చలికాలంలో ఆస్తమా అదుపులో ఉండాలంటే.. ఈ చిట్కాలను పాటించండి
చలికాలంలో ఉబ్బసం సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. దీని లక్షణాలను నివారించాలంటే ఈ సీజన్ లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా..?

Image: Getty Images
ఉబ్బసం సమస్య బారిన పడినప్పుడు మన ఊపిరితిత్తుల వాయుమార్గాలు ఇరుకుగా మారుతాయి. అలాగే మన శరీరం ఎక్కువ శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల మనకు తగినంత గాలి అందదు. అంతేకాదు శ్వాస తీసుకోవడంలో ఇది ఇబ్బందిని కలిగిస్తుంది. అంతేకాదు ఇది శ్వాసకోశ సమస్యలను, దగ్గును కూడా ప్రేరేపిస్తుంది. చల్లని వాతావరణానికి గురికావడం, చల్లని గాలులను పీల్చడం వల్ల ఉబ్బసం వచ్చే అవకాశం ఉంది. చల్లని, పొడి గాలిని పీల్చినప్పుడు.. గది ఉష్ణోగ్రత వద్ద గాలిని పీల్చడం కంటే లైనింగ్ వేగంగా వోలాటిలైజ్ అవుతుంది. పొడి గాలి మార్గాలకు చిరాకు కలిగిస్తుంది. అలాగే ఇది ఉబ్బసం లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది.
asthma
శీతాకాల ఆస్తమా లక్షణాలు
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
శ్వాస తీసుకునేటప్పుడు విజిల్ సౌండ్ రావడం
దగ్గు
మాట్లాడటంలో ఇబ్బంది
ఛాతీ నొప్పి
ఛాతీలో బిగుతు భావన
చలికాలంలో ఉబ్బసం ఎందుకు తీవ్రమవుతుంది?
ఇతర కాలాలతో పోల్చితే చలికాలంలోనే ఉబ్బసం లక్షణాలు మరింత దిగజారిపోతాయి. ఎందుకంటే ఈ సమయంలో ఉబ్బసం ట్రిగ్గర్లు చాలానే ఉన్నాయి. అవేంటంటే..
చల్లని వాతావరణం
జలుబు, ఫ్లూ
ఛాతీ అంటువ్యాధులు
తడి, బూజు
దుమ్ము పురుగులు
సెంట్రల్ హీటింగ్, ఓపెన్ మంటలు, చెక్కను కాల్చే స్టవ్ లు
చలికాలంలో ఉబ్బసం లక్షణాలను తగ్గించడానికి చిట్కాలు
ఇంటిని చల్లగా, పొడిగా ఉంచండి
మీ ఇంట్లోకి దుమ్ము పురుగులు ఎక్కువగా వస్తున్నట్టైతే.. మీ ఇంటిని చల్లగా, పొడిగా ఉంచండి. ఉదాహరణకు ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఉపయోగించి పురుగుల పెరుగుదలను ఆపోచ్చు.
ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడానికి ప్రాక్టీస్ చేయండి
ఉబ్బసం సమస్య ఉన్నవాళ్లు తరచుగా నోటి నుంచే శ్వాసను పీల్చుకుంటూ ఉంటారు. నిజానికి మీ ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడం నోటి శ్వాస కంటే గాలిని మరింత వెచ్చగా చేస్తుంది. ముక్కు ద్వారా గాలిని పీల్చుకోవడం వల్ల గాలి ఊపిరితిత్తులకు చేరుకునే ముందు తీవ్రమైన చల్లని గాలిని బాగా మోడరేట్ అవుతుంది.
మందులను తీసుకోండి
మీ డాక్టర్ సిఫారసు చేసిన మందులను ఖచ్చితంగా ఉపయోగించండి. ఈ మందులు ఉబ్బసం లక్షణాలను తగ్గిస్తాయి. అలాగే సమస్య పెద్దది కాకుండా చేస్తాయి.
జలుబు, ఫ్లూ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి
చలికాలంలో జలుబు, ఫ్లూ వంటి శ్వాసకోశ అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఇది అదనపు ఉబ్బసం సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి ఉబ్బసం ప్రమాదాన్ని తగ్గించడానికి చేతులను పరిశుభ్రంగా కడగండి.