- Home
- Life
- పెళ్లైన పురుషులు తప్పక తినాల్సిన ఆహారాలు ఇవే.. వీటిని తింటే స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుంది..
పెళ్లైన పురుషులు తప్పక తినాల్సిన ఆహారాలు ఇవే.. వీటిని తింటే స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుంది..
best foods: సంతానోత్పత్తి సమస్యలు తొలగించడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా పురుషులు వీటిని తింటే స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం చాలా మంది సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పురుషుల్లో వయస్సు పెరిగే కొద్దీ సంతానోత్పత్తి తగ్గుతుంది. పురుషుల్లో.. వీర్యకణాల నాణ్యత వయస్సుతో పాటుగా క్షీణించడం ప్రారంభమవుతుంది. కానీ వైవాహిక జీవితం పిల్లలతోనే సార్థకం అవుతుందని పెద్దలంటారు. అందుకే పురుషుల్లోసంతానోత్పత్తి సమస్య రాకూడదంటే.. పురుషులు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. దీంతో మీరు ఏరకంగా బలహీనంగా మారే అవకాశం ఉండదు. ఇందుకోసం మంచి డైట్ ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.
ముఖ్యంగా సంతానోత్పత్తి సమస్యలు తొలగిపోవాలన్నా.. రాకూడదన్నా.. ఆయిలీ ఫుడ్స్, జంక్ ఫుడ్ ను అస్సలు తినకూడదు. వీటికి బదులుగా ఆరోగ్యకరమైన పండ్లు, కూరగాయలను ఎక్కువగా తింటూ ఉండాలి.
టెస్టోస్టెరాన్ హార్మోన్ యొక్క పనితీరు పురుష సంతానోత్పత్తిని పెంచడమే కాకుండా ఎముకల బలం, కండరాల పెరుగుదలకు కూడా సహాయపడుతుంది. కానీ ఇది వివిధ కారణాల వల్ల లోపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇంట్లో లభించే కూరగాయలతోనే ఈ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. టెస్టోస్టెరాన్ హార్మోన్ ను పెంచడానికి ఏయే కూరగాయలను తినాలో తెలుసుకుందాం పదండి.
ఆకుకూరలు: ఆకుకూరలు తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. ముఖ్యంగా పురుషులు వీటిని క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పురుషులు ప్రతిరోజూ ఆకుకూరలు తింటే వారి సంతానోత్పత్తి మెరుగ్గా ఉంటుంది. ఎందుకంటే ఆకుకూరల్లో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది, ఇది టెస్టోస్టెరాన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.
బచ్చలికూర.. బచ్చలి కూర మెగ్నీషియం యొక్క ఉత్తమ ఆహార వనరులలో ఒకటి. ఇది కండరాల పెరుగుదలకు ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది అన్ని వయస్సుల పురుషులలో పునరుత్పత్తి పని తీరును మెరుగుపరుస్తుంది.
ఉల్లిపాయ: పురుషుల ఆరోగ్యానికి ఉల్లిపాయ చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది టెస్టోస్టెరాన్ ను పెంచడంలో చాలా సహాయపడుతుంది. కూరగాయలు, వంటకాల రుచిని పెంచడానికి దీనిని ఉపయోగించినప్పటికీ, ఉల్లిపాయలను పచ్చిగా తినడం వల్ల శరీరంపై మంచి ప్రభావం చూపుతుంది. పోషకాలు కూడా బాగా అందుతాయి.
వెల్లుల్లి: వెల్లుల్లి, ఉల్లిపాయల్లో డయలైల్ డైసల్ఫైడ్ అనే రసాయనం ఉంటుంది. ఇది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని పెంచే హార్మోన్ విడుదలను ప్రోత్సహిస్తుంది.
అల్లం: అల్లాన్ని వివిధ ఆహారాల్లో ఉపయోగాస్తారు. ఈ అల్లం పురుషుల సంతానోత్పత్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. అల్లం తినడం ద్వారా టెస్టోస్టెరాన్ స్థాయిలు బాగా పెరుగుతాయి. దీనిని నేరుగా తినవచ్చు లేదా టీ ద్వారా కూడా తీసుకోవచ్చు.