Weight Loss Tips: డార్క్ చాక్లెట్ ను ఇలా తింటే ఫాస్ట్ గా బరువు తగ్గుతారు..
Weight Loss Tips: డార్క్ చాక్లెట్స్ మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. ఓవర్ వెయిట్ ను కూడా సులువుగా తగ్గిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
చాలా మందికి డార్క్ చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అందుకే సమయం దొరికినప్పుడల్లా తింటుంటారు. నిజానికి ఇతర చాక్లెట్ల కంటే డార్క్ చాక్లెట్స్ యే ఆరోగ్యానికి మంచిది. ఇది మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు ఇవి ఎఫెక్టీవ్ స్ట్రెస్ రిలీవర్స్ కూడా. దీనిలో ఉండే కోకో కంటెంట్ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే బరువు తగ్గాలనుకునే వారికి డార్క్ చాక్లెట్ మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిలో పుష్కలంగా కోకో ఉంటుంది. గ్లూకోజ్, పాల ఘనపదార్థాలు అసలే ఉండవు. అసలు డార్క్ చాక్లెట్లు బరువును ఎలా తగ్గిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆహార కోరికలను తగ్గిస్తాయి
డార్క్ చాక్లెట్లను తినడం వల్ల చక్కెర పదార్థాలను, ఇతర ఆహారాలను తీసుకోవాలన్న కోరికలను తగ్గుతాయి. డార్క్ చాక్లెట్ రెండు పీసెస్ ను తిన్నా కోరికలు తగ్గుతాయట. ఎందుకంటే ఇది గ్రెలిన్ అనే హార్మోన్ ఉత్పత్తిని నియంత్రిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది..
డార్క్ చాక్లెట్‌లో ఫ్లేవనోల్స్ అనే మొక్కల ఆధారిత పోషకాలుంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. అంతేకాదు ఇది కొవ్వు వేగంగా తగ్గడానికి దారితీస్తుంది. అలా అని దీన్ని ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీన్ని మోతాదులో తీసుకుంటునే బరువు తగ్గడంతో పాటుగా.. ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
డార్క్ చాక్లెట్ ఆకలిని తగ్గిస్తుంది
డార్క్ చాక్లెట్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది ఎక్కువ సేపు కడుపును నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఆకలి కోరికలను కూడా తగ్గిస్తుంది. 3.5 ఔన్సుల బరువున్న డార్క్ చాక్లెట్ బార్ లో 70 శాతం ఫైబర్ ఉంటుంది. ఓట్ మీల్, బ్రోకలి వంటి ఆహారాల్లో కూడా ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. మిమ్మల్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచే స్వీట్లలో డార్క్ చాక్లెట్ ఉత్తమమైనది.
ఒత్తిడిని తగ్గిస్తుంది
ఒత్తిడి కారణంగా కూడా విపరీతంగా బరువు పెరిగిపోతుంటారు. ఎందుకంటే పెరిగిన ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలను పెంచుతుంది. దీంతో మీరు భావోద్వేగాలను నియంత్రణలో ఉంచుకోవడానికి ఎక్కువ మొత్తంలో తినడం ప్రారంభిస్తారు. ఇలాంటి సమయంలో డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల మెదడులోపల ఎండార్ఫిన్లు, సెరోటోనిన్ లు రిలీజ్ అవుతాయి. దీంతో మీ మనస్సు ప్రశాంతంగా మారుతుంది. శరీరానికి విశ్రాంతినిస్తుంది.
మంటను తగ్గిస్తుంది
శరీరం వాపుకు గురైతే.. సెల్యులార్ స్థాయికి ఆటంకం ఏర్పడుతుంది. ఇది దీర్ఘకాలం పాటు ఉంటే గుండె జబ్బులు, క్యాన్సర్, డయాబెటీస్ వంటి ప్రమాదకరమైన రోగాలొచ్చే అవకాశం ఉంది. అంతేకాదు జీవక్రియ పనితీరు కూడా దెబ్బతింటుంది. అయితే డార్క్ చాక్లెట్ లో ఉండే ఫ్లేవనోల్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీర వాపును తగ్గించడానికి సహాయపడతాయి.
డార్క్ చాక్లెట్లు వ్యాయామం చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తాయి
డార్క్ చాక్లెట్లను తినడం వల్ల శరీరం శక్తివంతంగా తయారవుతుంది. ఇది మిమ్మల్ని చురుగ్గా చేస్తుంది. దీంతో మీరు తక్కువగా అలసిపోతారు. వ్యాయామం చేసిన తర్వాత డార్క్ చాక్లెట్ ను తినడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. ఇవి మిమ్మల్ని వేగంగా బరువు తగ్గేలా ప్రేరేపిస్తాయి.