Wall Stains: గోడలపై పెన్సిల్, క్రేయాన్స్ మరకలు ఎలా శుభ్రం చేయాలి..?
ఆ మరకలు గోడల అందాన్ని కూడా పాడు చేసేస్తాయి. అలా అని శుభ్రం చేద్దాం అంటే... ఆ మరకలు అంత ఈజీగా వదలవు.

wall stains
ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. ఆ ఇల్లు ఎలా ఉంటుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. గోడల మీద పెన్నులు, పెన్సిల్స్, కలర్స్, క్రేయాన్స్ తో ఎలా పడితే అలా గీసేస్తూ ఉంటారు. మనం పిల్లలను ఎంత కంట్రోల్ చేయాలని చూసినా కూడా పిల్లలు ఏదో ఒక సమయంలో గీసేస్తూనే ఉంటారు. అలా పాడైన గోడలను శుభ్రం చేయడానికి పేరెంట్స్ చాలా తిప్పలు పడుతూ ఉంటారు. ఆ మరకలు గోడల అందాన్ని కూడా పాడు చేసేస్తాయి. అలా అని శుభ్రం చేద్దాం అంటే... ఆ మరకలు అంత ఈజీగా వదలవు. చాలా మంది.. వాటిని తొలగించలేక ఖర్చు ఎక్కువ అయినా సరే పెయింటింగ్స్ వేయించుకుంటూ ఉంటారు. అయితే... అంత ఖర్చు లేకుండా కూడా సులభంగా వాటిని తొలగించవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
పెన్సిల్ గీతలను తొలగించే మార్గాలు...
మీ పిల్లలు పెన్సిల్ తో గోడలపై పిచ్చి గీతలు గీసినట్లయితే.. మీరు ఎరేజర్ ఉపయోగించాలి. తెలుపు రంగు ఎరేజర్ తో గోడపై సున్నితంగా రుద్దడం వల్ల .. ఆ పెన్సిల్ గీతలను సులభంగా తొలగించొచ్చు. దీనితో పాటు... మైక్రోఫైబర్ వస్త్రాన్ని తేలికగా తడిపి, గుర్తులపై రుద్దండి. దీనివల్ల మరకలు కూడా మాయమవుతాయి.
క్రేయాన్స్ , రంగులను తొలగించే మార్గాలు
పిల్లలు గోడపై క్రేయాన్ లేదా రంగును పూసి ఉంటే, మీరు బేకింగ్ సోడాను ఉపయోగించి దానిని తొలగించవచ్చు. ఒక చెంచా బేకింగ్ సోడాతో కొద్దిగా నీరు కలిపి పేస్ట్ తయారు చేయండి. తరువాత వృత్తాకార కదలికలో కదిలించడం ద్వారా మృదువైన వస్త్రం లేదా స్పాంజితో మరకను శుభ్రం చేయండి.
మ్యాజిక్ ఎరేజర్ కూడా మీ పనిని సులభతరం చేస్తుంది..
దీనితో పాటు, మీరు మార్కెట్లో లభించే మ్యాజిక్ ఎరేజర్‌తో రంగును కూడా తొలగించవచ్చు. మార్కెట్ నుండి మ్యాజిక్ ఎరేజర్‌ను తెచ్చి, ఆపై గోడపై రుద్దండి. ఇది పెయింట్ దెబ్బతినకుండా ఎంత పెద్ద మరకలు అయినా సులభంగా తొలగించొచ్చు.
ఆహారం , పానీయాల మరకలను తొలగించే మార్గాలు
గోడపై పసుపు మరకలు కనిపిస్తే, వెనిగర్ దానిని తొలగించడంలో సహాయపడుతుంది. వెనిగర్ , నీటి ద్రావణాన్ని తయారు చేయండి. తరువాత స్ప్రే చేయడం లేదా వస్త్రాన్ని ఉపయోగించడం ద్వారా మరకను తుడవండి. దీనితో పాటు, మీరు డిష్‌వాష్ ఉపయోగించి మరకలను కూడా తొలగించవచ్చు. డిష్‌వాషింగ్ లిక్విడ్ , వేడి నీటిని కలపండి. తరువాత స్పాంజితో మరకను తుడిచి పొడి గుడ్డతో శుభ్రం చేయండి.