beauty tips: కాళ్లూ, చేతులు నల్లగా ఉన్నాయా? ఈ చిట్కాలను పాటించండి తెల్లగా మెరిసిపోతాయి
beauty tips: ఎంత తెల్లగా ఉండే వాళ్లైనా సరే ఎండలో తిరిగితే కాళ్లూ, చేతులు నల్లగా మారిపోతుంటాయి. అయితే కొన్ని చిట్కాలతో నల్లగా ఉన్న కాళ్లూ చేతులను తెల్లగా మార్చేయొచ్చు.

సాధారణంగా శరీరమంతా ఒక కలర్ లో ఉంటే కాళ్లూ చేతులు వేరే కలర్ లో ఉంటాయి. కొందరిలో శరీర భాగాలన్నీ తెల్లగా ఉంటే కాళ్లూ చేతులు మాత్రం కాస్త నలుపు రంగులో ఉంటాయి. దీనికి ఒక కారణం మెలనిన్ అనే పదార్థం. ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి రక్షించేందుకు మన చర్మం మెలనిన్ ను రిలీజ్ చేస్తుంది. దీంతో చర్మం కాస్త ముదురు రంగులోకి మారుతుంది. ముఖ్యంగా మన శరీర భాగాల్లో కాళ్లూ చేతులు మాత్రమే కాస్త నలుపురంగులో ఉంటాయి. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే అవి తెల్లగా మెరిసిపోతాయి. అవేంటంటే..
నిమ్మకాయ.. ప్రతి వంటగదిలో నిమ్మకాయ ఖచ్చితంగా ఉంటుంది. అందులోనూ ఇది వేసవి కాలం. ఈ సీజన్ లో నిమ్మరసం తాగడం వల్ల బాడీ కూల్ గా ఉంటుందని జనాలు వీటిని తప్పకుండా కొంటూ ఉంటారు. అయితే నిమ్మ నల్లగా ఉండే ప్లేసెస్ ను తెల్లగా మార్చడానికి ఎంతో సహాయపడుతుంది. ఎందుకంటే దీనిలో సహజ బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇందుకోసం నిమ్మరసాన్ని పిండి కొన్ని చుక్కల్ని చేతులకు, కాళ్లకు రాయండి. దీంతో మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
పెరుగు.. నల్లని చర్మాన్ని తెల్లగా చేయడానికి పెరుగు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలోని లాక్టిక్ యాసిడ్ బ్లీచింగ్ ఏంజెంట్ లా పనిచేస్తుంది. ఇందుకోసం ఒక టీ స్పూన్ పెరుగును తీసుకుని నల్లగా ఉండే ప్లేస్ లో అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత దానిపై కొన్ని నీళ్లు జల్లుతూ మసాజ్ చేస్తూ శుభ్రం చేయండి.
దోసకాయ.. కీరదోసకాయలో Natural astringent అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ఎంతో సహాయపడతాయి. వీటిలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మదురురంగులోకి మార్చే మెననిన్ ను కంట్రోల్ చేస్తుంది. ఇందుకోసం దోసకాయను మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దాన్ని కాళ్లకు, చేతులకు అప్లై చేయండి. ఒక పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోండి. తరచుగా దోసకాయను ఇలా ఉపయోగిస్తే.. నల్లగా ఉండే ప్లేసెస్ తెల్లగా మారుతాయి.
నారింజ.. నారింజలో ఉండే సి పుష్కలంగా సహజ బ్లీచింగ్ లా పనిచేసి చర్మాన్ని కాంతివంతంగా మెరిపిస్తుంది. ఇందుకోసం నారింజ రసాన్ని పిండి కాళ్లకూ చేతులకు పట్టించండి. పదిహేను నిమిషాల పాటు వదిలేసి ఆ తర్వాత నార్మల్ వాటర్ తో క్లీన్ చేయండి. తరచుగా ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
టొమాటో.. టొమాటోలల్లో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఎండకు కమిలిపోయిన చర్మాన్ని కాంతివంతంగా చేయడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు కాదు ఇది ప్రమాదకరమైన సూర్యకిరణాల నుంచి కూడా రక్షిస్తాయి. టొమాటోలల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్ మెరిసేలా చేస్తుంది.