MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కెరిర్ లో ముందుకు దూసుకుపోవాలంటే... ఈ టిప్స్ తప్పనిసరి..!

కెరిర్ లో ముందుకు దూసుకుపోవాలంటే... ఈ టిప్స్ తప్పనిసరి..!

చాలా మంది పాత రెజ్యూమే వాడుతుూ ఉంటారు. అది చాలా పెద్ద పొరపాటు అనే విషయం గ్రహించాలి. మీరు కొత్తగా నేర్చుకున్న స్కిల్స్ ని అందులో కచ్చితంగా చేర్చాలి. 

2 Min read
Author : ramya Sridhar
| Updated : May 25 2022, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19

ప్రతి ఒక్కరూ తాము ఎంచుకున్న కెరిర్ లో ముందుకు దూసుకుపోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ.. తెలియక చేసే కొన్ని పొరపాట్లు... కెరీర్ లో ముందుకు వెళ్లకుండా ఆగిపోవడానికి కారణమౌతాయి. మనం కెరీర్ లో ముందుకు వెళ్లి.. ఉన్నత స్థానాలకు చేరుకోవాలి అంటే... ఈ ట్రిక్స్ ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఓసారి చూద్దాం..

29

కెరీర్ లో ఎదుగుదల ఉండాలంటే కంపెనీలు మారడం చాలా ముఖ్యమని చాలా మంది భావిస్తారు. అలా కంపెనీ మారాలి అంటే.. మనం ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవ్వాలి. అది ఒక్కటే సరిపోదు.. మన రెజ్యూమ్ ని అప్ డేట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం.చాలా మంది పాత రెజ్యూమే వాడుతుూ ఉంటారు. అది చాలా పెద్ద పొరపాటు అనే విషయం గ్రహించాలి. మీరు కొత్తగా నేర్చుకున్న స్కిల్స్ ని అందులో కచ్చితంగా చేర్చాలి.

39

కెరీర్ విషయంలో ముందుకు వెళ్లాలి అంటే తమకన్నా పెద్దవారి అభిప్రాయాలు తీసుకోవడంలో ఎలాంటి తప్పులేదు. అవసరమైతే సహాయం కూడా తీసుకోవచ్చు. మేనేజర్, కొలిగ్స్ సహాయంతో ముందుకు వెళ్లడంలో ఎలాంటి తప్పు లేదు.
 

49

చాలా మంది తమకు వచ్చే జీతంతో సరిపెట్టుకుంటూ ఉంటారు. అలా సరిపెట్టుకోకుండా... ఇంకా ఎక్కువ సాధించాలి అని పట్టుదలతో ఉండాలి. పట్టుదలతో ఉంటే.. మరింత ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది.

59

కంపెనీలు మారుతూ ఉంటే.. జీతం పెరుగుతుంది కదా అని చాలా మంది భావిస్తారు. అయితే.. తరచూ కంపెనీలు మారడం మీ భవిష్యత్తులో సమస్యలో పడే అవకాశం ఉంటుంది. కంపెనీలో కాస్త ఎక్కువ కాలం పని చేయాలి. అది మీకు భవిష్యత్తులో హెల్ప్ అవుతుంది.

69

రెజ్యూమ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రెజ్యూమ్ ఆకట్టుకునే వి ధంగా తయారు చేసుకోవాలి. దీని వల్ల  మీ కెరీర్ కి  ఎంతగానో ఉపయోగపడుతుంది.
 

79

నెట్ వర్క్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా ఉండాలి. మీ ఫోన్ ఎప్పుడూ నెట్ వర్క్ పరిధిలో ఉండేలా చూసుకోవాలి. అలా లేకపోతే.. మీరు ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే అవకాశాన్ని పొగొట్టుకున్నవారు అవుతారు. నెట్ వర్క్ పరిధిలో ఉండటం వల్ల మీ కెరీర్ కి ఉపయోగపడే అవకాశం ఉంది.

89

చాలా మంది తమ తోటి ఉద్యోగులను కించ పరిచడం లాంటివి చేస్తుంటారు.  లేదంటే.. బాస్ లను తిడుతూ ఉంటారు. ఒకరి ముందు మరొకరిని కించ పరుస్తూ ఉంటారు. దాని వల్ల.. మీరు అందరి ముందు చీప్ అయిపోయే అవకాశం ఉంది. ఆ పొరపాటు చేయకండి.
 

99

ఏవేవో కారణాలతో చాలా మంది వెంటనే ఉద్యోగాలు  మానేస్తూ ఉంటారు. అది చాలా పెద్ద పొరపాటు. మరో ఉద్యోగం వెతుక్కోకుండా... ఉన్న ఉద్యోగాన్ని వదిలేయడం మీకు చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఇది పోయినా.. ఇంకో ఉద్యోగం ఉంది అనే ధీమా ఉంటేనే... ఉద్యోగం మానేయాలి.
 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
Latest Videos
Recommended Stories
Recommended image1
Amla Benefits: రోజూ ఉసిరికాయలు తింటే ఏమవుతుంది?
Recommended image2
Manthena Hair Care Tip: ఈ సీక్రెట్‍తో వద్దన్నా కూడా జుట్టు పెరిగిపోతుంది
Recommended image3
Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved