MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • అందమైన ముఖానికి టమాటా.. దీన్ని ఎలా ఉపయోగించాలంటే?

అందమైన ముఖానికి టమాటా.. దీన్ని ఎలా ఉపయోగించాలంటే?

వంటింట్లో ఉండే టమాటాల్లో ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. టమాటాలు చర్మాన్ని అందంగా, మృదువుగా మారుస్తాయి. ఇందుకోసం టమాటాలను  ఎలా ఉపయోగించాలంటే?  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 20 2023, 03:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టమోటాలు పోషణనకు శక్తి కేంద్రాలు. వీటిలో ఎన్నో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. టమాటాల్లో విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి పోషణ అందుతుంది. టమోటాలను రెగ్యులర్ క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ కోసం ఉపయోగించొచ్చు. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రతి సీజన్ లో లభించే టమోటా జ్యూస్ ను ముఖానికి అప్లై చేయడం వల్ల  ఎండాకాలంలో ముఖం అందంగా మెరిసిపోతుంది. ఇందుకోసం టమాటాలను ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27

టమోటాల్లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సెస్ ప్రకారం.. దీనిలో ఉండే లైకోపీన్ శరీరాన్ని ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి టమోటాలు బాగా సహాయపడతాయి. వీటిని తినడం వల్ల శరీరంలో విటమిన్లు, కాల్షియం, ఖనిజాల లోపం తీరుతుంది. విటమిన్ సి కలిగిన టమోటాలు చర్మాన్ని ఎన్నో రకాల సమస్యల నుంచి రక్షించడానికి సహాయపడతాయి. ఇందుకోసం టమాటాలను ఎలా ఉపయోగించాలంటే..

37
Tomato Face Pack Benefit

Tomato Face Pack Benefit

పొడి చర్మాన్ని మృదువుగా మార్చుతుంది

జర్నల్ ఆఫ్ డెర్మటాలజికల్ సైన్స్ ప్రకారం.. శరీరంలో పొటాషియం లేకపోవడం వల్ల చర్మం పొడి బారుతుంది. అలాగే తామర సమస్య కూడా వస్తుంది. అయితే టమోటాలు ఈ సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. టమాటాలు చర్మాన్ని పొడిబారకుండా కాపాడతాయి. చర్మాన్ని తేమగా ఉంచుతాయి. 

ఇందుకోసం 1 టీస్పూన్ టమోటా జ్యూస్ లో తేనెను మిక్స్ చేయాలి. ఈ ద్రావణాన్ని బ్రష్ తో ముఖానికి అప్లై చేయాలి. ఇది చర్మాన్ని మృదువుగా మార్చడంతో పాటుగా నేచురల్ గ్లోని మెయింటైన్ చేస్తుంది. మీరు దీన్ని వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగించొచ్చు.
 

47

యూవీ కిరణాల నుంచి రక్షణ

జర్నల్ ఆఫ్ ఫోటోకెమికల్ అండ్ ఫోటోబయోలాజికల్ సైన్సెస్ ప్రకారం.. లైకోపీన్ ఎక్కువగా ఉండే టమోటాలను ఉపయోగించడం వల్ల యూవీ కిరణాల హానికరమైన ప్రభావాలను నివారించొచ్చు. అంతేకాకుండా టమోటాల్లో ఉండే గుణాలు ఫ్రీరాడికల్స్ తో పోరాడేందుకు ఉపయోగపడతాయి.

సూర్యుని కిరణాల వల్ల చర్మం దెబ్బతినే ప్రమాదం ఉంది. దీన్ని నివారించాలంటే టమోటా, కీరదోసకాయ రసాన్ని సమాన పరిమాణంలో తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. ఇది ఆరిన తర్వాత దూదితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దోసకాయలు, టమోటాలలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని టానింగ్, దద్దుర్లు, దురద నుంచి రక్షిస్తాయి.

57
tomato face pack

tomato face pack

బ్లాక్ హెడ్స్ నుంచి బయటపడటానికి

దీన్ని ముఖానికి అప్లై చేయాలంటే 2 టీస్పూన్ల బియ్యప్పిండిలో చిటికెడు పసుపును కలపాలి. ఆ తర్వాత టమోటా జ్యూస్ ను అవసరమైన విధంగా మిక్స్ చేసి చేయాలి.ఈ పేస్ట్ ను ముక్కు, కళ్ల చుట్టూ అప్లై చేయాలి. ఈ మాస్క్ ను ముఖానికి అప్లై చేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత ముఖం కడుక్కోవాలి. మచ్చలపై అప్లై చేయడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.
 

67
tomato

tomato

చర్మాన్ని మెరుగుపరచడానికి

యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే టమోటాలలో పెక్టిన్, ఫ్లేవనాయిడ్స్ వంటి చర్మాన్ని శుభ్రపరిచే లక్షణాలు ఉంటాయి. ఇది అకాల వృద్ధాప్య సంకేతాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. టమోటాలను అప్లై చేయడం వల్ల చర్మం ఎక్స్ఫోలియేట్ అవుతుంది.

ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల టొమాటో రసంలో అరటిపండు గుజ్జును కలపాలి. ఇప్పుడు అందులో ఒక టీస్పూన్ తేనెను కలపాలి. ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. దీంతో ముఖంపై ఉన్న మృతకణాలు బయటకు పోయి చర్మం యవ్వనంగా కనిపించడం మొదలవుతుంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల వృద్ధాప్య సంకేతాలు తగ్గిపోతాయి. 
 

77
<p>tomato</p>

<p>tomato</p>

మచ్చలను తొలగించడానికి

ముఖంపై మచ్చలను తొలగిపోవాలంటే 2 టీస్పూన్ల ఓట్స్ లో 1 టీస్పూన్ టమోటా గుజ్జును, పాలను కలపండి. దీనిలో చిటికెడు పసుపును కూడా కలపండి. పసుపులో ఉండే కర్కుమిన్ ఎలిమెంట్ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది. దీన్ని ముఖానికి అప్లై చేసిన తర్వాత 5 నుంచి 7 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కోవాలి. దీనివల్ల చర్మం ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Weight Loss: ఈ సూప్ తాగితే.. నెలరోజుల్లో బరువు తగ్గడం చాలా ఈజీ..!
Recommended image2
Fridge Placement: ఫ్రిజ్‌కి, గోడకి మధ్య గ్యాప్ ఎంత ఉంటే కరెంటు బిల్లు తక్కువ వస్తుంది?
Recommended image3
Real Love story: ఆమె నాకు జీవితాంతం గుర్తుండి పోయేలా బుద్ధి చెప్పింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved