పిల్లల్లో మధుమేహాన్ని నియంత్రించాలంటే ఇలా చేయండి..
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కొన్ని రకాల ఆహారాలు ఎంతో సహాయపడతాయి. ఇలాంటి వాటిని పిల్లలకు పెడితే.. వారి బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

diabetes
డయాబెటిస్ పెద్దవారిలో సర్వసాధారణ సమస్య. కానీ ఇటీవల కాలంలో పిల్లల్లో కూడా ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. జీవనశైలి సరిగ్గా లేకపోవడం, పేలవమైనన ఆహారాలపు అలవాట్ల వల్లే పిల్లలు, కౌమారులు డయాబెటీస్ బారిన పడుతున్నారని డాక్టర్లు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పిల్లల రక్తంలో చక్కెర స్థాయిలను ఎలా నియంత్రించాలో? టైప్ 2 డయాబెటిస్ ను ఎలా అధిగమించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు శరీరంలో మంటను తగ్గించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి ఎలాంటి ఆహారాలను పిల్లలకు పెట్టాలంటే..
apples
ఆపిల్
ఆపిల్స్ లో ఫైబర్ కంటెంట్, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో పాలీఫెనాల్స్, మొక్కల ఆధారిత రసాయనాలు కూడా ఉంటాయి. ఇవి టైప్ 2 డయాబెటిస్ ను, గుండె జబ్బులను నివారించడానికి సహాయపడతాయి. ఆపిల్ ను తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
క్యారెట్లు
డయాబెటిస్ ఉన్న పిల్లల రోజువారీ ఆహారంలో క్యారెట్లను చేర్చడం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడుతుంది. క్యారెట్లలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్నప్పటికీ.. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను పెంచదు. అందుకే డయాబెటీస్ ఉన్న పిల్లలకు క్యారెట్లను తప్పకుండా ఇవ్వాలి.
చియా విత్తనాలు
చియా విత్తనాల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. డయాబెటిస్ కేర్ లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం.. చియా విత్తనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి. అలాగే ఇది టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు
పెరుగు
డయాబెటీస్ పేషెంట్లకు పెరుగు ఎంతో మంచి చేస్తుంది. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా) అని పిలువబడే సూక్ష్మజీవులు అన్ని రకాల హానికరమైన బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పోరాడటానికి రోగనిరోధక శక్తికి సహాయపడతాయి. వైరస్ కు వ్యతిరేకంగా పోరాడే కణాల పరిమాణాన్నిపెంచడం ద్వారా అవి వ్యాధికి వ్యతిరేకంగా పోరాడటానికి కూడా సహాయపడతాయి. పెరుగు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
షుగర్ వ్యాధి ఉన్న పిల్లలు ప్రాసెస్ చేసిన మాంసాన్ని అసలే తినకూడదు. ఎందుకంటే వాటిలో కొవ్వు, ఉప్పు ఎక్కువగా ఉంటాయి. చక్కెరకు కూడా దూరంగా ఉండాలి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలో సహాయపడతాయని సర్వేలు చెబుతున్నాయి.