Muscle Pain: కండరాల నొప్పితో బాధపడుతున్నారా? వీటిని తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది..
Muscle Pain: మనం తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. కండరాల నొప్పులు ఉన్నవారు ఈ ఆహార పదార్థాలను తింటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

కండరాల నొప్పికి చాలా కారణాలు ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో ఈ నొప్పిని తగ్గించడానికి ఏమి తినాలి? ఏం తినకూడదు అన్న ప్రశ్న చాలా మందికి వస్తుంటుంది. అయితే ఈ నొప్పిని తగ్గించడానికి మీరు మీ ఆహారంలో కొన్ని మార్పులను చేసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. లేదంటే ఈ నొప్పి ఎప్పుడు ఉంటుంది.
ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు కండరాలను బలోపేతం చేస్తాయి. ఎందుకంటే ప్రోటీన్లు శరీరంలో కొత్త కణాలను ఉత్పత్తి చేస్తాయి. గుడ్డు (Egg), పాలు (Milk), పెరుగు (Yogurt), మొలకెత్తిన ధాన్యాలు (Sprouted grains) మొదలైన వాటిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వీటిని తింటే కండరాల నొప్పి క్రమ క్రమంగా తగ్గుతుంది.
ఈ రోజుల్లో కండరాల నొప్పి (Muscle Pain)ఒక సాధారణ సమస్యగా మారుతోంది. పని కారణంగా అలసిపోవడం, ఒత్తిడి వంటి సమస్యలు వస్తాయి. అలాగే శరీరంలో వివిధ భాగాల్లో నొప్పి కూడా మొదలవుతుంది. కొన్ని కొన్ని సార్లు.. ఈ నొప్పి ఎక్కువగా అవుతుంది. దీంతో పనిచేయడం కష్టంగా మారుతుంది. సరైన ఆహారం, శారీరక శ్రమతో దీనిని నయం చేసుకోవచ్చు. ఇలా చేసినా మీ కండరాలలో నొప్పి తగ్గకపోతే.. ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.
నూనెతో మసాజ్ చేయడం వల్ల కండరాల నొప్పి తగ్గుతుంది: వీటితో పాటుగా మీ కండరాల నొప్పిని తగ్గించడానికి కొన్ని రకాల నూనెలు కూడా సహాయపడతాయి. అవేంటంటే..
ఆవనూనెతో మసాజ్ చేయండి
ఆవనూనె (Mustard oil) కండరాలను కూడా సడలించగలదు. ఈ నూనెతో మర్దన చేస్తే కండరాల నొప్పి మటుమాయం అవుతుంది. వెల్లుల్లి రెబ్బలను ఆవనూనెలో వేస్తే కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే వెల్లుల్లి నూనె కూడా కండరాల నొప్పిని తగ్గిస్తుంది.
ఆవనూనెలో అజ్వైన్ : వీటితో పాటుగా ఆవనూనెలో వాము ( Ajwain)ను మిక్స్ చేసి నొప్పులకు మసాజ్ చేస్తే కూడా చక్కటి ఫలితం ఉంటుంది.
నువ్వుల నూనె
నువ్వులు ఎంతో రుచిగా ఉంటాయి. అయితే నువ్వుల నూనె మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ నూనె వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అందుకే దీనితో కండరాలకు మసాజ్ చేస్తే చాలా ప్రయోజనకరంగా ఉంటుందని రుజువైంది. ఇది కండరాలలో నొప్పి నుంచి ఉపశమనం కలిగించడమే కాకుండా తిమ్మిరిని కూడా తొలగిస్తుంది.