Blood Cancer: బ్లడ్ క్యాన్సర్ ను ఎలా గుర్తించాలి..? దీని లక్షణాలు ఎలా ఉంటాయి..?
Blood Cancer: బ్లడ్ క్యాన్సర్ కు గురైన వారిలో తెల్ల రక్తకణాల ఉత్పత్తి విపరీతంగా పెరుగుతుంది. దాంతో రక్తం కడ్డకట్టడానికి సహాయపడే ప్లేట్ లెట్స్ పూర్తిగా తగ్గుముఖంపడతాయి. దీంతో వారి స్కిన్ పై దద్దుర్లు, గాయాలైనప్పుడు రక్తం ఎక్కువగా కారడం వంటివి జరుగుతుంటాయి.

బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వారి శరీరంలోని రక్తకణాల ఉత్పత్తిపై చెడు ప్రభావం పడుతుంది. దాంతో కొన్నిరకాల కణాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇవన్ని కణ సమూహాలుగా ఏర్పడుతాయి. వీటినే క్యాన్సర్ అంటారు. ఈ క్యాన్సర్ ఎముక మజ్జ భాగంలోనే ప్రారంభమవుతుంది. కాగా ఇక్కడే క్యాన్సర్ మూల కణాలు ఏర్పడి.. అవి పెరిగి తెల్లరక్తకణాలు, ఎర్రరక్తకణాలు కాస్త ప్టేట్ లెట్స్ గా రూపాంతరం చెందుతాయి.
బ్లడ్ క్యాన్సర్ సోకిన వారిలో తెల్ల రక్తకణాలు విపరీతంగా పెరిగిపోతుంటాయి. అంతేకాదు ఎర్రరక్తకణాల సంఖ్య పూర్తిగా తగ్గిపోతుంది. ఎందుకంటే తెల్లరక్తకణాలు విపరీతంగా పెరగడం వల్ల ఇతర కణాలు పనిచేయకుండా తయారవుతాయి . ఎందుకంటే ఈ తెల్లరక్త కణాలు మిగతా వాటిపై చెడు ప్రభావం చూపిస్తాయి.
blood cancer
దీనివల్ల ఇమ్యూనిటీ వపర్ కూడా పూర్తిగా తగ్గిపోతుంటుంది. బ్లడ్ క్యాన్సర్ 3 రకాలు.. అవేంటంటే.. లుకేమియా, లింఫోమా, మైలోమా..
బ్లడ్ క్యాన్సర్ లక్షణాలు.. బ్లడ్ క్యాన్సర్ వచ్చిన వారిలో తెల్లరక్తకణాలు ఎక్కువ మొత్తంలో పుట్టుకొస్తుంటాయి. దీంతో వీరికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు.. విపరీతంగా బ్లీడింగ్ అవుతుంది. దీనికి కారణంగా రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్ లెట్స్ పూర్తిగా తగ్గిపోవడమే. అలాగే చర్మంపై దద్దుర్లు ఏర్పడుతుంటాయి. ఈ లక్షణాలు కూడా రోగం ముదిరాకనే కనిపిస్తుంటాయి.
blood cancer
తరచుగా అలసటకు గురవడం, ఆకలి లేకపోవడం , నీరసంగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. తరచుగా ఫీవర్ కూడా వస్తుంటుంది.
ఉన్నపాటుగా వెయిట్ లాస్ అవుతుంటారు. ఇక రాత్రి పడుకున్నప్పడు చెమటలు విపరీతంగా పడుతుంటాయి. చిగుళ్లు, ముక్కు నుంచి బ్లాడింగ్ అవుతూ ఉంటుంది.
blood cancer
అంతేకాదు ఎర్రరక్తకణాలు తగ్గడం వల్ల రక్తహీనత సమస్య కూడా తలెతొచ్చు. ఈ కారణంగా వాళ్లకు ఆక్సిజన్ సరిపడా అందదు. దాంతో వారికి ఆయాసం వస్తుంటుంది. అలాగే ఎముకల నొప్పి కూడా ఉంటుంది. ఈ లక్షణాలు కనిపిస్తే.. వెంటనే పరీక్షలు చేయించుకోవడం ఎంతో ముఖ్యం.