆ తర్వాత ఈ వంటకాన్ని రాజభవనం బయట కూడా విక్రయించమని రాజు ప్రోత్సహించడంతో మైసూర్ దేవరాజ మార్కెట్ వద్ద ‘గురు స్వీట్స్’ వెలిసింది. ఇప్పటికీ ఆయన వారసులే ఆ షాప్‌ను నిర్వహిస్తున్నారు!

33
మైసూర్ పాక్ లో రకాలు...
Image Credit : Asianet News

మైసూర్ పాక్ లో రకాలు...

క్రాంచీ/ట్రెడిషనల్ మైసూర్ పాక్: గుల్లగా, చిన్న చిన్న రంధ్రాలతో కొద్దిగా గట్టిగా ఉంటూ నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది.

సాఫ్ట్/నెయ్యి మైసూర్ పాక్: ఆధునిక కాలంలో ప్రాచుర్యం పొందిన ఈ రకంలో నెయ్యి మోతాదు ఎక్కువగా ఉండి, వెన్నలాంటి మెత్తదనంతో నోట్లో వేస్తే జారిపోతుంది. దీనినే మిల్క్ మైసూర్ పాక్ అని కూడా ఈ రోజుల్లో పిలుస్తున్నారు.

ఇంట్లోనే మైసూర్ పాక్ ఎలా తయారు చేయాలి..?

శనగపిండి (Besan): 1 కప్పు( ముందుగానే జల్లించి పెట్టుకోవాలి..)

నెయ్యి: 2 నుండి 3 కప్పులు

పంచదార: 2 కప్పులు

నీళ్లు: 1 కప్పు

యాలకుల పొడి లేదా బేకింగ్ సోడా: చిటికెడు

తయారీ విధానం:

శనగపిండి వేయించడం: ఒక పాత్రలో అర కప్పు నెయ్యి వేడి చేసి, అందులో జల్లించిన శనగపిండి వేసి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు 8–10 నిమిషాలు చిన్న మంటపై వేయించి పక్కన పెట్టుకోండి.

పాకం పట్టడం: మరొక మందపాటి పాత్రలో పంచదార, నీళ్లు పోసి కరిగించండి. లేత ఒక తీగ పాకం వచ్చే వరకు మరిగించండి.

కలపడం & నెయ్యి చేర్చడం: పాకం వచ్చాక మంట తగ్గించి, వేయించి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా తిప్పాలి. ఆ తర్వాత మిగిలిన వేడి నెయ్యిని కొద్దికొద్దిగా పోస్తూ తిప్పుతూ ఉండాలి. మిశ్రమం దగ్గరపడి, బాణలి అంచులను వదులుతూ పైన చిన్న బుడగలు వచ్చినప్పుడు దించేయాలి.

ముక్కలుగా కోయడం: నెయ్యి రాసిన ఒక ట్రేలో ఈ మిశ్రమాన్ని పోసి, 10-15 నిమిషాలు చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడే చాకుతో చతురస్రాకారంలో ముక్కలుగా కోసుకుంటే అద్భుతమైన రాయల్ మైసూర్ పాక్ రెడీ అయినట్లే. కాకపోతే.. ఈ స్వీట్ రుచిగా రావాలంటే నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుంది. అప్పుడే రుచి వస్తుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st ODI • NZ vs IND 2026
Result
NZNZ
185
INDIND
143/5
IND beat NZ by 5 wickets (D/L) method
Schedule ›
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
1st TEST • PAK vs SL 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:00 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th ODI • NZ vs IND 2026
NZNZ
Fri, 13 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
5th ODI • NZ vs IND 2026
NZNZ
Sun, 15 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Diwali Diya Making: పైసా ఖర్చు లేదు..కానీ ఈ దీపాల వెలుగుల్లో మీ ఇల్లు మెరిసిపోతుంది
Recommended image2
Yellow City: ప్రపంచ మార్కెట్ ని రూల్ చేస్తున్న మన పసుపు రాజధాని ఏదో తెలుసా?
Recommended image3
Raw Banana/Ripe Banana: అరటికాయ, అరటిపండు.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మేలు?
Related Stories
Recommended image1
Land Of Lemons: మన దేశంలోనే నిమ్మకాయల రాజధాని ఏదో తెలుసా?ఇక్కడి నిమ్మకాయలు వరల్డ్ ఫేమస్..!
Recommended image2
Yellow City: ప్రపంచ మార్కెట్ ని రూల్ చేస్తున్న మన పసుపు రాజధాని ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved