మీ జీతం నుంచి ఖర్చు అవ్వకుండా, సేవింగ్ ఎలా చేయాలో తెలుసా?
ఇలా ఖర్చు చేసుకుంటూ వెళితే.. ఆర్థిక సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉంది. అందుకే కచ్చితంగా పొదుపు చేయాలి…
నెలంతా కష్టపడితే మనకు జీతం వస్తుంది. ఇలా నెల మొదట్లో జీతం వస్తే.. నెలాఖరు వరకు కూడా ఉండదు. వచ్చిన జీతం ఎలా ఖర్చు అయిపోతుందో కూడా తెలీదు. ఇలాంటి సందర్భంలోనే మనం ఎలాంటి సేవింగ్స్ చేయలేం. కానీ.. మనం కొన్ని మార్పులు చేసుకుంటే.. మన జీతం నుంచి ఖర్చలు తగ్గి.. సేవింగ్స్ పెరుగుతాయట. దాని కోసం మనం చేయాలో నిపుణుల సలహా తెలుసుకుందాం…
మనం మనకు వచ్చే జీతం నుంచి డబ్బును పొదుపు చేయాలి అనుకుంటే మనం కొన్ని విషయాలను అనుసరించాలట. మన జీవితంలో 50 శాతం రోజువారీ అవసరాలకు, 30 శాతం లైఫ్ స్టైల్ కి, మిగిలిన 20 శాతం పొదుపు కోసం కేటాయించాలట. ఓ సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. ఒక వ్యక్తికి ఎక్కువ డబ్బు ఉంటే.. ఎక్కువ ఖర్చు చేస్తాడట. వారి జీవన ప్రమాణాలు కూడా పెరుగుతాయట. వేడుకలు పెరిగిపోతాయి.. అదేవిధంగా ఖర్చులు కూా పెరిగిపోతాయట. ఇలా ఖర్చు చేసుకుంటూ వెళితే.. ఆర్థిక సంక్షోభం నెలకొనే ప్రమాదం ఉంది. అందుకే కచ్చితంగా పొదుపు చేయాలి…
1.బడ్జెట్ రూపొందించడం…
పొదుపు చేయాలంటే బడ్జెట్ చాలా ముఖ్యం. మన ఆదాయం, ఖర్చులను కచ్చితంగాా లెక్కించాలి. ఇంటి అద్దె, బిల్లులు, అప్పులు, నెలవారీ కిరాణ సామాగ్రి, వినోదం, కుటుంబ ఇతర ఖర్చులు ఇలా అన్నింటినీ ఒక లిస్ట్ చేయాలి. ఇప్పుడు మన జీతాన్ని బట్టి.. దేనికి ఎంత అవసరమో అంత మాత్రమే కేటాయించాలి. ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నాం.. ఎక్కడ తగ్గించొచ్చు.. లాంటివి బడ్జెట్ చేస్తే… ఖర్చులను కంట్రోల్ చేయవచ్చు. ఇది కరెక్ట్ గా ఫాలో అయితే.. డబ్బు సేవ్ చేసుకోవచ్చు.
2.అప్పు విషయంలో జాగ్రత్త..
ఈ లోకంలో అప్పు అనేది సర్వసాధారణమైన పదంగా మారింది. మీ అర్హతకు మించి రుణం తీసుకోవడం ఆర్థిక ఒత్తిడికి దారి తీస్తుంది. కాబట్టి వైద్యం, విద్య, అత్యవసర అవసరాల కోసం మాత్రమే రుణం తీసుకోండి. లోన్ మొత్తం మీ జీతంలో కొంత శాతాన్ని మించకుండా చూసుకోండి. రుణ చెల్లింపుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త రుణాలు తీసుకోవద్దు.
ఖర్చుల లెక్కింపు…
మనం రోజూ దేనికి ఖర్చు చేసాము, ఎంత ఖర్చు చేసాము అని లెక్కించండి. నెలాఖరులో మీరు దేనికి ఎక్కువ ఖర్చు చేశారో మీకు తెలుస్తుంది. అలాంటప్పుడు అనవసరమైన వాటిపై ఖర్చు చేస్తే తగ్గించుకోండి.
మొదట పొదుపు తరువాత ఖర్చు
జీతం పొందిన తర్వాత మొదట పొదుపు కోసం నిధులు కేటాయించండి. ఆ తర్వాత మీరు ఖర్చులు చేయడం ప్రారంభించవచ్చు. మీకు బ్యాంకులో RD, SIP ఉంటే అదనపు ప్రత్యేకం. పొదుపుపై దృష్టి పెట్టండి. అప్పుడు అనవసరమైన వాటిపై ఖర్చు చేయాలనే కోరికను తగ్గించుకోండి.