Facts: ట్యాబ్లెట్స్ కవర్ వెనకాల ఉండే ఈ రెడ్ లైన్ అర్థం ఏంటో తెలుసా.?
ట్యాబ్లెట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. తయారీ మొదలు వాటి విక్రయం వరకు అన్నింటికి సంబంధించి ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు అమలు చేస్తాయి ఇందులో భాగంగానే ట్యాబ్లెట్స్ వెనకాల ఒక రెడ్ కలర్ లైన్‌ను ముద్రిస్తారు. ఇంతకీ ఈ లైన్ అసలు అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

tablets
ఒకప్పుడు చిన్న జలుబు అయినా వైద్యుడిని సంప్రదించి, వారి సూచనల మేరకే మెడిసిన్స్ ఉపయోగించే వారు. అయితే ప్రస్తుతం మారిన కాలంతో పాటు సమాచార విప్లవం ఎక్కువైంది. దీంతో ప్రజలు తామే స్వయంగా మెడిసిన్స్‌ను ఉపయోగిస్తున్నారు. అడుగుకో మెడికల్ షాప్స్ అందుబాటులోకి రావడంతో చాలా మంది స్వీయ చికిత్సవైపు ఆసక్తి చూపిస్తున్నారు. నేరుగా మెడికల్ షాప్‌కి వెళ్లి ట్యాబ్లెట్స్ కొనుగోలు చేస్తున్నారు.
tablets
అయితే డాక్టర్‌ను సంప్రదించకుండా, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైనా మందుల కోసం మెడికల్ షాప్‌కి వెళ్తే మందులను ఇవ్వకూడదని మీకు తెలుసా.? ముఖ్యంగా యాంటీ బయోటిక్స్ వంటి వాటిని వైద్యుల అనుమతి లేకుండా ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. ఈ విషయాన్ని వివరించేందుకే ట్యాబ్లెట్స కవర్‌పై కొన్ని కోడ్స్ ఉంటాయి. ఇందులో ఒకటి రెడ్ కలర్ లైన్.
మీరు జాగ్రత్తగా గమనిస్తే కొన్ని రకాల మెడిసిన్స్ కవర్‌పై రెడ్ కలర్ లైన్ ఉంటుంది. ఇవి పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్ వంటి ట్యాబ్లెట్స్ కవర్లపైనే ఉంటాయి. ఇలా ట్యాబ్లెట్స్ కవర్‌పై రెడ్ లైన్ ఉంటే.. ‘డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రను అమ్మకూడదు లేదా డాక్టర్ సలహా లేకుండా వాడకూడదు’. అందువల్ల, యాంటీబయాటిక్స్ దుర్వినియోగాన్ని నివారించడానికి, మందులపై రెడ్ లైన్ ఇస్తారు.
ఈ విషయాన్ని ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా తెలిపింది. అలాగే రెడ్ లైన్‌తోపాటు ట్యాబ్లెట్ కవర్స్‌పై Rx అని కూడా రాసి ఉంటుంది. ఇలాంటి ట్యాబ్లెట్స్ కూడా వైద్యుల సలహాల మేరకే ఉపయోగించాలి. కొన్ని రకాల మందులపై XRxని ఉంటుంది. వీటిని నేరుగా వైద్యులే రోగులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవి మెడికల్ స్టోర్స్‌లో లభించవచ్చు. కేవలం వైద్యుల వద్దే అందుబాటులో ఉంటాయి.