చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలంటే ఇలా చేయండి..
ఎండాకాలం దగ్గరకొస్తున్నా చలి ఇంకా చంపేస్తోంది. ఈ చల్లగాలుల వల్ల లేనిపోని రోగాలొచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ గాలుల ప్రభావం మనపై పడకుండా మన శరీరాల్ని వెచ్చగా ఉంచుకోవాలి.
చలికాలంలో వేడిలేకుండా ఉండటం చాలా కష్టం. బాడీ టెంపరేచర్ పడిపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే శరీర ఉష్ణోగ్రత తగ్గడకుండా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో సహజంగా మన శరీరాల్ని వెచ్చగా ఉంచుకోవచ్చు. అదెలాగంటే..
Image: Getty Images
సరైన దుస్తులను ధరించండి
బయట వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు తప్పనిసరిగా శరీర వేడిని పెంచే దుస్తులనే వేసుకోవాలి. ఇవి మీ శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి సహాయపడతాయి. మీ సౌకర్యాన్ని బట్టి మీకు అవసరమైన విధంగా లేయర్లను జోడించొచ్చు లేదా తీసేయొచ్చు.
సూర్యరశ్మిలో ఉండండి
పగటిపూట సూర్యరశ్మిని పొందడానికి మీ గది కిటికీలను, డోర్లను తెరవండి. మీ ఇంటి ఇన్సులేషన్ ను మెరుగుపర్చడానికి రాత్రిపూట బ్లైండ్స్ ను , డ్రేప్లను మూసేయండి. ఉదయం, సాయంత్రం వేళల్లో కొద్దిసేపు సూర్యరశ్మిలో ఉండండి.
స్పైసీ ఫుడ్స్ ను తినండి
మీకు ఇష్టమైన స్పైసీ ఫుడ్స్ ను తినప్పుడు మీ నుదిటిపై చెమట పట్టడం మీరెప్పుడైనా గమనించారా? ఇలా ఎందుకు అవుతుందంటే స్పైసీ ఫుడ్ మీ శరీరాన్ని నిజంగా వేడెక్కిస్తుంది కాబట్టి. వాస్తవానికి స్పైసీ డైట్ మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీన్ని అతిగా తింటే మాత్రం సమస్యలు వస్తాయి. అందుకే దీన్ని మోతాదులోనే తినండి. ప్రత్యేకించి మీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు స్పైసీ ఫుడ్ ను అసలే తినకండి.
winter foods
వెచ్చని ఆహారాన్ని తినండి
ఆయుర్వేదం ప్రకారం.. కొన్ని ఆహారాలు శరీరాన్ని వేడెక్కించడానికి ఎంతో సహాయపడతాయి. ఈ ఆహారాలను వివిధ మార్గాల్లో తినొచ్చు. పసుపు, తేనె, అల్లం, దాల్చినచెక్క, గింజలు, గుడ్లు, మిరియాలు మొదలైనవి మన శరీరాల్ని వెచ్చగా ఉంచే కొన్ని పదార్థాలు.
శారీరకంగా చురుకుగా ఉండండి
మన శరీరంలో వేడి మన కదలికల ద్వారా ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా వ్యాయామం చేసేటప్పుడు మీ శరీర ఉష్ణోగ్రతను పెంచడానికి అనేక పద్ధతులు సహాయపడతాయి. అంటే ఇంటిని శుభ్రపరచొచ్చు. లేదా రన్నింగ్ కు వెళ్లొచ్చు. ఇంటి చుట్టూ క్లీన్ చేయొచ్చు. లేదా ఆటలు ఆడొచ్చు. వీటి ద్వారా మీ శరీరం చాలా చల్లగా ఉండే అవకాశమే ఉండదు. ఇవి మిమ్మల్ని వెచ్చగా ఉంచుతాయి.
సూప్ లను తాగండి
హీటర్లు, సూర్యరశ్మి ద్వారా మీ పరిసరాలను వేడెక్కించడమే కాకుండా.. మిమ్మల్ని మీరు లోపలి నుంచి వేడిగా కూడా ఉంచుకోవచ్చు. చలికాలంలో ఒక కప్పు వేడి వేడి సూప్ లను తీసుకోవడం ద్వారా మీ శరీరం లోపలి నుంచి వెచ్చగా ఉంటుంది. అయితే బయటినుంచి తెచ్చుకున్న సూప్ లకు బదులుగా ఇంట్లో తయారుచేసిన సూప్ లను తాగితేనే మంచిది. నిజానికి సూప్ ను తయారుచేయడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయంలో స్టవ్ నుంచి వచ్చే వేడి ఇంటిని కూడా వెచ్చగా చేస్తుంది.
కాళ్లకు సాక్స్ ను ధరించండి
ఇది కాస్త వింతగా కనిపించినప్పటికీ.. చలికాలంలో మన శరీరంలోని అన్ని భాగాలకంటే కాళ్లే ముందుగా చల్లగా అవుతాయి. పాదాలు వెచ్చగా ఉంటే శరీరం వేడిగా ఉంటుంది. అంతేకాదు ఇది నిద్రపోయే సమయం అని మీ మెదడుకు సంకేతం అందుతుంది. అందుకే రాత్రిళ్లు పడుకునే ముందు ఖచ్చితంగా సాక్సులను ధరించి పడుకోండి.
Vitamin B12
విటమిన్ బి 12, ఇనుము ను ఎక్కువగా తినండి
ఒకవేళ మీ శరీరంలో రక్తం తక్కువగా ఉంటే కూడా మీకు చలి బాగా పెడుతుంది. అంటే మీ శరీరమంతా ఆక్సిజన్ ను రవాణా చేయడానికి మీకు తగినంత ఎర్ర రక్త కణాలు ఉండవు. దీనివల్ల మీకు చల్లగా అనిపించొచ్చు. కొంతమంది బి 12 ను గ్రహించరు లేదా ఆహారం ద్వారా తగినంతగా పొందరు. గర్భధారణ సమయంలో ఎక్కువ ఇనుము అవసరమవుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు తక్కువ మొత్తంలో ఖనిజాన్ని కలిగి ఉంటారు. పౌల్ట్రీ, గుడ్లు లేదా చేపలలో బి 12 పుష్కలంగా ఉంటుంది. పౌల్ట్రీ, పంది మాంసం, సీఫుడ్, చిక్పీస్, ఆకు కూరలు ఇనుముకు మంచి వనరులు. అందుకే వీటిని ఖచ్చితంగా తినండి.