MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Hemoglobin: రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఆహారాలు ఇవి..!

Hemoglobin: రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఆహారాలు ఇవి..!

Hemoglobin: రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే ఐరన్ లోపం ఏర్పడుతుంది. దీంతో రక్తహీనత సమస్యతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గకుండా చూసుకోవాలి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 21 2022, 03:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గితే ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గితే.. ఐరన్ తగ్గుతుంది. దీంతో మీరు రక్తహీనత సమస్య బారిన పడాల్సి వస్తుంది. అంతేకాదు ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు కారణమవుతుంది. ఈ హిమోగ్లోబిన్ లోటు ఎక్కువగా మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. 
 

28

ఎర్ర రక్తకణాలో  కనిపించే ఇనుము ఎక్కువగా ఉండే ప్రోటీనే హిమోగ్లోబిన్. ఇది శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్ సక్రమంగా సరఫరా కావడానికి సహాయపడుతుంది. ఒకవేళ ఇది తగ్గితే తీవ్రమైన అలసట, తలనొప్పి, మైకము, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.  అందుకే హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం  ప్రకారం.. ఈ క్రింది ఆహారాలు హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచుతాయి. 

38

ఎండుద్రాక్ష  (raisins)

ఎండుద్రాక్షల్లో రాగి, ఇనుము పుష్కలంగా ఉంటాయి. ఇవి హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడమే కాదు ఎర్ర రక్తకణాలను కూడా ఏర్పరుస్తాయి. 
 

48

అమరాంత్ ఆకులు (Amaranth leaves)

ఈ ఆకుల్లో ఇనుము అధిక మొత్తంలో ఉంటుంది. ఈ ఆకులు ఎర్ర రక్త కణాల సంఖ్యను బాగా పెంచుతాయి. అలాగే హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా బాగా పెంచుతాయి. 

58

చనా (Chana)

కాల్చిన చనాలను తీసుకుంటే ఎంతో మంచిది. వీటిలో ఇనుము, ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఈ రెండు శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతాయి. 
 

68

ఖర్జూరాలు (Dates)

ఖర్జూరాలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఇనుముకు ఏ లోటూ ఉండదు. ఇవి ఎరిథ్రోసైట్ల సంఖ్యను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. దీంతో హిమోగ్లోబిన్ స్థాయిలు బాగాపెరుగుతాయి. అలాగే ఇవి ఎర్రరక్తకణాల సంఖ్యను కూడా పెంచుతాయి. ఖర్జూరాల్లో విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచుగా తినడం వల్ల రక్తహీనత సమస్య పోతుంది. 
 

78

Bajra

చిరు ధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఇనుము లోపం చాలా మటుకు తగ్గుతుంది. ఇవి హిమోగ్లోబిన్, సీరం ఫెర్రిటిన్ స్థాయిలను కూడా మెరుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

88

నువ్వులు (Sesame seeds)

నువ్వుల్లో రాగి, ఇనుము, ఫ్లేవనాయిడ్లు, ఫోలెట్ వంటి ఇతర ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తహీనత సమస్యను నుంచి ఉపశమనం కలిగించడంతో పాటుగా హిమోగ్లోబిన్ స్థాయిలను కూడా పెంచుతాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
మీ శరీరానికి నిజంగా బిర్యానీ అవసరమా? 60 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా !
Recommended image2
Summer: ఎండలని కూల్ వాటర్ తాగుతున్నారా? తర్వాత జరిగేది ఇదే..!
Recommended image3
Dandruff: ఇదొక్కటి వాడితే..మీ జీవితంలో చుండ్రు రాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved