- Home
- Life
- Valentine Day 2022: వాస్తు ప్రకారం .. వాలెంటైన్స్ డే నాడు ఇలాంటి గిఫ్టులను అస్సలు ఇవ్వకూడదు..
Valentine Day 2022: వాస్తు ప్రకారం .. వాలెంటైన్స్ డే నాడు ఇలాంటి గిఫ్టులను అస్సలు ఇవ్వకూడదు..
Valentine Day 2022: ప్రేమికులు ఎంతగానో ఎదురు చూస్తున్న అందమైన రోజు రానే వచ్చింది. ఇక ఈ రోజు ప్రేమికులు అందమైన గిఫ్టులను ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే వాస్తు ప్రకారం.. ప్రేమికులు ఈ ఐదు రకాల బహుమతులను ప్రజెంట్ చేసుకోకూడదట. ఎందుకంటే..

Valentine Day 2022: వాలెంటైన్స్ డే రాకతో ప్రేమికుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చి చేరింది. అంతేకాదు ఈ రోజు ప్రేమికులు ఒకరికి ఒకరు ప్రత్యేకమైన గిఫ్టులను ఇచ్చిపుచ్చుకుంటారు. ఎందుంటే ఆ సమయంలో వారి ముఖంలో కలినిపించే ఆనందం వర్ణించలేని. ఎన్ని కోట్లిచ్చినా కొనలేనిది. మనసుకు నచ్చిన వాళ్లు ప్రజెంట్ చేసింది చిన్న బహుమతైనా సరే ఎంతో సంతోషానిస్తుంది. అందుకే తమ లవర్లకు ఏది ఇష్టమో కనుక్కొని మరీ ఇస్తుంటారు. ఈ ఆనంద క్షణాల కోసం ఎన్నో రోజులుగా వేచి చూస్తూ ఉంటారు. మీకు తెలుసా.. మన మనసులోని భావాలను తెలపడానికి కూడా ఈ బహుమతులు ఎంతగానో సాయపడతాయి.
అయితే వాస్తు ప్రకారం ఈ వాలెంటైన్స్ రోజున లవర్లకు, భాగస్వాములకు కొన్ని రకాల గిఫ్టులను అస్సలు ఇవ్వకూడదట. ఎందుకంటే అవి ప్రజెంట్ చేయడం వల్ల మీకు ప్రతికూల ఫలితాలు వస్తాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్లాక్ డ్రెసెస్: వాస్తు శాస్త్రం ప్రకారం.. బ్లాక్ కలర్ బట్టలు అంతగా మంచివి కావు. ఎందుకంటే నలుపు రంగు దుస్తులను బహుమతిగా ఇవ్వడం మూలంగా మీకు బాధ, దు:ఖమే కలుగుతుంది. తప్ప ఆనందం, సంతోషం రావు. అందుకే ఈ రోజున బ్లాక్ కలర్ దుస్తులను గిఫ్ట్ గా ఇవ్వకండి.
మునిగిపోతున్న ఓడ: మునిగిపోతున్న ఓడ లాంటి విగ్రహం లేదా, ఫోటోలను గిఫ్టులను ఇవ్వాలనుకుంటే వెంటనే దాన్ని విరమించుకోండి. ఎందుకంటే వాస్తు శాస్త్రం ప్రకారం ఇలాంటి బహుమతులను ఇచ్చిపుచ్చుకోకూడదు. ఎదుకంటే ఇవి అశుభాన్ని కలిగిస్తాయి. అంతేకాదు.. ఇలాంటి గిఫ్టును తీసుకుంటే మీరు ఆర్థికంగా నష్టపోవాల్సి ఉంటుంది.
Hand kerchiefs: చేతిరుమాలు (Handkerchiefs) ను ఎప్పుడూ కూడా బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకో తెలుసా.. Hand kerchiefs ను బహుమతిగా ఇస్తే ఇది దు:ఖానికి దారితీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ హ్యాండ్ ఖర్చీఫ్ లను ఇచ్చుకోవడం వల్లే భార్యా భర్తల మధ్యన కొట్లాటలు జరుగుతాయట.
షూష్: ఈ వాలెంటైన్ రోజున చాలా మంది అమ్మాయిలు తమ బాయ్ ఫ్రెండ్స్ కు మంచి షూష్ ను బహుమతిగా ఇవ్వాలనకుంటారు. కానీ అలా అస్సలు చేయకండి. ఎందుకంటే ఈ షూష్ ను విభజనకు సూచికగా అనుకుంటారు. ఇవి ఇవ్వడం వల్ల మీ రిలేషన్ షిప్ బలహీనంగా మారుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
వాచ్: వాస్తు శాస్త్రం ప్రకారం.. చేతి గడియారాలను బహుమతిగా అస్సలు ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ గడియారం జీవిత పురోగతిని నిలిపేస్తుందని వాస్తు చెబుతోంది. కాబట్టి ఈ వాచ్ లకు బదులుగా వేరే వాటిని ప్రజెంట్ చేయడం మంచిది.