రోజూ నీళ్లు తక్కువగా తాగితే ఏమౌతుందో తెలుసా?
కొంతమంది నీళ్లను పుష్కలంగా తాగితే.. మరికొంతమంది మాత్రం నీళ్లను మరీ తక్కువగా తాగుతుంటారు. కానీ మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం మనం నీళ్లను పుష్కలంగా తాగాలి. కానీ కొంతమంది నీళ్లను అవసరానికి సరిపడా తాగరు. ఇలా తాగకుంటే ఏమౌతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
అల్జీమర్స్ వ్యాధి
మనం నీళ్లను తక్కువగా తాగినప్పుడు శరీరం నిర్జలీకరణానికి గురవుతుంది. అలాగే రక్తం జిగటగా మారుతుంది. అలాగే మన గుండె మెదడుకు తగినంత రక్తాన్ని పంప్ చేయలేకపోతుంది. వీటన్నింటి వల్ల చిత్తవైకల్యం సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కీళ్ల నొప్పులు
అవును నీళ్లను సరిగ్గా తాగకపోవడం వల్ల ఎన్నో రకాల సమస్యలొస్తాయి. వాటిలో కీళ్ల నొప్పులు ఒకటి. అవును మన శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు మన కీళ్ల కుహరాల్లో కనిపించే సైనోవియల్ ద్రవం ఎండిపోతుంది. దీంతో మనం నడుస్తున్నప్పుడు కీళ్లలో ఘర్షణ పెరుగుతుంది. దీంతో కీళ్ల నొప్పులు పెరుగుతాయి.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్
నీళ్లను మరీ తక్కువగా తాగడం వల్ల మూత్రానికి సంబంధించిన సమస్యలు వస్తాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ తగినంత నీళ్లను తాగకపోవడం, ఎక్కువసేపు మూత్రాన్ని పట్టుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
క్రమరహిత రుతుస్రావం
నీళ్లను మన శరీరానికి సరిపడా తాగకపోవడం వల్ల పీరియడ్స్ కు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. శరీరానికి అవసరమైన నీటిని తాగకపోవడం వల్ల చాలా ముదురు రుతుస్రావం రక్తం, నీటి ఆకృతి, తీవ్రమైన శరీర తిమ్మిరి మొదలైనవి రుతుక్రమ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
హేమోరాయిడ్స్
నీళ్లను సరిగ్గా తాగకపోవడం వల్ల హేమోరాయిడ్స్ సమస్య కూడా వస్తుంది. మన శరీరానికి తగినంత నీరు అందకపోతే జీర్ణక్రియ కష్టమై పేగు పొడిబారుతుంది. ఇది ప్రేగులలో వ్యర్థాలను పెంచుతుంది. అలాగే మలబద్దకానికి కారణమవుతుంది. ఇది చివరికి హేమోరాయిడ్లకు దారితీస్తుంది.
బరువు పెరగడం
మీరు నీళ్లను పుష్కలంగా తాగకపోవడం వల్ల పేగులలో నీరు ఉండదు. దీంతో జీర్ణాశయానికి ఆహారాన్ని జీర్ణం చేయడం కష్టంగా ఉంటుంది. అలాగే దీనివల్ల మీరు మోతాదుకు మించి ఎక్కువగా తింటారు. దీనివల్లే మీ శరీర బరువు బాగా పెరుగుతుంది.
నీళ్లు తక్కువగా తాగుతున్నారని ఎలా తెలుసుకోవాలి?
నీళ్లను తక్కువగా తాగితే మీ మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటుంది. అలాగే మూత్రం దుర్వాసన వస్తుంది. మూత్ర విసర్జన రోజుకు 4 - 7 సార్లు కంటే తక్కువగా ఉంటుంది.