MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఇలా ఉంటే అర్శమొలలు పక్కాగా వస్తయ్.. జాగ్రత్త..

ఇలా ఉంటే అర్శమొలలు పక్కాగా వస్తయ్.. జాగ్రత్త..

ఆఫీసుల్లో లేదా వర్క్ ఫ్రం హోం చేసే కొంతమంది ఉద్యోగులు కూర్చున్న చోటు నుంచి ఇంచ్ కూడా కదలరు. ఇలా ఉంటే అర్శమొలలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త.. 

2 Min read
Mahesh Rajamoni
Published : Mar 26 2022, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112
piles

piles

ఒకే చోట కదలకుండా కూర్చోలేక.. సరిగ్గా నడవలేక.. లోపలి బాధ ఎలా చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకోవాలో తెలియని వారు చాలా మందే ఉన్నారు. వారి బాధకు కారణం మరేదో కాదు.. పైల్స్ లేదా అర్శమొలలే. ఈ అర్శమొలల బాధ మాటల్లో చెప్పలేనిది. 

212

మలద్వారం లోపలి భాగంలో మొలలు ఏర్పడతాయి. అవి రక్తంతో నిండి పిలకల్లా మలద్వారం గుండా బయటకు  పొడుచుకు వస్తాయి. ఈ మొలలనే హేమోరాయిడ్స్ అని వైద్య పరిభాషలో అంటారు. మరి ఇవి ఎందుకొస్తాయో.. ఇవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం పదండి. 

312

అర్శమొలలు ఇలా ఉన్నా వస్తాయి.. 

పని చేసే చోట లేదా ఇంట్లో ఒకే చోట కదలకుండా కూర్చునే వారికి ఈ మొలలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, మానసికంగా స్ట్రెస్ కు గురవడం వంటి వాటివల్ల కూడా ఇవి వస్తాయి. 
 

 

412

చాలా మంది నీళ్లను తాగడానికి అస్సలు ఇష్టపడరు. కానీ నీళ్లు తక్కువగా తాగడం వల్ల కూడా అర్శమొలలు వస్తాయి. 

512

జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రై చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటే కూడా మొలలు వస్తాయి. మలబద్దకం  సమస్య ఉన్న వారికి కూడా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. 

612
piles

piles

గట్టి గట్టిగా దగ్గే వారికి కూడా అర్శమొలలు వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు మలవిసర్జన చేసేటప్పుడు ఎక్కువగా ముక్కేవారు ఈ సమస్య బారిన పడే అవకాశం ఉంది. 

712

మలద్వారంలో నాళాలు చాలా సున్నితంగా ఉంటాయి. ఈ నాళాలపై ఒత్తిడి ఏర్పడితే అవి వాచి రక్తంతో నిండి పిలకలుగా మారుతాయి. అవి ముదిరితే.. అవి మలద్వారం గుండా  బయటకు పొడుచుకొస్తాయి. అంతేకాదు మలవిసర్జన సమయంలో అవి తీవ్రమైన నొప్పిని పుట్టిస్తాయి. ఒక్కో సారి ఏకంగా రక్తం కూడా కారుతుంది. 

812

జాగ్రత్తలు.. 
అర్శమొలల సమస్య ఉన్న వారు ఒంట్లో వేడిని పుట్టించే ఆహార పదార్థాలను అస్సలు తినకూడదు. ముఖ్యంగా పచ్చళ్లు, చింతపండు, కారం , ఊరగాయలు, మాసాలలకు దూరంగా ఉండాలి. 
 

912
vegetables

vegetables

ఈ వ్యాధి సోకిన వాళ్లు ఎక్కువగా కాయకూరలు, ఆకు కూరలు వంటి పీచు పదార్థం ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. మరీ ముఖ్యంగా నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. మొదటి నుంచి నీళ్లను ఎక్కువగా తాగే వారికి అర్శమొలలు వచ్చే అవకాశం ఉండదు. 

1012

లక్షణాలు.. 

మలవిసర్జన చేస్తున్నప్పుడు అర్శమొలలు బయటకు వచ్చి, విసర్జన తర్వాత మళ్లీ లోపలికి పోతాయి. ఇవి మొలలు మొదటి దశలో ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది.  

ఇక రెండో దశలోకి వచ్చే సరికి మొలలు ఎప్పుడు బయటే ఉంటాయి. అయితే వాటిని చేత్తో ముట్టుకుని పుష్ చేస్తేనే లోపలికి వెళ్లిపోతాయి. లేదంటే బయటే ఉంటాయి. 

1112
piles

piles

ఇక మూడు దశలోకి వచ్చే సరికి అర్శమొలలు పూర్తిగా బయటనే ఉంటాయి. చేత్తో నెట్టినా లోపలికి పోవు. కానీ స్టేజ్ లో వాటి నుంచి వచ్చే నొప్పి భరించలేనిదిగా ఉంటుంది. అవి ముదిరిపోతే సరిగ్గా నిలబడం, కూర్చోవడం, నడవడం కూడా కష్టమవుతుంది. 

1212

అంతేకాదు మలవిసర్జన చేసేటప్పుడు కొన్ని కొన్ని సార్లు రక్తం కారుతుంది. దీనివల్ల వారు నీరసంగా మారిపోతారు. దీనివల్ల రక్తహీనత సమస్య కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ మొలల కారణంగా క్యాన్సర్ బారిన కూడా పడొచ్చు. అర్శమొలలు వస్తే విసుగు, కోసం ఎక్కువగా వస్తదట. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Red Wine: చలికాలంలో ప్రతిరోజూ రెడ్ వైన్ తాగితే మంచిదా?
Recommended image2
Costly Non Veg: కిలో మాంసం ధ‌ర రూ. 31 ల‌క్ష‌లు.. ప్ర‌పంచంలో అత్యంత ఖ‌రీదైన మాంసాహారం ఇదే
Recommended image3
Chanakya Niti: ఈ నాలుగు విషయాల్లో మగవారు మహిళల ముందు ఎందుకూ పనికిరారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved