MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకం ఆత్మహత్య ఆలోచనను పెంచుతుంది: తాజా అధ్యయనం

మితిమీరిన స్మార్ట్ ఫోన్ వాడకం ఆత్మహత్య ఆలోచనను పెంచుతుంది: తాజా అధ్యయనం

ఒక పూట తిండి లేకుండా నైనా ఉంటారేమో గానీ.. క్షణకాలం పాటు మొబైట్ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు ప్రస్తుత యువత. యువతే కాదు.. అన్ని వయసుల వారు కూడా ఇలాగే తయారయ్యారు. కానీ స్మార్ట్ ఫోన్లను మితిమీరి వాడితే మాత్రం ఎన్నో దుష్ఫ్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని తాజా అధ్యయనం వెల్లడిస్తోంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 17 2022, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల యుగం నడుస్తోంది. ఇది మనుషులను ఎంతలా ప్రభావితం చేసిందంటే.. రోజంత ఎలాంటి పనులు చేసుకోనియకుండా.. మనుషులకు మనుషులకు మాటలను దూరం చేసేంతలా మర్చేసింది.. అంతేకాదండోయ్ ఒకే ఇంట్లో ఉన్నా..  ఇద్దరి వ్యక్తుల మధ్యన మాటలే కరువయ్యేంతలా మనుషులను ఏమార్చేసింది. హమ్ ఫోన్ మాయజాలం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.  
 

29

అందులోనూ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ లేని క్షణ కాలం కూడా ఒక యుగం లాగే గడుపుతున్నారు. గంటల తరబడి.. కాదు కాదు రోజుల తరబడి ఫోన్లలో గడపడానికి ఏ మాత్రం బోర్ గా ఫీలవనివారున్నారు. అయినా ఈ రోజుల్లో స్మార్ట్ నిత్యవసర, అత్యవసర వస్తువుగా మారింది. స్మార్ట్ ఫోన్ లేని జీవితాన్ని ఊహించుకోవడం కష్టమేమో. 

39

నిజానికి స్మార్ట్ ఫోన్ మనకు ఎన్నో విధాల సహాయపుతుంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ స్మార్ట్ ఫోన్ల వాడకం దారుణంగా పెరిగిపోయింది. ఫోన్లను మితిమీరి వాడటం వల్ల మన  మనస్సు ఏ విధంగా ప్రభావితం అవుతుందో తాజా అధ్యయనం వెల్లడించింది. 

49

ఇటీవల సేపియన్ ల్యాబ్స్ ఒక కొత్త నివేదికను విడుదల చేసింది. ఈ నివేధికలో భయంకరమైన విషయాలు వెల్లడయ్యాయి. అవేంటంటే.. 

59

సేపియన్ ల్యాబ్స్ నివేదిక: సేపియన్ ల్యాబ్స్ ఇటీవల నిర్వహించిన ఒక పరిశోధనా నివేదిక ఇప్పుడు వైరల్ గా మారింది. 18 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న యువత మానసిక ఆరోగ్యం క్షీణించడానికి స్మార్ట్ ఫోన్ల వాడకం ఒక ప్రధాన కారణమని పరిశోధన వెల్లడించింది. 

69

ఈ నివేదిక ప్రకారం.. ఒక 18 ఏండ్ల యువకుడు ఇంటర్నెట్ ను ఉపయోగించనప్పుడు.. ఈ వ్యక్తి స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతరులతో 15,000 నుంచి 18,000 గంటలు గడిపేవాడు. కానీ మొబైల్ వాడకం తరువాత.. ఈ సమయం కాస్త 1,500 నుంచి 5,000 గంటలకు తగ్గింది.

79

ఆత్మహత్య ఆలోచనలో పెరుగుదల: సేపియన్ ల్యాబ్స్ యొక్క ఒక నివేదిక భయానకరమైన నిజాన్ని వెల్లడించింది. ఎక్కువ స్మార్ట్ ఫోన్లను ఉపయోగించే వారు ఆత్మహత్యల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ కారణంగా ప్రజలలో స్మార్ట్ ఫోన్ల వాడకం చాలా వరకు పెరిగిందని తారా త్యాగరాజన్ చెప్పారు.

89

స్మార్ట్ ఫోన్ల వాడకం చాలా ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలు ఒకరితో ఒకరు మాట్లాడటం మర్చిపోయారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఒకరినొకరు కలుసుకోలేనప్పుడు, వారు ముఖ కవళికలను అర్థం చేసుకోలేరు. శరీర కదళికలను కూడా అర్థం చేసుకోలేరు. అలాగే ప్రజల భావోద్వేగాలపై కూడా దృష్టి పెట్టలేరు. దీంతో పాటుగా నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా పరిష్కరించుకోలేరు. ఈ కారణంగానే వీళ్లు సమాజంతో అనుసంధానం కాలేకపోతున్నారని, ఆ తర్వాత ఆత్మహత్య వంటి ఆలోచనలు వారి మదిలో మెదులుతాయని నివేదిక తెలిపింది.
 

99


ఈ పరిశోధన మొత్తం 34 దేశాల నుంచి డేటాను సేకరించింది. ప్రజలు స్మార్ట్ ఫోన్లపై విపరీతంగా ఆధారపడటం 2010 నుంచి ప్రారంభమైందని కనుగొన్నారు. అందుకే మితిమీరిన స్మార్ట్ ఫోన్ల వాడకం వద్దని ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Fridge Placement: ఫ్రిజ్‌కి, గోడకి మధ్య గ్యాప్ ఎంత ఉంటే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది?
Recommended image2
Real Love story: ఆమె నాకు జీవితాంతం గుర్తుండి పోయేలా బుద్ధి చెప్పింది
Recommended image3
Summer Drinks: ఇవి తాగితే చాలు..వేసవి అంతా కూల్ కూల్‍గా ఉండొచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved