Beauty Tips: అందమైన మెరిసే ముఖం కోసం పుదీనా ఫేస్ ఫ్యాక్!
Beauty Tips: పుదీనాలో ఉండే ఔషధ గుణాలు గురించి మనందరికీ తెలిసిందే. అది ఆరోగ్యానికే కాదు అందానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అందమైన మెరిసే ముఖం కోసం పుదీనా ని ఎలా ఉపయోగించవచ్చో ఇక్కడ చూద్దాం.
మినరల్స్, విటమిన్ సి పుష్కలంగా ఉండే పుదీనా ఫేస్ ప్యాక్ చర్మానికి యాంటీసెప్టిక్ అలాగే నేచురల్ గా పనిచేస్తుంది. ఇది మొటిమలు కాలిన గాయాలు మరియు మచ్చలు కి మంచి ఔషధం. వర్షాకాలంలో మొటిమలు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇది జిడ్డుచర్మంపై ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
అలాంటివారు పుదీనా ఆకులను మెత్తగా రుబ్బుకొని, ఒక స్పూన్ పుదీనా ఆకుల పేస్టులో ఒక స్పూన్ ముల్తానీ మట్టి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయండి. దీనివలన మొటిమల సమస్య నుంచి బయటపడవచ్చు.
అలాగే గ్లోయింగ్ స్కిన్ కోసం పుదీనాతో చేసే మరొక ఫేస్ ప్యాక్ ఇది. ఇందుకోసం ఒక గిన్నె పాలలో రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్,అర టేబుల్ స్పూన్ పుదీనా ఆకుల చూర్ణం, అలాగే రెండు మూడు స్పూన్ల దోసకాయ రసం కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ముఖానికి వృత్తాకార కదలికలలో మసాజ్ చేయండి.
కాసేపు ఆగిన తర్వాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. ఇది చర్మానికి మంచి రంగుని, తక్షణ తాజాదనాన్ని తీసుకువస్తుంది. అలాగే ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు మొఖం కమలిపోయినట్టుగా కనిపిస్తుంది. దీనిని సన్ బర్న్ అంటారు. దీనిని నుంచే తక్షణమే ఉపశమనం పొందాలంటే..
కొన్ని పుదీనా ఆకులని తీసుకొని వాటిని చూర్ణం చేయండి. ఈ చూర్ణానికి కలబందని జోడించండి. ఈ మిశ్రమాన్ని బాగా కలిపి ఫేస్ ప్యాక్ వేసుకున్నట్లయితే వడదెబ్బ నుంచి వెంటనే రిలాక్స్ అవుతారు. అలాగే ముఖం డిహైడ్రేట్ అయినట్లుగా అనిపిస్తే కొన్ని పుదీనా ఆకులలో కొన్ని చుక్కల రోజు వాటర్ కలిపి చూర్ణం చేసుకోండి.
ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తరువాత చల్లని నీటితో కడిగేయండి. దీనివలన మొహం డిహైడ్రేషన్ నుంచి తప్పించుకోవడమే కాకుండా అనేక ఇన్ఫెక్షన్లను ఎదుర్కోవటానికి కూడా సిద్ధంగా ఉంటుంది.