Vegetable Side Effects: ఈ కూరగాయలతో జర జాగ్రత్త..
Vegetable Side Effects: కూరగాయల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. అందుకే ప్రతిరోజూ ఎన్నో రకాల కూరగాయలను తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల కూరగాయలను తినేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ రోజుల్లో గుండె జబ్బులు, షుగర్ వ్యాధి, అధిక బరువు, అధిక రక్తపోటు, స్థూలకాయం వంటి సమస్యలు సర్వసాధారణం అయిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో పోషకాలు పుష్కలంగా ఉండే కూరగాయలను తినడం సేఫ్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే వీటిలో ఉండే ఎన్నో పోషకాలు ఎన్నో రకాల జబ్బులను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి.
నిజానికి మాంసాహారాలకంటే కూరగాయలే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ఈ కూరగాయలను తినేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏయే కూరగాయలను తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
కాలీఫ్లవర్
కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన ఫుడ్. దీనిని ఫాస్ట్ ఫుడ్ లో కూడా ఉపయోగిస్తుంటారు. దీనిలో ఎన్నో ఔషదగుణాలు కూడా ఉంటాయి. అయినప్పటికీ.. ఈ కూరగాయలను తింటే కొంతమందికి గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. దీనిలో ఎన్నో రకాల పోషకాలున్నా.. ఇది జీర్ణ సమస్యలను తెచ్చిపెడుతుంది. అందుకే దీన్ని ఎప్పుడూ పచ్చిగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తిన్నారో కడుపు నొప్పి వస్తుంది జాగ్రత్త..
పుట్టగొడుగులు
పుట్టగొడుగులు చాలా రేటుంటాయి. అంతేకాదు దీని ప్రయోజనాలు కూడా ఎక్కువే. దీనిలో విటమిన్ డి పుష్కలంగా ఉంటుంది. అయినప్పటికీ ఇవి కొందరికి పడవు. ముఖ్యంగా అలెర్జీ సమస్యతో బాధపడేవారు ఈ పుట్టగొడుగుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి అలెర్జీ సమస్యను మరింత ఎక్కువ చేస్తాయి. అంతేకాదు దీన్ని తినడం వల్ల చర్మ సమస్యలు కూడా వస్తాయి.
క్యారెట్లు
క్యారెట్ క్యారెట్లలో విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. అందుకే వండుకుని తినడం కంటే.. పచ్చిగానే తినాలని డాక్టర్లు చెబుతుంటారు. ఆరోగ్యానికి మంచివే అయినా వీటిని ఎక్కువ మొత్తంలో తినడం ఏ మాత్రం మంచివి కావు. ఎందుకంటే దీనిలో ఎక్కువ మొత్తంలో ఉండే కెరోటిన్ చర్మ రంగును పసుసు రంగులోకి మారుస్తుంది. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదు.
బీట్ రూట్
బీట్ రూట్ లో ఎన్నో పోషకాలుంటాయి. దీన్ని జ్యూస్ గా లేదా సలాడ్ గా చేసుకుని తీసుకున్నా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలాగని వీటిని ఎక్కువగా తినకూడదు. అలా తింటే మీ చర్మ రంగు ఎరుపు లేదా గులాబీ రంగులోకి మారిపోతుంది. ఇది అంత ప్రమాదకరం కానప్పటికీ.. వీటిని మాత్రం మోతాదుకు మించి తినకపోవడమే ఉత్తమమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.