ఈ మిస్టేక్స్ వల్లే చుండ్రు మరింత పెరుగుతుంది..
చుండ్రు సమస్యను వదిలించుకోవాలనే ప్రాసెస్ లో చాలా మంది కామన్ గా కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. వాటి వల్లే డాండ్రఫ్ మరింత పెరుగుతుంది. చుండ్రు సమస్యను పూర్తిగా వదిలించుకోవాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే..

Dandruff problem
జుట్టును పట్ల చూపే అతికేరింగ్ , సంరక్షణ చర్యల మూలంగానే చుండ్రు సమస్య మరింత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చుండ్రు మూలంగా జుట్టు కాంతిని కోల్పోవడమే కాదు.. హెయిర్ ఫాల్ సమస్య కూడా వస్తుంది. అయితే చుండ్రును శాశ్వతంగా వదిలించుకోవాలనే ప్రాసెస్ వల్ల జుట్టు ఆరోగ్యంతో పాటుగా అనేక చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే చుండ్రు సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చండ్రును వదిలించుకోవాలన్నా, జుట్టు ఆరోగ్యంగా ఉండాలన్నా, చర్మ వ్యాధులు సోకుకుండా ఉండాలన్నా ఈ జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి..
జుట్టుకు పట్టిన మురికిని, దుమ్ము ధూళిని తొలగించడానికి షాంపూను తప్పనిసరిగా పెట్టాల్సిందే. అయితే జుట్టుకు ప్రతిరోజూ షాంపూ పెట్టడం మాత్రం అంత మంచి పద్దతి కాదు. రోజూ జుట్టుకు షాంపూ పెట్టడం వల్ల సెబమ్ చెమటలో కలిసిపోతుంది. అది పొరలుగా తయారయ్యి చుండ్రు తయారవ్వడానికి అనూకూల వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి రోజూ హెడ్ బాత్ చేసినా.. షాంపూను మాత్రం పెట్టకండి. ఎందుకంటే జుట్టు అవసరమైన పోషణను నూనెలను లేకుండా చేసి.. జుట్టు పట్టు కోల్పోయేలా చేస్తుంది. అంతేకాదు డాండ్రఫ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలేమీ అటాక్ చేయకూడదంటే రెండు లేదా మూడు రోజులకోసారి హెయిర్ కు షాంపూను పెట్టండని నిపుణులు సూచిస్తున్నారు.
జుట్టుకు కండీషనర్ ను ఉపయోగించకపోవడం వల్ల కూడా చండ్రు సమస్య అటాక్ చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే హెయిర్ కు షాంపూను అప్లై చేసినప్పుడు జుట్టుకు పట్టిన మురికితో పాటుగా సెబమ్ ను కూడా తొలగిస్తుందట. కాగా కండీషనర్ చేయడం వల్ల సెబమ్ మళ్లీ తలను చేరుకుంటుంది. కండీషనర్ వల్ల జుట్టుకు అవసరమైన పోషకాలు అందుతాయి. అంతేకాదు ఇది జుట్టును కాంతివంతంగా చేసి డ్రైనెస్ ను నివారిస్తుంది. ఒకవేళ మీరు కండీషనర్ ను వాడకపోతే మాత్రం డాండ్రఫ్ పక్కాగా పెరుగుతుంది.
చుండ్రు పెరగడానికి మరో కారణం ఫంగస్ పెరుగుదల. ఈ ఫంగస్ జుట్టు పరిశుభ్రంగా లేకపోతే విపరీతంగా పెరుగుతుందట. మలాసెజియా అనే ఫంగస్ పెరగడం వల్ల డాండ్రఫ్ వస్తుంది. ఈ ఫంగస్ ప్రతి ఒక్కరి చర్మంపై కూడా ఉంటుంది. కానీ ఈ ఫంగస్ ఎక్కువగా ఆయిలీ స్కిన్ వాళ్లలోనే ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఇవి స్కిన్ ఆయిల్ న్ ఫీడ్ చేస్తాయట. కాబట్టి కొందరిలో ఇతరుల కన్నా ఎక్కువ జిడ్డు ఉంటుంది. వారిలోనే చుండ్రు సమస్య ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
హెడ్ బాత్ సరిగ్గా చేయకపోతే కూడా చుండ్రు మరింత పెరిగే అవకాశముంటుంది. జుట్టుకు అంటుకున్న మురికి, దుమ్ము దూళీ వదలకపోయినా, నెత్తికి నూనె ఎక్కువగా ఉన్నా చుండ్రు ఏర్పడుతుంది. కాబట్టి తలస్నానం చేసేటప్పుడు జుట్టును సరిగ్గా క్లీన్ చేయండి.
జుట్టును సరిగ్గా దువ్వకపోతే కూడా చుండ్రు సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అవును జుట్టును దువ్వడం వల్ల నెత్తికి రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. అలాగే చర్మ కణాలను కూడా తొలగిస్తుందట. అంతేకాదు జుట్టును సరిగ్గా దువ్వడం వల్ల స్కాల్ప్ లోని మురికి వదులుతుంది. అలాగని జుట్టును అతిగా దువ్వకూడదు. దీనివల్ల జుట్టు పటుత్వం కోల్పోయి విపరీతంగా ఊడిపోయే ప్రమాదం ఉంది. అలాగే నెత్తి నొప్పి వస్తుంది. కాబట్టి జుట్టును నెమ్మదిగా దువ్వండి.