తలనొప్పిని ఎలా తగ్గించుకోవాలో తెలియడం లేదా? ఇదిగో ఇలా చేస్తే చిటికెలో తగ్గిపోతుంది..
తలనొప్పి చిన్న సమస్యగా కనిపించినా.. దీనివల్ల ఏ పనులు కావు. ఇది శారీరక, మానసిక స్థితిని బాగా ప్రభావితం చేస్తుంది. కొన్ని కొన్ని సార్లు ఈ తలనొప్పి ప్రాణాంతక పరిస్థితులకు కూడా దారితీస్తాయి. అయితే కొన్ని సహజ చిట్కాలతో ఈ తలనొప్పిని తొందరగా తగ్గించుకోవచ్చు.
తలనొప్పి అంత తొందరగా తక్కువ కాదు. ఇది కొంతమందికి రెండు మూడు గంటలు ఉంటే.. ఇంకొంత మందికి మాత్రం రెండు మూడు రోజులు కూడా భరించలేని నొప్పి వస్తుంది. ఈ తలనొప్పి పెద్దవారిలో సర్వసాధారణంగా మారిపోయింది. కానీ ఇది రోజు వారి పనులకు ఆటంకం కలిగిస్తుంది. ఎన్నో ప్రాణాంతక అనారోగ్య సమస్యలకు కూడా దారితీస్తుంది.
తలనొప్పి రావడానికి కారణాలు చాలానే ఉన్నాయి. మందులను మోతాదుకు మించి ఉపయోగించడం వంటి కారణాల వల్ల కూడా తలనొప్పి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్లు కూడా తలనొప్పికి కారణమవుతాయి. ఊబకాయం, ధూమపానం, నిద్ర రుగ్మతలు, కెఫిన్ ను ఎక్కువగా తీసుకునే వారు తలనొప్పితో బాధపడే అవకాశం ఉంది. అయితే కొన్ని చిట్కాలను పాటిస్తే.. ఈ తలనొప్పిని చిటికెలో తగ్గించుకోవచ్చు.
Image: Getty Images
పుష్కలంగా నీటిని తాగండి
నీటిని పుష్కలంగా తాగితేనే మీరు ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే మీ బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతుంది. దీనివల్ల కూడా తలనొప్పి వస్తుంది. తీవ్రమైన తలనొప్పికి నిర్జలీకరణం ఒక కారణమని అనేక పరిశోధన అధ్యయనాలు కూడా వెల్లడించాయి. నిర్జలీకరణం చిరాకుకు దారితీస్తుంది. ఇది మీ ఏకాగ్రతను తగ్గిస్తుంది. అందుకే బాడీ డీహైడ్రేషన్ సమస్యను తగ్గించడానికి నీటిని పుష్కలంగా తాగండి. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లను తక్కువగా తినండి.
మీ ఆహారంలో మెగ్నీషియం ను చేర్చండి
మెగ్నీషియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. అలాగే ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్, నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం.. మన శరీరంలో మెగ్నీషియం లోపిస్తే మైగ్రేన్ తలనొప్పి వస్తుంది.
Image: Getty Images
ఆల్కహాల్ ను ఎక్కువగా తాగకండి
ఆల్కహాల్ మంటకు దారితీస్తుంది. అలాగే ఇది కొన్ని న్యూరోనల్ మార్గాలను సక్రియం చేస్తుంది. ఇది రక్త నాళాలను కూడా విస్తృతం చేస్తుంది. ఆల్కహాల్ ను తాగే జనాభాలో మూడింట ఒక వంతు మంది తరచుగా తలనొప్పితో బాధపడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
సరైన నిద్ర
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్స్, నేషనల్ సెంటర్ బయోటెక్నాలజీ ఫర్ మెడిసిన్స్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. నాణ్యతలేని నిద్ర, నిద్రలేమి వల్ల విపరీతమైన తలనొప్పి వస్తుంది. అందుకే తలనొప్పి తగ్గాలంటే ప్రశాంతంగా నిద్రపోవాలి.
headache
హిస్టామిన్ అధికంగా ఉన్న ఆహారాన్ని నివారించండి
హిస్టామిన్ అనేది శరీరంలో ఉండే ఒక రకమైన రసాయనం. ఇది రోగనిరోధక, జీర్ణ, నాడీ వ్యవస్థలను ప్రభావితం చేస్తుంది. హిస్టామిన్ అత్యంత సాధారణ లక్షణం తలనొప్పి లేదా మైగ్రేన్. మైగ్రేన్ వ్యాధికారక వ్యాధిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.