ఇలా దువ్వితే గనుక మీ జుట్టు ఎంత పొడుగ్గా పెరుగుతుందో
మనం ప్రతి రోజూ జుట్టును దువ్వుతాం. ఇది తప్పనిసరి కూడా. కానీ మనం సరిగ్గానే దువ్వుతున్నామా? లేదా? అనేది చూసుకోవాలి. ఎందుకంటే సరైన పద్దతిలో దువ్వితే మీ జుట్టు బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

హెయిర్ బ్రష్ చేయడం లేదా దువ్వడమనేది జుట్టు సంరక్షణలో ఒక ముఖ్యమైన భాగం. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టు ఉండాలంటే క్రమం తప్పకుండా జుట్టును ఖచ్చిచంగా దువ్వాలి. నిజానికి జుట్టును దువ్వడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.
Image: Getty Images
దువ్వడం వల్ల కలిగే జుట్టు ప్రయోజనాలు
వాతావరణంతో సంబంధం లేకుండా మీ జుట్టు సంరక్షణలో భాగంగా హెయిర్ బ్రష్ చేయడం లేదా దువ్వడం చాలా ముఖ్యమైన భాగం. మీ జుట్టును ఆరోగ్యంగా, అందంగా ఉంచడానికి ఇది బాగా సహాయపడుతుంది.
hair
జుట్టును సరైన మార్గంలో దువ్వడం వల్ల నెత్తిమీద కేశనాళికలు ఉత్తేజితమవుతాయి. అలాగే రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఎక్కువ పోషకాలు జుట్టుకు చేరడానికి సహాయపడుతుంది. అలాగే ఆక్సిజన్ కూడా జుట్టు మూలాలకు బాగా వెళుతుంది. ఇది జుట్టు బాగా పెరిగేందుకు సహాయపడుతుంది.
ఇది మృతకణాలను కూడా తొలగిస్తుంది. అలాగే నెత్తిమీద ఎక్స్ఫోలియేట్ చేయడానికి సహాయపడుతుంది. రోజుకు రెండుసార్లు మీ జుట్టును దువ్వడం వల్ల మీ నెత్తిమీద నుంచి చనిపోయిన జుట్టును సమర్థవంతంగా తొలగించొచ్చు. అలాగే కుదుళ్ల నుంచి కొత్త జుట్టు పెరగడానికి స్థలాన్ని సృష్టిస్తుంది. అలాగే కొత్త, బలమైన వెంట్రుకల పెరుగుదలకు సహాయపడుతుంది.
జుట్టును దువ్వడం వల్ల సెబాషియస్ గ్రంథులు ఉత్తేజితమవుతాయి. హెయిర్ షాఫ్ట్ వెంట నూనె సమానంగా పంపిణీ అవుతుంది. సెబమ్ అని పిలువబడే ఈ సహజ నూనె జుట్టుకు పోషణను అందిస్తుంది. అలాగే జుట్టును తేమగా ఉంచుతుంది.
క్రమం తప్పకుండా జుట్టు దువ్వడం వల్ల జుట్టు ఆరోగ్యానికి, పెరుగుదలకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. అందుకే జుట్టును ఖచ్చితంగా దువ్వాలని నిపుణులు సలహానిస్తున్నారు.
<p>comb-hairs</p>
జుట్టు పెరగడానికి జుట్టును ఎలా దువ్వాలి?
1. మీ జుట్టు రకానికి తగిన దువ్వెన లేదా బ్రష్ ను మాత్రమే కొనండి. తడి జుట్టును దువ్వితే వెడల్పాటి-దంతాలున్న దువ్వెనలు, మృదువైన దువ్వెలను వాడాలి. స్టైలింగ్ కోసం ప్యాడిల్ బ్రష్ లను ఉపయోగించాలి.
2. మీరు దువ్వే ముందు మీ జుట్టు శుభ్రంగా, ఎలాంటి స్టైలింగ్ ఉత్పత్తులు లేకుండా ఉండేలా చూసుకోవాలి. మీ జుట్టు తడిగా ఉంటే దువ్వడానికి ముందు దానిని సున్నితంగా ఆరబెట్టండి లేదా పాక్షికంగా ఆరనివ్వండి.
3. మీకు పొడి లేదా ఫ్రిజ్ జుట్టు ఉంటే తేమను జోడించడానికి, సులభంగా దువ్వేందుకు చిన్న మొత్తంలో హెయిర్ సీరం లేదా లీవ్-ఇన్ కండీషనర్ ను అప్లై చేయండి.
4. మీ జుట్టు తడిగా ఉన్నా లేదా పొడిగా ఉన్నా ఎప్పుడూ మూలాల నుంచి కాకుండా చివరల నుండి దువ్వండి. ఇలా చేస్తే మీ జుట్టు ఊడే అవకాశం తక్కువగా ఉంటుంది. చిక్కులు కూడా సులువుగా విడిపోతాయి.
5. మీకు మందపాటి లేదా పొడవాటి జుట్టు ఉంటే వెంట్రుకలను చిన్న చిన్న భాగాలుగా చేసి దువ్వండి. జుట్టంతా ఒకేసారి దువ్వితే ఇబ్బంది అవుతుంది. చిక్కులు కూడా అలాగే ఉంటాయి. మరిన్ని చిక్కులు పడే అవకాశం కూడా ఉంది.
6. చివర్లో దువ్విన తర్వాత క్రమంగా పైకి దువ్వండి. ఒకేసారి చిన్న విభాగాల గుండా దువ్వండి. ఈ విధానం చిక్కులను నివారించడానికి సహాయపడుతుంది. అలాగే విచ్ఛిన్నతను తగ్గిస్తుంది.