MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఇలా చేస్తే.. బాత్రూమ్ టైల్స్ మురికి పోయి తెల్లగా మెరుస్తాయి

ఇలా చేస్తే.. బాత్రూమ్ టైల్స్ మురికి పోయి తెల్లగా మెరుస్తాయి

బాత్రూమ్ టైల్స్ ను ఎంత క్లీన్ చేసినా.. వాటికి మురికి పడుతూనే ఉంటుంది. వీటిని క్లీన్ చేయడం ఆడవాళ్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. అయితే కొన్నింటితో మురికి టైల్స్ ను కూడా కొత్తవాటిలా మెరిసేలా చేయొచ్చు. అదెలాగంటే? 

3 Min read
Author : Shivaleela Rajamoni
Published : Oct 23 2024, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బాత్రూమ్ టైల్స్ ను క్లీన్ చేయడం అంత ఈజీ పనైతే కాదు. ముఖ్యంగా ఈ టైల్స్ కు దుమ్ము, ధూళితో  మొండిమరకలు ఏర్పడతాయి. ఈ మరకలను పోగొట్టడం అంత సులువైన పని కాదు. కానీ చాలా మంది ఆడవాళ్లు ఇళ్లును క్లీన్ చేసినట్టుగా బాత్ రూం ను కూడా క్లీన్ చేస్తుంటారు. కానీ దీనివల్ల బాత్ రూం టైల్స్ అస్సలు క్లీన్ కావు. ఎక్కడి దుమ్ము అక్కడే ఉంటుంది. 
 

25

ఏదేమైనా ఇంట్లోని వంటగదిని, బాత్ రూం క్లీన్ చేయడం మాత్రం చాలా కష్టం. అయితే బాత్ రూం ని శుభ్రపరచడానికి మార్కెట్లో ఎన్నో కెమికల్ వాష్లు ఉంటాయి. కానీ వీటిని వాడితే మీ ఆరోగ్యం దెబ్బతినడంతో పాటుగా పర్యావరణానికి హాని కలుగుతుంది. అందుకే ఎలాంటి రసాయనాలు లేని వాటిని ఉపయోగించి బాత్ రూం టైల్స్ ను ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

వెనిగర్, బేకింగ్ సోడా

వెనిగర్, బేకింగ్ సోడాలు ఎలాంటి మొండి మరకలనైనా ఇట్టే పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ఎంతో ప్రాచుర్యం పొందిన నేచురల్ స్టెయిన్ రిమూవర్లలో వెనిగర్ ఒకటి. దీనిలో ఆమ్ల లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి బాత్ రూం టైల్స్ం కు అంటుకున్న దుమ్మును, దూళిని, మురికిని, సబ్బు మరకలను పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది.

ఇందుకోసం ఒక సీసాలో వైట్ వెనిగర్ ను, నీళ్లను సమానంగా భాగాలుగా తీసుకుని ఒకదాంట్లో మిక్స్ చేసి కలపండి. ఈ మిశ్రమాన్ని బాత్ రూం టైల్స్ పై చల్లండి.  కొద్ది సేపటి తర్వాత బ్రష్ లేదా స్పాంజ్ తో తుడిచేస్తే మరకలు సులువుగా పోతాయి. కానీ టైల్స్ ను దీన్ని చల్లిన తర్వాత కొద్దిసేపు టైల్స్ ను నాననివ్వాలి. అయితే చాలా మొండి మరకలను పోగొట్టడానికి వెనిగర్ ద్రావణాన్ని పిచికారీ చేయడానికి ముందు టైల్స్పై బేకింగ్ సోడాను చల్లండి. 

35

నిమ్మరసం:

నిమ్మరసంలో ఎన్నో లక్షణాలుంటాయి. మీకు తెలుసా? నిమ్మకాయ మరొక సహజ క్లీనర్. ఇది ఎంతటి మొండి మరకలనైనా చాలా ఈజీగా పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది మీ బాత్ రూంలో తాజా సువాసనను నింపడానికి కూడా సహాయపడుతుంది.

ఇందుకోసం నిమ్మకాయను సగానికి కట్ చేసి నేరుగా టైల్స్ పై పడిన మరకలపై రుద్దండి. నిమ్మకాయలోని సిట్రిక్ యాసిడ్ మురికిని తొలగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే స్క్రబ్బింగ్ ను కూడా సులువు చేస్తుంది. నిమ్మకాయను మొండి మరకలపై రుద్దే ముందే నిమ్మకాయపై కొంచెం ఉప్పు వేయండి.

45

హైడ్రోజన్ పెరాక్సైడ్

హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది ఒక సహజ క్రిమిసంహారక మందు. ఇది బాత్ రూం టైల్స్ పై ఉన్న మురికిని పోగొట్టడంలో చాలా పవర్ ఫుల్ గా పనిచేస్తుంది. అంతేకాదు ఇది బాత్ రూంలో ఉన్న క్రిమి కీటకాలను కూడా చంపుతుంది.

ఇందుకోసం కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ ను తీసుకుని స్పాంజ్ లేదా గుడ్డకు అంటించుకుని టైల్స్ ను తుడవండి. ఇది ఫంగల్, సబ్బు మురికిని తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మొండి మరకల కోసం, బేకింగ్ సోడాలో హైడ్రోజన్ పెరాక్సైడ్ మిక్స్ చేసి పేస్ట్ లా చేయండి. దీన్ని టైల్స్ పై ఉన్న మరకలపై రుద్దండి. 
 

55

హెర్బల్ ఆయిల్స్

మూలికా నూనెలను వాడటం వల్ల బాత్ రూం తాజా వాసన రావడమే కాదు.. బాత్ రూం టైల్స్ పై ఉన్న మొండి మరకలు కూడా ఇట్టే పోతాయి. ఈ హెర్బల్ ఆయిల్స్ లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలుంటాయి. ఇవి బాత్రూమ్ టైల్స్ ను శుభ్రం చేయడానికే కాకుండా బాత్ రూంలో ఉన్న క్రిమి కీటకాలను చంపడానికి కూడా సహాయపడతాయి. 

ఇందుకోసం టీ ట్రీ ఆయిల్ లేదా లావెండర్ ఆయిల్ వంటి మీకు ఇష్టమైన ముఖ్యమైన నూనెలను కొన్నిచుక్కలు తీసుకుని నీళ్లు, వెనిగర్ లో కలపండి. దీన్ని దీన్ని టైల్స్ పై స్ప్రే చేసి గుడ్డ లేదా స్పాంజ్ తో తుడవండి. 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
హైదరాబాద్ మామిడి పళ్లలో ఎంత విషం ఉంటుందో తెలుసా..? తిన్నారో అంతే సంగతి..
Recommended image2
Dandruff: చుండ్రుతో విసిగిపోయారా? ఈ చిట్కాలతో ఈజీగా వదిలించుకోండి
Recommended image3
Mango Recipe: శ్రీకాకుళం స్టైల్ మామిడి ముక్కలు, ఇలా చేస్తే ఏళ్ల పాటు పాడవు, రుచి కూడా డబుల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved