Weight loss: వ్యాయామానికి ముందు కొద్దిగా ఉప్పు తీసుకుంటే వేగంగా బరువు తగ్గుతారు తెలుసా..
Weight loss: బరువు తగ్గేందుకు సమతుల్య ఆహారం తీసుకుంటూ గంటల తరబడి వ్యాయామం, యోగా లాంటివి చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేసినా కొంతమంది బరువు అస్సలు తగ్గరు. అయితే వ్యాయామం చేసేముందు ఉప్పును తింటే సులువుగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

చెడు జీవన శైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు కారణంగా చాలా మంది వేగంగా బరువు పెరిగిపోయి.. ఊబకాయం బారిన పడుతున్నారు. ఈ ఊబకాయం ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. అయితే పెరుగుతున్న శరీర బరువును తగ్గించేందుకు వ్యాయామం, యోగా, సమతుల్య ఆహారం తీసుకుంటున్నా.. బరువు తగ్గని వారు ఎంతో మంది ఉన్నారు. అయితే బరువు తగ్గేందుకు వ్యాయామం చేసే వారు వ్యాయామం చేసే ముందు ఇలా చేస్తే చాలా తొందరగా బరువు తగ్గుతారు.
సరిగ్గా తినడం: వ్యాయామం చేయడంతో పాటుగా సమతుల్య ఆహారం తీసుకుంటేనే బరువు తగ్గే ప్రాసెస్ వేగవంతం అవుతుంది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ పోషకాహారం తీసుకోవాలి. అదరనపు కొవ్వులను కరిగించేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువును తగ్గించేందుకు ఏ ఆహారం సహాయపడుతుందో వాటినే తినాలి.
బరువు తగ్గడానికి ఉప్పు ఏ విధంగా సహాయపడుతుంది
వ్యాయామం చేయడానికి ముందు కొంతమొత్తంలో ఆహారం తీసుకుంటే వ్యాయామం మెరుగ్గా చేయగలుగుతారు. వ్యాయామం లేదా.. వాకింగ్ చేసే ముందు బాదం, అరటిపండ్లు లేదా ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాయామం చేయడానికి ముందు ఉప్పు కంటెంట్ ఎక్కువగా ఉండే చిరుతిళ్లను తింటే మీరు వేగంగా బరువు తగ్గుతారన్న సంగతి మీకు తెలుసా.? అవును ఉప్పు తీసుకోవడం వల్ల మీ శరీరానికి శక్తి లభిస్తుంది. దీంతో మీరు అంత తొందరగా అలసిపోరు. వ్యాయామానికి ముందు ఉప్పు తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
శరీరం హైడ్రేట్ గా ఉంటుంది
వ్యాయామానికి ముందు ఉప్పును తీసుకోవడం వల్ల మీరు డీహైడ్రేషన్ బారిన పడరు. ఎందుకంటే ఇది ఉప్పు నీటిని నిల్వకు సహాయపడుతుంది. ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రం, చెమట, ఇతర ద్రవాల ద్వారా కోల్పోయిన వాటిని భర్తీ చేయొచ్చు. శారీరక ద్రవాలను సమతుల్యంగా ఉంచుతుంది.
రక్తప్రవాహాన్ని పెంచుతుంది
వ్యాయామం చేస్తున్నప్పుడు మీరు తాగే నీటికి ఉప్పును జోడించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది శరీర రక్తప్రవాహాన్ని పెంచుతుంది. వ్యాయామానికి ముందు ఉప్పును తీసుకోవడం వల్ల వ్యాయామానికి కావాల్సిన ఎక్కువ శక్తిని, తక్కువగా శ్రమించడానికి సహాయపడుతుంది.
కండరాల తిమ్మరిని నివారిస్తుంది
వ్యాయామం చేస్తున్నప్పుడు రక్తప్రవాహం బాగా పెరుగుతుంది. దీంతో కండరాల తిమ్మిరి సమస్య తలెత్తుతుంది. కీళ్ల నొప్పులు కూడా వస్తాయి. సాధారణంగా శరీరానికి సరిపడా ఉప్పు అందకపోవడం, బాడీ డీహైడ్రేషన్ వంటి కారణాల వల్ల ఈ సమస్యలు తలెత్తుతాయి. దీనివల్ల నరాల టెర్మినల్స్ పై ఒత్తిడి ఏర్పడుతుంది. దీనివల్లే నొప్పి పడుతుంది.