- Home
- Life
- monkeypox:గుబులు పుట్టిస్తున్నకొత్త వ్యాధి..‘మంకీపాక్స్’ లక్షణాలు.. చికిత్సా విధానం.. పూర్తి వివరాలు..
monkeypox:గుబులు పుట్టిస్తున్నకొత్త వ్యాధి..‘మంకీపాక్స్’ లక్షణాలు.. చికిత్సా విధానం.. పూర్తి వివరాలు..
monkeypox: ఒకటి పోతే ఇంకోటన్నట్టు ఇప్పుడు ‘మంకీపాక్స్’ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ కొత్తరకం వైరస్ వ్యాధి ప్రస్తుతం యూకేలో వ్యాపిస్తోంది..
- FB
- TW
- Linkdin
Follow Us

monkeypox: కరోనా కారణంగా ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయ్యాయి. అవుతూనే ఉన్నాయి. కానీ ఈ రోగం మాత్రం మనల్ని విడిచి వెల్లడం లేదు. ఒకటి పోతే ఇంకోటన్నట్టు కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ అంటూ వచ్చిన వైరస్ లు సరిపోవన్నట్టు ఇప్పుడు మరో కొత్త రకం వైరస్ మంకీపాక్స్ ( monkeypox)యూకేలో వ్యాప్తి చెందుతోంది.
monkeypox virus
జూలై 7న యూకే ఆరోగ్య శాఖ అధికారులు జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. నైజీరియా నుంచి యూకేకు వచ్చిన ఓ వ్యక్తికి ఈ మంకీపాక్స్ వైరస్ సోకినట్లు నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం ఈ వ్యక్తిని సెయింట్ థామస్ ఆస్పత్రిలోని ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇక ఈ వ్యక్తిని కలిసిన వారందరికీ టెస్ట్ లు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు.
మంకీపాక్స్ అంటే ఏమిటి..?
ఈ వ్యాధి 1958 లో కోపెనన్ హాగన్ లోని స్టేట్ సీరం ఇనిస్టిట్యూట్ లో పరిశోధన కోసం ఉంచిన కోతుల మధ్య ఇది వ్యాప్తి చెందింది. 1970 లో కాంగోలోని మానవులలో వ్యాప్తి చెందడం ప్రారంభమైంది. ఈ వ్యాధిని ‘మంకీ పాక్స్’ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది కోతుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఈ మంకీ పాక్స్ వైరస్ పోక్స్విరిడే (Poxviride) కుటుంబంలోని ఆర్థోపాక్స్ వైరస్ జాతికి చెందినది. ఇది ఆవు, గుర్రం మరియు ఒంటె నుంచి కూడా వ్యాపిస్తుంది.
ఈ వ్యాధి 1980 లో పూర్తిగా నయమైందని ప్రకటించినప్పటికీ.. ఇది మళ్లీ వ్యాప్తి చెందడం ప్రారంభించింది. దీంతో ప్రజలు మరింత భయభ్రాంతులకు గురవుతున్నారు. మంకీపాక్స్ రెండు జన్యురూపాలను కలిగి ఉంటుంది. కాంగో బేసిన్, వెస్ట్ ఆఫ్రికన్ క్లాడెస్ లల్లో కాంగో బేసిన్ అత్యంత వేగంగా వ్యాపిస్తోంది.
1996-97లో కాంగోలో మంకీ పాక్స్ వెలుగులోకి వచ్చినప్పటికీ.. దీని ఇన్ఫెక్షన్ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ మరణాల సంఖ్య తక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. 2003లో ఆఫ్రికాలో మొదటిసారిగా మంకీపాక్స్ సంక్రమణ యునైటెడ్ స్టేట్స్ లో కనుగొనబడింది. 2018లో ఇజ్రాయెల్ లో, 2018 సెప్టెంబర్ లో లండన్ లో, 2019 డిసెంబర్ లో లండన్ లో, 2019 మే లో సింగపూర్ లో దీన్ని కనుగొన్నారు.
మంకీబాక్స్ లక్షణాలు: జ్వరం, తీవ్రమైన తలనొప్పి, వెన్నునొప్పి, కండరాల నొప్పి, విపరీతమైన అలసట మరియు చీలమండ వాపు వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం వచ్చిన మూడు రోజుల్లోనే చర్మంపై గడ్డలు వంటి బొబ్బలు వస్తాయని డబ్ల్యూహెచ్ఓ నివేదించింది. ముఖం, అరచేతులు మరియు పాదాల అరికాళ్లపై దద్దుర్లు ఎక్కువగా కనిపిస్తాయట. నోరు, కళ్ళు మరియు జననేంద్రియాల ద్వారా మందపాటి శ్లేష్మం లాంటి ద్రవం విడుదల అవుతుందని కూడా ఇది తెలిపింది. బాధితులకు కనీసం 6-13 రోజులు, మరికొందరికి 5-21 రోజుల పాటు చికిత్స అందిస్తామని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
మంకీపాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది..?
మంకీపాక్స్ వ్యాధి అడవి జంతువుల నుండి మానుషులకు వ్యాప్తి చెందుతుంది, ఇది సోకిన మనిషి నుంచి ఆరోగ్యకరమైన మనిషికి గాయాలు, శరీర ద్రవాలు, శ్వాస తుంపర, పరుపులు వంటి కలుషిత పదార్థాలతో వ్యాప్తి చెందుతుంది. పరిశోధన ఫలితాల ప్రకారం.. "ఈ వ్యాధి సోకిన జంతువుల కాటు లేదా గీతలు లేదా ఇది సోకిన వారి వస్తువులను వాడినప్పుడు కూడా వ్యాపిస్తుంది.